Unknown
"రామనాథం గారు పోయారట" అమ్మ చెప్పింది. నేనేమి పలకపోవడంతో మళ్ళీ తనే అంది - "మీ నాన్నగారు ఆయన మంచి స్నేహితులు, వూర్లోనే వున్నావు కదా పోనీ ఒకసారి వెళ్ళి చూసిరారాదూ"
"సరే వెళ్తాలే" అన్నాను చదువుతున్న పేపరు పక్కన పెట్టి.
నాన్న బతికున్నప్పుడు కూడా రామనాథంగారి గురించి చాలా సార్లు చెప్పేవాడు. ఆయన తరచుగా స్నేహితులతో చుట్టపక్కాలతో గొడవపడే విషయాలే ఎక్కువగా చెప్పినట్లు గుర్తు. రామనాధంగారికి మా నాన్న తప్ప ఇంకెవరూ స్నేహితులు లేరనీ కూడా చెప్పారు. నాన్న ఎలాగూ లేరు కాబట్టి ఆయన తరఫున కనీసం నేనైనా వెళ్ళి చూసి రావాలని అమ్మ ఆలోచన.
***
నేను అక్కడికి వెళ్ళేసరికి అట్టే జనం కూడా లేరు. ఒక మనిషి పోతే కనీసం పది మందైనా రాకపోతే ఇంక ఆయన బ్రతికి ఏం సాధిచినట్లు అనుకున్నాను. నన్ను కనీసం గుర్తుపట్టి పలకరించేవాళ్ళు కూడా లేరక్కడ. సాంప్రదాయబద్ధంగా శవాన్ని పడుకోబెట్టి, దండలూ అవీ వేసున్నారు. తల దగ్గర దీపం పక్కనే వాళ్ళ అబ్బాయి అనుకుంటా కూర్చోనున్నాడు. గడప అవతలగా ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో రామనాధంగారి భార్య కూర్చోని చెంగు నోటికి అడ్డం పెట్టుకోని చిన్నగా ఏడుస్తోంది.
నేను శవం దగ్గరగా వెళ్ళి నమస్కారం చేసుకున్నాను. పల్చటి మనిషి, చామనఛాయ, తల మీద ఎక్కువగా వెంట్రుకలు లేవు, చిరాకుగా వున్నట్టు వుంది ముఖం. కొందరి ముఖాలంతే... ప్రతిదానికి చిరాకు పడుతున్నట్టు వుంటాయి. అలాంటి మనిషి అందరితో గొడవలు పెట్టుకున్నాడంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు అనుకున్నాను. అక్కడినుంచి రెండడుగులు వెనక్కి వేసి వాళ్ళ అబ్బాయిని పలకరించాలా లేదా అని ఆలోచించాను. అంతలో అతనే గుర్తుపట్టాడు -
"భీమేశ్వర్రావు గారి అబ్బాయా మీరు..?" అడిగాడు అనుమానంగా.
"అవునండీ.." అన్నాను ఇంకేం చెప్పాలో తెలియక.
"నాన్నకి మీ నాన్నగారు ఒక్కళ్ళే మంచి స్నేహితుడు... ఎప్పుడూ ఆయన్నే తల్చుకుంటుండేవారు.." అన్నాడు బాధగా.
"బాధ పడకండి.. మళ్ళీ స్నేహితులు కలుసుకోని వుంటారు" అన్నాను పైకి చూపించి. అతను చిన్నగా నవ్వాడు.
"ఇంకెవరైనా రావాలా?" అడిగాను ఏదో ఒకటి అడగాలి కాబట్టి.
"అన్నయ్య నాగ్పూర్ నుంచి బయల్దేరాడు. ఇంకొంచెం సేపట్లో రావాలి. నేను బాంబేలో వుంటాను. నాన్నకి ఆరోగ్యం బాగాలేదని తెలిసి నిన్నే వచ్చాను" చెప్పాడతను.
"సరే" అంటూ మళ్ళీ రామనాధంగారికి చేతులు జోడించి బయల్దేరాను.
ఆ వీధి చివర ఒక చిన్న పాకలో టీ కొట్టు చూసి అక్కడ ఆగి టీ చెప్పాను. అప్పటికే అక్కడ నలుగురైదుగురు కూర్చోని మాట్లాడుకుంటున్నారు.
"ఎవరో పోయారట" అడిగాడు అప్పుడే లోపలికి అడుగుపెడుతున్న బట్టతలాయన.
"అదే మన చిరాకు రామనాథం లేడూ.. రామనాధం.." ఒకాయన అన్నాడు వెటకారంగా.
"హమ్మయ్య.. పోయాడా? ఇంక మనకు రోజు ఆ పిచ్చోడితో గొడవలు తప్పినట్లే.." అన్నాడా మొదటి వ్యక్తి నవ్వుతూ.
"మరే లేకపోతే ఈ పాటికి ఇంత ప్రశాతంగా వుండేదా? ఎవరిమీదో అరుస్తూ గోల చేస్తుందేవాడు కాదూ" ఇంకెవరో గట్టిగా నవ్వారు.
చనిపోయిన వాళ్ళ గురించి అలా మాట్లాడుకోవడం తప్పుగాను, ఇబ్బందిగాను అనిపించింది నాకు.
"ఎందుకండీ చనిపోయినవాళ్ళ గురించి అట్లా మాట్లాడతారు" అన్నాను నేను కల్పించుకోని.
"మీరెవరు? ఆయన బంధువా?" ఆడిగారు.
"లేదండి.. తెలిసినాయన. చూడానికి వచ్చాను" చెప్పాను టీ అందుకుంటూ.
"తెలిసినాయనా? ఆయన గురించి పూర్తిగా తెలియదనుకుంటా... లేకపోతే మీరు ఇలా మాట్లాడరు"
"ఏమైనా చనిపోయిన తరువాత ఎవరినీ అలా కించపరిచేలా మాట్లాడకూడదు" అన్నాను నేను. అక్కడ వున్నవాళ్ళందరూ ముఖముఖాలు చూసుకున్నారు.
"ఆయన మమ్మల్ని పెట్టిన ఇబ్బందుల గురించి వింటే మీరుకూడా మాలాగే అదే మాటంటారు... ఈ వీధిలో వున్నవాళ్ళందరితో గొడవపడందే రోజు గడవదు ఆయనకి తెలుసా" చెప్పాడు మధ్యలో కూర్చున్న వ్యక్తి.
ఈ వ్యవహారం ఏదో కొత్తగా వుంది నాకు. నాన్న చెప్పినంతలో రామనాధంగారి గురించి ఇంత చెడుగా ఎప్పుడూ చెప్పలేదు. ఏవో ఆదర్శాలు, నియమాలు అంటూ చాలా మందితో గొడవలు పడేవారని నాన్న చెప్పినా, అతనంటే పడనివాళ్ళు ఇంతమంది వున్నారా అని ఆశ్చర్యం కలిగింది. అసలు అదేమిటో తెలుసుకోవాలని వాళ్ళ ఎదురుగా కూర్చున్నాను.
"ఏం చేసేవాడు?" అడిగాను.
" ఏం చేసేవాడా? ప్రతి దానికి చిరచిరలాడుతుంటాడు... అందుకే చిరాకు రామనాథం అని పేరు పెట్టారు మా వీధి కుర్రాళ్ళు. ఆయనకి అదో రకమైన పిచ్చి.. అన్నీ రూల్ ప్రకారమే జరగాలంటాడు.. సిగ్నల్ పడ్డ తరువాతే బండి కదలాలంటాడు.. రోడ్డుకి ఎడమ వైపే నడవాలంటాడు.. అదేంటి.. ఆ.. జీబ్రా క్రాసింగ్.. అక్కడే రోడ్డు దాటాలంటాడు.. ఎవరైనా అట్లా చెయ్యకపోతే మనిషికి ఎంత చిరాకో చెప్పలేము.." చెప్పాడు నా కుడివైపున్న వ్యక్తి.
"అందులో తప్పేముంది?"
"మీకు అలాగే అనిపిస్తుంది... అక్కడికి మేమేమీ రూల్స్కి విరుద్ధంగా నడుచుకుంటామని కాదు.. కానీ ఈ ట్రాఫిక్లో అవన్నీ ఎక్కడ సాధ్యమౌతాయి చెప్పండి... "
"అయితే"
"అయితే ఏమిటి.. ఆ రామనాధం వీధి వెంట పోతుంటే ఎవరో టర్నింగ్ తిరుగుతూ చెయ్యి చూపించలేదనో, రోడ్డుకి అడ్డంగా నడుస్తున్నాడనో పట్టుకునేవాడు.. ఇహ వాళ్ళతో వాదన... రూల్స్ ఒప్ప జెప్పడం, సెక్షన్లు చెప్పి నువ్వు చేస్తున్న పనికి ఇంత జరిమానా వుందని ఒకటే గొడవ.." చెప్పాడు మరొకాయన.
"డబ్బులు తీసుకునేవాడా?" అడిగాను.
"తీసుకోని వదిలేసినా బాగుండు... ఇచ్చినా తీసుకునేవాడు కాదు.. పైగా లంచం ఇస్తావా అని మరో గొడవ చేసేవాడు..."
"మరి?"
"ఎవరైనా ట్రాఫిక్రూల్ తప్పితే బలవంతంగా పోలీసు దగ్గరకి తీసుకెళ్ళి చెలాన వ్రాయమనేవాడు..." అంటూ అతను పక్కనే వున్న ట్రాఫిక్కానిస్టేబుల్ని చూపించాడు. అతను తల నిలువుగా వూపుతూ అన్నాడు
"అమ్మో.. అతను వీధిలో నడుస్తుంటే మాకే భయం వేసేది.. ఎవడో సిగ్నల్ దాటేసి వెళ్ళాడని మమ్మల్ని పట్టుకోని వాయించేసేవాడు.. మీరు వుండి ఏం చేస్తున్నారని నిలదీసేవాడు.." అంటూ నిట్టూర్చాడు కానిస్టేబుల్.
వాళ్ళు ఎంత చెప్పినా అతను చేసినదాంట్లో నాకేమీ తప్పు కనిపించలేదు. అదే అన్నాను వాళ్ళతో.
"మీకు అలాగే అనిపిస్తుంది లెండి.. రూల్స్ మాట్లాడటం చాలా సులభం.. పాటించాలంటేనే తెలిసొస్తుంది.." చెప్పాడు బట్టతలాయన.
"ఆయన పాటించేవాడు కాదా?" అడిగాను మరింత కుతూహలంగా. సదరు రామనాధంగారి విషయాలు కొత్తగానూ, విచిత్రంగాను అనిపించసాగాయి నాకు.
"ఎందుకడుగుతారులే.. ఆయన పాటించక పోవడమా? మిన్ను విరిగి మీద పడ్డా తప్పేవాడు కాదు... అదే సమస్యంతా... ఆయన చెయ్యడు ఇంకొకళ్ళని చెయ్యనివ్వడు.. మొన్నా మధ్య సిగ్నల్ దగ్గర ఆయన బండి మీద వున్నాడు. వెనకెవరో హారన్ కొట్టాడని బండి దిగి అతనితో గొడవ పెట్టుకున్నాడు.. ట్రాఫిక్ అంతా ఆగిపోయింది.." చెప్పాడు కానిస్టేబుల్. మరొకళ్ళు అందుకున్నారు -
"ఆ ఇంట్లో వాళ్ళు ఈయనతో ఎట్లా భరించారో గానీ.. సినిమా హాలుకి వెళ్తాడా.. ఎవరో లైన్ తప్పి వచ్చి టికెట్ తీసుకున్నాడని వాడితో గొడవ.. సినిమా అయినా వొదులుకుంటాగానీ ఇలా లైన్ తప్పి వచ్చేవాళ్ళను వదలను అంటాడు.. పిచ్చి కాకపోతే ఏమిటి?" అన్నాడు.
" ఆయనగారి రూల్స్ పిచ్చి తట్టుకోలేకే “చిరాకు రామనాధం” అనేవాళ్ళు అందరూ.. ఆయనకేమో మమ్మల్ని చూస్తే చిరాకు.. మాకు ఆయన్ని చూస్తే చిరాకు.." గట్టిగా నవ్వారు అందరూ.
"పొద్దున్నే నీళ్ళ పంపు దగ్గర గొడవ... లైన్లో రమ్మంటాడు... మొన్నామధ్య ఆ కనకయ్యని కొట్టినంత పని చేశాడు.."
"అవును... అదే కోపంతో మా ఇంట్లో కరెంట్ మీటర్ టాంపర్ చేశానని పట్టించాడు.. నా నా గడ్డి కరిచి లంచాలిచ్చి మళ్ళీ మీటర్ వేయించుకుంటే.. లంచాలెందుకు ఇచ్చావని మళ్ళీ గొడవకొచ్చాడు.." చెప్పాడు కనకయ్య. అప్పటి దాకా వింటున్న టీ కొట్టు కుర్రాడు కూడా వంత పాడాడు -
"ప్లాస్టిక్ కవర్లు వాడద్దని నా మీద ఒక రోజు గొడవ... పర్యావరణం అంటాడు... కవర్లతో ప్రమాదం అంటాడు.. మీరే చెప్పండి నేనొక్కణి వాడితే ప్రపంచం పాడై పోతుందా? నేనొక్కడ్నే మానేస్తే ఆగిపోతుందా?" అన్నాడు.
ప్రతి ఒక్కరికీ ఆయనతో గొడవలున్నాయని అర్థం అయ్యింది. అర్థం కానిదల్లా ఒక్కటే - రామనాథంగారు చెప్పినవన్నీ సబబుగానే వున్నాయి ఆ విషయాన్ని వీళ్ళెందుకు అర్థం చేసుకోవటం లేదు అని.
టీ డబ్బులు ఇచ్చేసి మళ్ళీ రామనాధంగారింటికి వెళ్ళాను. లోపలికి వెళ్ళగానే ఆయన చిన్నబ్బాయి కనిపించాడు.
"అన్నయ్య వచ్చాడు.. బయట వున్నాడు కలిసారా?" అన్నాడు.
"కలుస్తాను" అని బయటికి వచ్చాను. బయట పురోహితుడితో మాట్లాడుతున్నాడు అతను. దాదాపు రామనాధంగారిలాగానే వున్నడు. కాకపోతే తల మీద మరి కాస్త జుట్టు వుంది. పురోహితుడు వెళ్ళిపోయాక నేను పలకరించాను.
"నమస్తే నేను భీమేశ్వర్రావు గారి అబ్బాయిని" చెప్పాను.
"ఓ.. మీరేనా.. ఇందాకా వచ్చి వెళ్ళారని చెప్పాడు తమ్ముడు..?" అంటూ ఆగిపోయాడు. “మళ్ళీ వచ్చారే?” అన్నట్లు అనిపించింది నాకు.
"ఏం లేదు.. మళ్ళీ ఒకసారి చూడాలనిపించింది.. చివర టీ కొట్టు దగ్గర ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు.. అది విని.." చెప్పటం ఇష్టం లేక ఆగిపోయాను.
"ఏమనుకుంటున్నారు? చిరాకు రామనాధం అనా? అందరితో గొడవలు పెట్టుకునేవాడనా?" అతను అంటుంటే అతని కళ్ళలో నీరు.
నేనేమి మాట్లాడలేదు, అతని భుజం మీద చెయ్యి వేసి ఓదార్పుగా నొక్కాను.
"నాన్నకి రూల్స్ అంటే పిచ్చి అనుకుంటారు అందరూ... కాదు.. ఆయనకి జనం అంటే పిచ్చి... అలాంటి నియమాలు వుంటే మన అందరి జీవితాలు బాలెన్స్గా వుంటాయని చెప్పేవాడు. జీవితాంతం ఎలాంటి నియమాన్ని దాటలేదు ఆయన. ఆయనకి ఇష్టం లేని నియమాలు చాలా వున్నాయి, అయినా అవన్నీ పాటించేవాడు.. అలా పాటించని వాళ్ళంటే ఆయనకి చిరాకు, కోపం, జాలి కూడా. అందుకే అందరితో అలా గొడవలు పెట్టుకునేవాడు. ఇంటికొచ్చి ఎంతో మధన పడేవాడు. ప్రపంచం అంతా పద్ధతిగా వుండాలని కలవరించేవాడు.. అలాంటి ప్రపంచం ఇక సాధ్యంకాదని అమ్మతో చెప్పారట.. తెల్లవారేసరికి గుండె ఆగిపోయింది...." చెప్తూనే ఏడ్చాడు అతను.
నేను ఆశ్చర్యం నుంచి తేరుకునే సరికి అతను లోపలికి వెళ్ళిపోయాడు. నాకెందుకో అక్కడి నుంచి వెళ్ళాలనిపించలేదు. ఆయన అంతిమ యాత్రకి ఏర్పాట్లు జరుగుతుంటే అవన్నీ చూస్తూ స్తబ్దుగా వుండిపోయాను. ఎత్తుబడి జరిగిపోయింది..
"గోవిందా గోవిందా అంటూ పడమటివైపు కదలండి" చెప్పాడు పురోహితుడు. నేను అప్రయత్నంగానే కల్పించుకున్నాను.
"అటు కాదు.. రోడ్డుకి ఎడమ వైపున నడుస్తూ చివరిదాకా వెళ్ళి, అక్కడ క్రాసింగ్ దగ్గర రోడ్డు దాటి ఇటు వెళ్ళండి" చెప్పాను.
"కానీ శ్మశానం ఇటు వుందండీ" అన్నారెవరో.
"ఆయన చెప్పినట్లే చేద్దాం" అన్నాడు రామనాధంగారి పెద్ద కొడుకు నా వైపు చూస్తూ. నేను చెప్పినట్లే అంతిమ యాత్ర మొదలైంది.
ఇప్పుడు మీరు గాని జాగర్తగా గమనిస్తే రామనాధంగారి ముఖంలో చిరాకు మచ్చుకైనా కనిపించదు..!!
("సురభి" తెలుగు మాస పత్రిక అక్టోబర్ సంచికలో ప్రచురితం)
Unknown
"హైద్రాబాద్.. హైద్రాబాద్.." అరుస్తున్నారు బస్సు డ్రైవర్లు. ఒకప్పుడు ఎవరు ఎక్కారో లేదో సంబంధం లేకుండా వుండే ఆర్టీసీ వుద్యోగుల్లో ఇలాంటి మార్పు అనివార్యమైపోయినట్టుంది.
"హైటెక్.. నాన్స్టాప్.. రండి సార్.. వెళ్ళిపోవడమే.." గుక్క తిప్పుకోకుండా అరుస్తున్నాడు అతను. పేరుకి ఖాకీ చొక్కా వేసుకున్నా అందులో ఆరింట నాలుగు గుండీలు పెట్టుకోలేదు. లోపల బనియన్ చెమటకి తడిసిపోయివుంది. అదే ప్రైవేటు బస్సు డ్రైవరైవుంటే ఇలా వుండేవాడా..? తెల్లగా తళతళ లాడే చొక్కా వేసుకోని వుండేవాడేమో. అక్కడైతే అతని పని బస్సు నడపడమే, కానీ ఇక్కడ - బస్సు అద్దాలు తుడుచుకునే క్లీనర్, జనాలని పిలిచి ఎక్కించే ఏజెంటు, టికెట్లు కొట్టే కండెక్టరు అన్నీ డ్రైవరే..
"ఎక్కండి సార్.." అన్నాడతను నన్ను చూసి. "మన బస్సే ముందు బైల్దేరుతుంది.." చెప్పాడు. ఈ పోటీ ప్రపంచంలో బస్సుల మధ్య కూడా పోటీనే..!
"హైద్రాబాద్ కి ఒక టికెట్ ఇవ్వండి" అన్నాను అతని చేతిలో టికెట్ మెషీన్ చూసి.
టికెట్ ఇవ్వడం అలవాటు లేదేమో కొంచెం తడబడ్డాడు. చివరికి ఎలాగో టికెట్, చిల్లర తీసుకోని బస్సు ఎక్కి కండక్టర్ సీటు వెనకాల కిటికీ సీటులో కూర్చున్నాను. ఏదో మాట వరసకి చెప్పడమేకానీ కండక్టర్లే లేకపోతే కండక్టర్ సీటు ఎక్కడిది? నాతో పాటు మరో ఇద్దరు ఎక్కారు. ప్రేమ జంటో కొత్తగా పెళ్ళైన జంటో అయ్యుండాలి. అమ్మాయిని కూర్చో పెట్టి అతను మంచినీళ్ళు తెస్తానని ఒకసారి, కూల్డ్రింక్ తెస్తానని ఒకసారి కిందకి దిగాడు. దిగిన ప్రతిసారి ప్లాట్ఫారం మీద నిల్చున్న డ్రైవర్ దగ్గరకు వె ళ్ళి వెంటనే వచ్చేస్తానని చెప్పి ప్లాట్ఫారం మొత్తం పరుగులు తీస్తున్నాడు. అతను అనవసరంగా ఖంగారు పడటమే కానీ బస్సు ఇంతా కదలనే లేదు.
నాకన్నా ముందే మనవరాలితో బస్సు ఎక్కిన ముసలి జంట డ్రైవర్ వైపు రెండో వరసలో కూర్చున్నారు. మూడేళ్ళ పిల్ల.. పాపం ఆ ఉక్కపోతకి ఏడుపు అందుకుంది. ఆయన సీటు కింద నుంచి బ్యాగు లాగి అందులోనుంచి బిస్కెట్ పేకెట్ తీసి పాప చేతికిచ్చి బుజ్జగిస్తున్నాడు.
"ఏమిటండీ ఎంతకీ కదలదు.." అంటూ బస్సు గురించి అడిగిందామె.
"నాకు మాత్రం ఏమి తెలుసే.." అన్నాడాయన చిరాకుగా.
"ఇందాక ఆ డీలక్స్ దొరికినా బాగుండేది.. ఈ పాటికి కర్నూల్ దాటేసేవాళ్ళం." అన్నది ఆమె.
"తమరు రాణీ గారిలాగా నడుచుకుంటూ వస్తే బస్సు నీకోసం వుంటుంది.." నిష్టూరంగా అన్నాడాయన.
"నా మోకాళ్ళ నొప్పుల సంగతి మీకు తెలియదా.. అందుకే కొంచెం ముందే బయల్దేర్దామంటే వింటేనా?" ఆమె ప్రతి నిష్టూరమాడింది. జరగబోయే సంగతి అర్థం అయ్యిందనుకుంటా పాప మళ్ళీ ఏడుపు మొదలుపెట్టింది.
హైదరాబాద్లో ఏదో హాస్టల్లో వుంటూ చదువుకునే ఆడపిల్లలు నలుగురు ఎక్కారు. అందరూ ఒకే చోట వుండాలని నాలుగు వరసలు దాటి కొంచెం వెనకగా కూర్చున్నారు. కిటికీలోనించి ఈ విషయం చూసి ఒక తండ్రి అరిచాడు -
"ఒక్కరవ్వ ముందుకెళ్ళి కూకోకూడదంటే.. మరీ టైరు పైన కూకుండావే?" అని.
"ఫర్లేదులే నాన్నా.. అందరం కలిసి వుంటే సేఫ్.." అంటూ "సేఫ్టీ" అనే బ్రహ్మాస్త్రం వదిలింది. అవతల తండ్రి ఏం మాట్లాడకుండా తల పంకించి టికెట్ కొనడానికి డ్రైవర్ దగ్గరకి వెళ్ళాడు. ఆడపిల్లలు ముసి ముసిగ నవ్వుకుంటున్నారు. మరో కుర్రాడు సెల్ఫోన్లో మాట్లాడుతూ వచ్చి, వాళ్ళనే చూస్తూ, బ్యాగ్ని సీటు పైన కంపార్ట్మెంట్లో ఇరికించేందుకు కష్టపడుతున్నాడు.
అప్పటికే నేను ఎక్కి పావు గంట కావడంతో కొంచెం చిరాకానిపించింది. కర్చీఫ్ సీట్లో వేసి కిందకి దిగాను. డ్రైవర్ దగ్గర టికెట్ల కోసం పది మందిదాకా వున్నారు. టికెట్లు కొట్టడం చేతకాక అతను ఇబ్బంది పడుతున్నట్లు వుంది. ఎంతలేదన్నా ఇంకో ఐదు నిముషాలైనా పట్టేట్లుంది కదాని చెప్పి నేను అతనితో చెప్పకుండానే వెళ్ళి ఒక కూల్డ్రింక్ తాగి, ఏదో ఒక వారపత్రిక కొనుక్కోని తిరిగి వచ్చాను.
డ్రైవర్ దగ్గర జనం ఇంకా వున్నారు. సాయం కోసం వేరే బస్సు కండక్టర్ని పిలిపించుకోని టికెట్లు కొట్టిస్తున్నాడు. నేను బస్సు ఎక్కి నా సీట్లో కర్చీఫ్ తీసి కూర్చున్నాను. నేను కూర్చున్న సీటు వెనకాలే ఒక జంట కూర్చోని వుంది. వాళ్ళ పదేళ్ళ పిల్లాడు కిటికీ డోర్తో ఆటలు మొదలెట్టాడు. రెండుసార్లు నా మోచేతిని కిటికీతో పొడవడంతో నా చెయ్యి లోపలికి పెట్టుకోక తప్పలేదు. "చేతులు బయట పెట్టరాదు " అన్న ఆర్టీసీ సూక్తిని అమలుపరిచే బాధ్యత ఈ పిల్లాడు తీసుకున్నట్లున్నాడు.
"ఏమైనా మా అన్నయ్య బాగా ఘనంగా చేశాడు కదండీ పెళ్ళి.." అన్నది ఆ ఇల్లాలు.
"ఏడ్చాడు.. సొంత బావకి మర్యాద చెయ్యడం తెలియదు కాని ఘనంగా చేశాడట పెళ్ళి.." సన్నాయి నొక్కులు నొక్కాడు భర్త.
"ఊర్కే ఆడిపోస్కోవడం కాకపోతే మీకేం తక్కువ చేశాడండీ?" ఈ మాట అంటుంటే మరో మాటకి ఏడుపు వచ్చేట్లుంది ఆమె గొంతు.
"ఏం చేశాడా? నాకు పెట్టిన బట్టలు చూశావా? మనవాడి బారసాలకి మేనమామ అని ఎంత మంచి బట్టలు పెట్టాం? కనీసం ఆ కృతజ్ఞతైనా వుండద్దు.." ఆయనికా చెప్తూనే వున్నాడు. ఆమె గొంతు మాత్రం మళ్ళీ వినపడలేదు. చిన్నగా ఏడుస్తున్నట్లు వినిపిస్తోంది.
కింద ప్లాట్ఫారం మీద గొడవ మొదలైంది. మనవరాలితో ఎక్కిన ముసలాయన, ప్రేమజంటలో కుర్రాడు డ్రైవర్తో గొడవ పెట్టుకున్నట్లున్నారు. నేను దిగి వాళ్ళ దగ్గరకు వెళ్ళాను.
"నాకు టికెట్లు కొట్టడం రాదు సార్.. అందుకే ఆలస్యమైంది.. ఇంక బయల్దేరడమే.." చెప్తున్నాడు.
"ఏమిటయ్యా బయల్దేరేది. మేం టికెట్ కొనిన తర్వాత మూడు బస్సులు పొయ్యాయి. వెంటనే కదలనప్పుడు టికెట్లెందుకిచ్చావు?" అన్నాడు పెద్దాయన.
"అవును.. వెంటనే బయల్దేరు లేకపోతే మా డబ్బులు మాకిచ్చెయ్యి" అన్నాడు కుర్రాడు.
"లేద్సార్.. వెళ్ళిపోదాం.." అంటూనే "ఇంకా ఎవర్సార్ హైద్రాబాద్ హైద్రాబాద్.." అంటూ ప్లాట్ఫారం మీద జనాలకోసం అరిచావు.
"అరిచింది చాలు ఇంక పదండి" అన్నాను నేను. అందరం బస్సు ఎక్కి కూర్చున్నాం. బస్సు స్టార్ట్ చేశాడు డ్రైవర్.
స్టార్ట్ చేశాడు కానీ బస్సుని బయటికి తియ్యలేదు. దాదాపు అయిదు నిముషాలు అలాగే వుంచి లోపలికి వచ్చాడు. మొదటి సీటు నించి చివరిదాకా లెక్కపెట్టుకుంటూ వెళ్ళాడు.
"ఇంకా ఎవరో రావాలి సార్" ప్రకటించాడు. నేను వెనక్కి తిరిగి చూశాను. - ముసలి జంట, పడుచు జంట వున్నారు, పెళ్ళికెళ్ళి వస్తున్న జంట వున్నారు, హాస్టల్ పిల్లలు వున్నారు - ఆ సెల్ఫోన్ పట్టుకోని వచ్చిన కుర్రాడు?
"అదుగో ఆ సీట్లో ఒక కుర్రాడు వుండాలి" చెప్పను డ్రైవర్తో.
వెనుకనుంచి ఎవరో అసహనంగా "ఛ" అనడం వినిపించింది.
ముసలి దంపతుల దగ్గర పిల్ల మరింత గట్టిగా ఏడుస్తోంది.
"నీకు చెప్పి వెళ్ళలేదా?" నా వెనకాలతను అడిగాడు.
"లేదండి.." అని డ్రైవర్ అంటుండగానే అతను వచ్చాడు. బస్సులో వున్న జనమంతా అతన్ని చిత్రంగా చూస్తుండటంతో చేతిలో మంచినీళ్ళ బాటిల్ చూపించి జనాంతికంగా "నీళ్ళ కోసం" అన్నాడు. వెనకాల హాస్టల్ పిల్లల నవ్వులు చిన్నగా.
"అసలే ఈయన టికెట్టు కొట్టటం లేటు, బండి తీయడం లేటు, దానికితోడు ఇదొకటి.." ముసలాయన గొణిగాడు. డ్రైవర్ తిరిగి తన సీట్లోకి వెళ్ళి బండి బయటికి తీసాడు. వూర్లో మరో ఐదారుగురు ఎక్కారు. మరో ఆర్టీసీ వుద్యోగి అనుకుంటా ఎక్కి డ్రైవర్ దగ్గరే చేరి కబుర్లలో పడ్డాడు. బస్సు నడుపుతూనే టికెట్లు కొడుతున్నాడు డ్రైవర్. బస్సు వూరు దాటగానే లైట్లు ఆరిపోయాయి. డ్రైవర్ సీట్ పైన మాత్రమే లైట్ వెలుగుతోంది.
నా వెనక సీట్లో పెళ్ళికి వెళ్ళొచ్చిన జంట లోగొంతులో ఇంకా వాదించుకుంటూనే వున్నారు.
"అంతే లెండి మా వాళ్ళంటే మీకు ఏనాడు పడింది గనుక.." ఆమె ఏదుస్తున్న సంగతి అర్థమౌతోంది.
"అల్లుడన్న గౌరవం వాళ్ళకుంటే.. వాళ్ళకి మర్యాదిచ్చేవాణ్ణి.." నిష్టూరమాడుతూనే కిటికీతో ఆడుతున్న కొడుకు రెక్క పట్టుకుని లాగుతున్నాడు.
ముసలి జంట కిటికీకి దగ్గరగా చేరి, ఆ గాలికి చిన్న పిల్లని నిద్రపుచ్చారు. ఆమె ఇంకా చిన్నగా "రామా లాలి.." పాడుతూనే వుంది.అవతల ప్రేమ జంట - లైట్లు ఆరిపోగానే సీట్లోనే కొంచెం కిందకి జారి గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. ఆ అమ్మాయి గాజుల చప్పుడు, ముసి ముసి నవ్వులు తప్ప ఇంకేం వినపడటంలేదు, కనపడటంలేదు.
చెక్పోస్ట్ దాటక ముందే బస్సు ఆగింది. మరో నిముషంలో లైట్లు వెలిగాయి. ప్రేమ జంట గబగబా కదిలినట్లు గాజుల చప్పుడు. ఇద్దరూ నిటారుగా కూర్చున్నారు. నా వెనక వున్న ఇల్లాలు కన్నీళ్ళు తుడుచుకుంది. పెద్దామె లాలిపాట ఆగిపోయింది. డ్రైవర్ ఉన్నట్టుండి దూసుకు వచ్చాడు -
"అయ్యా.. ఎవరికైనా చిల్లర ఎక్కువిచ్చానా.. చూడండి.. లెక్క తేలడం లేదు.." అన్నడు. పసి పిల్ల లేచి మళ్ళీ ఏడుపు అందుకుంది.
"మళ్ళీ ఇదేమిటయ్యా.." అడిగాడు ముసలాయన.
"ఇట్లా అయితే మనం హైదరాబాద్ చేరినట్లే" కాలేజీ పిల్ల కాస్త గట్టిగానే అని కుర్రాడి వంక చూసింది.
"కాదండి.. డబ్బులు షార్ట్ పడితే నా జేబులో నించి కట్టాలి.. ఒక్కసారి చూసుకోని చెప్పండి.."
"ఎంత తగ్గిందిరా.." ఇంతకు ముందెక్కిన ఆర్టీసీ వుద్యోగి సాయంగా నిలబడి అడిగాడు.
"నాలుగు వందలు.."
"ఇంకేం.. ఎవరో అయిదు వందలు ఇచ్చి వుంటారు.. వాళ్ళకి చిల్లర ఇవ్వబోయి వందకి బదులు మళ్ళీ అయిదొందలు తిరిగి ఇచ్చి వుంటావు.." అనుభవం మీద చెప్పినట్లు ఖచ్చితంగా చెప్పాడతను. "ఎవరెవరు అయిదొందలు ఇచ్చారో గుర్తు చేసుకో.." అంటూ సలహా కూడా ఇచ్చాడు.
"ఎవరెవరో గుర్తులేదు.. ఐదారుగురు ఇచ్చారు.." డ్రైవర్ ముఖం నీరసంగా మారింది.
"క్యాష్ బ్యాగ్లో ఎన్ని ఐదొందళ్ళు వున్నాయి?"
"అయిదు"
"అంటే ఆరు అయిదొందల కాగితాలు నీ దగ్గరకి వచ్చాయి.. ఒకటి వెనక్కిచ్చావ్.." చెప్తున్నాడతను
"ఏమిటండీ ఈ డిస్కషను? త్వరగా పోనివ్వయ్యా.." అరిచాడు నా వెనకున్న గృహస్తు.
"సార్.. ఒక్క నిముషం సార్.. మీ దగ్గర చూసుకోండి.. వంద బదులు అయిదొందలు ఇచ్చాను. మీ దగ్గర వుంటే చూసి చెప్పండి.. ప్లీజ్"
ఎవ్వరి దగ్గర్నించి సమాధానం రాలేదు. ఎవ్వరూ కనీసం పర్స్ తీసి చూసునుకున్నట్లు కూడా కనిపించలేదు.
"సరే చెప్పావుగా వుంటే ఇస్తార్లే.. ఇంక పోనీ" ముసలాయన గదిమాడు. తప్పని పరిస్థితిలో ముఖం వేలాడేసుకొని డ్రైవర్ సీటు దగ్గరకు వెళ్ళిపోయాడు. బస్సు కదిలింది - లైట్లు ఆరిపోయాయి.
మళ్ళీ ప్రేమజంట గుసగుసలు, సంసారులు రుసరుసలు మొదలయ్యాయి. కాలేజిపిల్లల మొబైల్లో ఏవో కొత్త పాటలు వినపడుతున్నాయి. ఎవరో సన్నగా గురక తీస్తున్నారు. బస్సు చాలా నెమ్మదిగా పోతోంది. బహుశా డ్రైవర్ పోయిన నాలుగు వందల గురించి ఆలోచిస్తూ నడుపుతున్నాడేమో. బస్సు నిండా చీకటి. బస్సు బయటకూడా చీకటే.
ఒక రెండు గంటల తరువాత బస్సు ఒక హోటల్ దగ్గర ఆగింది. మళ్ళీ లైట్లు వెలగడంతో ఎవరికి వారు సర్దుకున్నారు. డ్రైవర్ బస్సులోకి వచ్చాడు.
"సార్.. దయచేసి ఎవరికైనా ఎక్కువ ఇచ్చానేమో చూడండి.. చెకింగ్ జరిగిందంటే వుద్యోగం పోతుంది.." అన్నాడు దీనంగా. నా ఆలోచన కరెక్టే, అతను ఇదే విషయం ఆలోచిస్తూ వున్నట్లున్నాడు.
"ఏమిటయ్యా నీ గోల.. ఎన్ని సార్లు ఆపుతావు" మండి పడ్డాడు కుర్రాడు.
"నీ డబ్బులు మేమేదో దోచెసినట్లే మాట్లాడుతున్నావే? మమల్ని హైద్రాబాద్ చేరుస్తావా లేక ఇట్లాగే.." ముసలాయన ఏదో అంటుండగా డ్రైవర్ అందుకున్నాడు.
"అహ.. లేదు సార్.. దానికోసం ఆపలేదు.. భోజనానికి ఆపాను.. అదుగో హోటల్.. బస్సు పదిహేను నిముషాలు వుంటుంది..." చెప్తూనే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. దాదాపు అందరూ దిగారు. చివరిగా దిగింది నేనే. డ్రైవర్ అక్కడే నిలబడి బీడీ కాలుస్తున్నాడు.
"మీరు రారా భోజనానికి?" అడిగాను.
"ఏం తినబుద్దైతుంది సార్.. నాలుగొందలు పోగొట్టుకున్నా ఇవాళ.." అన్నాడతను బీడి పొగ వదుల్తూ.
"వుద్యోగమన్నాక ఇలాంటివి తప్పవు కదా.. దానికే భోజనం మానేస్తారా?" అన్నాను నేను.
"మీకు తెలియదు సార్.. దాదాపు ప్రతి డ్యూటీలో ఎంతో కొంత పోతూనే వుంటుంది.. అలవాటు లేని పని కదసార్.. అప్పట్లో ఎనిమిది ప్యాస్ అయితే క్లీనర్ వుద్యోగం ఇచ్చారు.. డ్రైవరయ్యా.. ఈ టికెట్టు లెక్కలు ఎక్కడ వెయ్యగలను చెప్పండి.. కాకపోతే ఇయ్యాల లేవగానే ఎవరి ముఖం చూశానో నాలుగొందలు పొయినాయి.. నాలుగు వందలు.." అన్నాడతను బాధగా. నేనేమీ మాట్లడలేదు. అతనే మళ్ళీ అన్నాడు -
"నెలాఖరు కద్సార్.. ఎవడో ఒకడి దగ్గర అప్పన్నా చెయ్యాలి ఇది కట్టాలంటే.. మధ్యలో చెకింగ్ అయితే సస్పెండ్ చేస్తారు.. అయినా అది కాదు బాధ.. పొరపాటున డబ్బులు ఎక్కువ వస్తే వెనక్కి ఇచ్చే నిజాయితీ ఒక్కడికి కూడా లేద్సార్.. అదుగో ఆ హోటల్లో ఎవరో ఒకళ్ళ నా డబ్బుల్తో భోజనం చేస్తున్నారు.." కసిగా అంటుంటే అతని కళ్ళలో నీళ్ళు తిరిగాయి. నేను మౌనంగా హోటల్కేసి నడిచాను.
హోటల్ కౌటర్ దగ్గర భోజనం టోకెన్ తీసుకుంటుంటే కనపడిందది - ఐదు వందల రూపాయల నోటు.. నా పర్సులో. నేను సామాన్యంగ పెద్ద నోట్లు చిన్న నోట్లు ఒక వరసలో పెడతాను. ఈ నోటు మాత్రం రెండు వంద రూపాయల మధ్య వుంది. అది ఖచ్చితంగా డ్రైవర్ పొరపటున ఇచ్చిందే.
నిజం చెప్పద్దూ.. ఆ నోటు చూడగానే తిరిగి ఇవ్వాలనే అనిపించింది. కానీ మీరనుకున్నట్లు ఆ నోటు తిరిగి ఇవ్వలేదు, ఇస్తే ఈ కథే లేదు..!! బస్సులో హైద్రాబాద్ వచ్చేవరకూ తర్జన భర్జన పడుతూనే వున్నాను. హైదరాబాద్లో దిగిపోయాను - నా జోబులో నోటు అలాగే వుండిపోయింది. ఆ తరువాత ఎక్కడ ఖర్చుపెడదామాన్నా ఎందుకో మనసు వొప్పలేదు. మళ్ళీ ఆ డ్రైవర్ కనపడకపోతాడా, నేను నోటు తిరిగి ఇవ్వకపోతానా అని ఎదురు చూస్తున్నాను. ఆ అయిదువందల రూపాయల నోటు మాత్రం రోజూ, నేను పర్సు తీసినప్పుడల్లా కనపడి వెక్కిరిస్తుంటుంది.
(19.09.2010 "సాక్షి" ఆదివారం అనుబంధంలో ప్రచురితం)
Unknown
టైమ్స్ ఆఫ్ ఇండియా వారి తెలుగు మాస పత్రిక "సురభి" అక్టోబర్ సంచికలో నా కథ "చిరాకు రామనాధం" ప్రచురించారు. ప్రసిద్ధ నాటక రచయిత, సినిమా నటుడు శ్రీ గొల్లపూడి మారుతీరావుగారి సంపాదకత్వంలో వచ్చే ఈ పత్రికలో, ప్రముఖ చిత్రకారుడు శ్రీ బాలిగారి బొమ్మతో నా కథ రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. కథ చదివి మీ అభిప్రాయం చెప్తారు కదూ?
Unknown
ఈ రోజు (19.09.2010) "సాక్షి" ఆదివారం అనుబంధంలో నా కథ "అయిదు వందల రూపాయల నోటు" ప్రచురించారు. చదివి మీ అభిప్రాయం చెప్తారు కదూ..!
అంతర్జాలంలో చదవాలనుకునే వారికి ఇదుగో ఇదీ లింకు: "అయిదు వందల రూపాయల నోటు"
ఈ కథకి బ్లాగ్మిత్రుడు అన్వర్ బొమ్మవెయ్యడం మరో విశేషం.

అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి కృషి చేస్తున్న స్వచ్చంద సంస్థ e-తెలుగు గురించి ఈ రోజు (29 ఆగస్టు 2010) ఈనాడు హైదరాబాద్ అనుబంధంలో వచ్చిన వార్త ఇది.
Unknown
మనం నిద్రలో జోగుతున్నప్పుడు భుజం మీద దోమ కుట్టిందనుకోండి, ఠప్పున చెయ్యి లేచి దాని మీద పడి ఆ దోమని పరమపదానికి చేరుస్తుంది. దీన్నే అసంకల్పిత ప్రతికార చర్య (Involuntary reflex action) అని చెప్తుంది సైన్సు. ఇలాంటి చర్యలకి మన మెదడు కాకుండా వెన్నెముక పైభాగం నుంచి సూచనలు అందుతాయట. అంటే మెదడు(అవసరం) లేని పనులని ఈ అసంకల్పిత చర్యలంటారన్న మాట.
సైన్సు పరంగా అలాంటివి కాకపోయినా దాదాపు ఇలాంటివే అసంకల్పిత చర్యలు ఎన్నో రోజూ మన చుట్టూ చూస్తూనే వుంటాం. మనం అందరం చేస్తూనే వుంటాం. యస్పీ బాలు పాటవినగానే తలాడించడం, బ్రహ్మానందాన్ని చూడగానే నవ్వురావటం, రాఘవేంద్రరావు సినిమాలో హీరోయిన్ని చూస్తే చొంగ కారడం లాంటివి చాలా వుదాహరణలు వున్నా, నేను చెప్పబోయేవి ఇంకొంచెం పెద్దవి.
ఎవరినా ఎవరినైనా పెన్ను అడిగేటప్పుడు చూడండి గాల్లో ఏదో రాస్తున్నట్లే చేతిని వూపి అడుగుతుంటారు. పెన్ను ఇచ్చే వ్యక్తికి పెన్నుతో ఇలా రాయాలి సుమా అన్నట్టు ఆ సంజ్ఞ ఎందుకు చెప్పండి? టైం అడిగేటప్పుడు కూడా మన చేతికి వాచీ వున్నట్లే చెయ్యి ఎత్తి అడుగుతాం. మన చేతికి వాచీ లేకపోయినా అలా ఎందుకు చూస్తామో తెలియదు.. అవతలి వాళ్ళకి వాచి అక్కడుంటుందని గుర్తు చెయ్యడానికేమో అర్థం కాదు..!! ఒక్కోసారి మనం బస్సు రన్నింగ్లో దిగాల్సివస్తుంది (హైదరాబాదులో అయితే రోజూ దిగాల్సి వస్తుంది, కాబట్టి హైదరాబాదీయులకి ఈ వుదాహరణ మినహాయింపు). అలాంటప్పుడు సాధారణంగా బస్సు వెళ్తున్న వైపు కాకుండా వెనక్కు దిగి, ఆ క్షణంలో సైన్సు చేసిన మోసాన్ని గ్రహించేలోపలే కిందపడుతుంటాం. ఇలంటివాటివల్ల మనకే ఇబ్బంది కానీ వెరే ఎవరికీ ఇబ్బంది వుండదు. కానీ, కొన్ని వున్నాయి - మనం చేసే అసంకల్పిత చర్యలవల్ల అవతలి వారికి చిరాకో, నవ్వో తెప్పిస్తుంటాయి.
సినిమాహాల్లో కలిసిన మిత్రుణ్ణి - "ఏమోయ్ సినిమాకు వచ్చావా" అని అడగటం ఇలాంటిదే. నవ్వేసే మిత్రుడైతే ఫర్లేదు కానీ చిరాకు పడే మిత్రుడైతే - "లేదోయ్.. మీరు ఇంటర్వెల్లో కాల్చి పడేసే సిగరెట్ పీకలు ఏరుకునేందుకు వచ్చాను" అంటూ అక్కసునంతా వెళ్ళగక్కుతాడు. ఇలాంటివే సదరు సినిమా కౌంటరు దగ్గర కూడా జరుగుతుంటాయి. మనం లైన్లో నిలబడటమే ఒక దైవ సంకల్పం లాగా, సిక్కిం బంపర్ లాటరీ తగిలినట్టు సరిగ్గా మనం కౌంటరు ముందుకు రాగానే టికెట్లు అయిపోతాయి. కౌంటరులో టికెట్లు అయిపోయాయి అనగానే - "కొంచెం చూడండి.." అనో "ఒక్కటి కూడా లేదా" అనో మన నోటి నుంచి అసంకల్పితంగా వచ్చేస్తుంది. చిల్లర విషయంలో కూడా అంతే - ఏ హోటల్లో క్యాషియరో, ఆటో డ్రైవరో "చిల్లర లేదు సార్" అంటే "చూడవోయ్" అనేస్తాం అసంకల్పితంగా. అంటే అవతలి వ్యక్తికి "నేను నిన్ను నమ్మడంలేదు" అని అన్యాపదేశంగా చెప్పడమే కదా?
రైల్వే స్టేషన్లో ఎంక్వైరీ కౌంటర్ దగ్గర ఇలాంటివే మరి కొన్ని కనిపిస్తాయి. ఎంక్వైరీ క్లర్క్ దగ్గరకు రాగానే ఫలానా తెనాలికి లాస్ట్ ట్రైన్ ఎన్నిగంటలకి అని అడుగుతాం. క్లర్క్ "తొమ్మిది గంటలకి" అని చెప్పగానే మనలో తొంభై శాతం మంది "దాని తరువాత ట్రైన్ లేదా" అంటాము. మనం అడిగింది, ఆ క్లర్కు చెప్పింది లాస్ట్ ట్రైన్ గురించి. దాని తరువాత ఇంకో ట్రైన్ ఎలా వుంటుంది? వుంటే ఇది లాస్ట్ ట్రైన్ ఎలా అవుతుంది?..అదేమి చిత్రమో ఈ ఆలోచన మన బుర్రకి రానే రాదు..!! ఇలాగే ఫస్ట్ ట్రైన్ కన్నా ముందు వేరే ట్రైన్ లేదా? అని కూడా అడుగుతుంటాము.... కనీసం నెక్ష్ట్ ట్రైన్ గురించి అడిగినప్పుడు సమాధానం "ఆరు గంటలకి" అని వినగనే "ఈ లోపల ఏం లేదా?" అంటాం. ఈ లోపల ట్రైన్ వుంటే ఆరు గంటలకి అని ఎందుకు చెప్తాడు? ఎప్పుడైనా ఆలోచించారా? ట్రైన్ ఎక్కడానికి వచ్చి, ఆ రైలు అందుకోలేకపోతే కూడా ఇలాంటి అనుమానాలే వస్తుంటయి. టీసీ రైలు వెళ్ళిపోయిందని చెప్పగానే "ఎంతసేపైంది" అంటాం. ఎంతసేపైతే మాత్రం ఏం చెయ్యగలం? పట్టాల మీద పరుగెత్తి అందుకోలేం కదా? అన్నీ అసంకల్పిత ప్రశ్నలే...! అన్ని వ్యర్థమైన ప్రశ్నలే.. ఎప్పుడైనా ఆలోచించారా?
ఇంకో సంగతి చెపుతా వినండి - క్యూలో నిల్చున్నప్పుడు మనకో దురలవాటు వుంది. ఎదుటివాడి వీపు మీద చెయ్యి ఆనించి చిన్నగా తొయ్యటం. సినిమా హాలులోంచి బయటికొచ్చేటప్పుడైనా విమానంలోనుంచి దిగేటప్పుడైనా ఇలంటివి తప్పవు. మరి అదేంటో.. తాము వెనక వున్నామని చెప్పకపోతే ముందు వున్నవాళ్ళు ముందుకు కదలరేమో అని అనుమానం అనుకుంటా వీరికి. ఇలాంటి వారే సిగ్నల్ దగ్గర ఆగి హారన్ కొడుతుంటారు. ముందు వున్నవాడు సిగ్నల్ కోసం ఆగాడే కాని, సైట్ సీయింగ్ కోసం కాదన్న సంగతి మరిచిపోతుంటారు వీరు.
రోడ్డుకు అడ్డంగా దాటే వ్యక్తులని గమనించండి - ఒకటి వాళ్ళు జీబ్రా క్రాసింగ్ దగ్గర రోడ్డు దాటరు. రెండు దాటేటప్పుడు రెండు వైపులా వస్తున్న వాహనాల్ని చూసుకోరు. అసంకల్పితంగా చెయ్య ట్రాఫిక్ పోలీసు "ఆగుము" అన్న బోర్డు పట్టుకున్నట్టుగా పెట్టి ట్రాఫిక్‌కి అడ్డంగా పరుగెత్తుతారు. ట్రాఫిక్ పోలీసులు ఆగమంటేనే ఆగని వాహనచోదకులు ఎవరో రోడ్డు దాటుతూ చెయ్యి చూపిస్తే ఆగుతారా?
మనం ఎక్కడో ఆలోచిస్తూ బండి నడపడం, సంతకం చెయ్యడం వంటివి కూడా చాలా వరకు అసంకల్పితంగానే జరుగుతాయి. బండి అసంకల్పితంగా నడపగలను కదా అని కొంతమంది ఔత్సాహికులు బండి నడుపుతూ మొబైల్‌ఫోన్ వాడి అసంకల్పితంగానే ఏక్సిడెంట్లూ చేసుకుంటారు...!! ఇలాంటి అసంకల్పితమైన పనుల విషయంలోనే కొంచెం జాగర్తగా వుండాలి..!!
Unknown
అతనొక రచయిత. ఆమె అతని అభిమాని.
ఆమెకు అతనంటే అభిమానం, ఇష్టం.
ఆమెలో వెన్నెలని, వెన్నెలలో ఆమెని చూడగలిగిన భావుకత అతనిది.
ఆమె ప్రేమిస్తోందని అతనికి తెలుసు. అతను ప్రేమిస్తున్నాడని ఆమెకి తెలుసు. ఇద్దరికి తెలిసిన నిజాన్ని ఎవరు ముందు చెబుతారా అని ఇద్దరి మనసులు పోటీ వేసుకున్నాయి. సరసాల ఈ సరదా పోటీలో విజేతలెవ్వరో..?
***
"హలో శరత్ నువ్వేనా.. ఏంటి గురు నీ కోసం ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా..? అంత బిజీ అయిపోయావా..?"
"అవును మరి ప్రస్తుతం మూడు పత్రికల్లో సీరియల్స్ వ్రాస్తున్నాను.. ఒకటి ప్రొడక్షన్‌లో వుంది.."
"చాలు బాబు.. చరిత్ర తొవ్వకు. ఈ రోజు మన మీటింగ్ పాయంట్‌కిరా.. నీతో మాట్లాడాలి..!"
"ఏంటి విషయం.. హలో.. ఏయ్ మాధవీ.." అప్పటికే ఆమె పెట్టేసింది. అతను నవ్వుకుంటూ ఫోన్ కింద పెట్టేశాడు. అతనికి తెలుసు మాధవి మాటంటే మాటే. అసలా మాటల్లో ఏం మహత్యం వుందో అభిమాని ఒక స్నేహితురాలైంది.. అతని ప్రాణమైంది. “సాయంత్రం వెళ్ళక తప్పదు” - అనుకున్నాడు మనసులో.
శరత్ ఎదురుగా పాఠకుల నించి వచ్చిన వుత్తరాలు ఒక ముప్పై దాకా వున్నాయి. యధాలాపంగా ఒక్కొక్కటే తీసి చింపి చదవటం మొదలెట్టాడు. అన్నింటిలో దాదాపు ఒకే విషయం -
"మీరు కలం పేరుతోనే ఎందుకు వ్రాస్తారు.. మీ అసలు పేరు తెలుసుకోవాలని వుంది.. మీ పేరు చెప్పండి." అంటూ. చివరగా తీసిన కవరు చదవగానే ముందు అర్థం కాలేదు. మళ్ళీ మళ్ళీ చదువుకున్నాడు - అర్థంకాగానే నవ్వుకున్నాడు. అతనిలో చిలిపితనం చిందులు తొక్కింది. మెరుపులా మెరిసిన ఆలోచన మాధవి మీద ప్రయోగించాలనుకుంటూ ఉత్తరం జేబులో పెట్టుకున్నాడు.
***
"బోలో యార్.. ఏంటి సంగతులు..?" మాధవి అడిగింది ఆ సాయంత్రం.
"నథింగ్"
"నథింగా? అది చెప్పుకోడానికా ఇక్కడికొచ్చింది?" ఉడుకుగా అడిగింది.
"నేనా రమ్మన్నాను?" ఎదురు ప్రశ్న వేశాడు శరత్.
"ఓకే ఒకే.. ఇప్పుడు ఏం కావాలో చెప్పు"
"ఎనీథింగ్.. తియ్య తియ్యగా" అతని కళ్ళలో చిలిపిదనం
"వాట్" అరిచింది మాధవి.
"అదే ఏదైనా ఐస్‌క్రీం"
"ఈడియట్ సరిగా చెప్పొచ్చుకదా"
"ఏయ్ ప్రఖ్యాత రచయితని తిట్టేస్తున్నావు.." అన్నాడు వేలు చూపిస్తూ.
"ఓకే సార్ క్షమించండి.. " బుంగమూతి పెట్టింది మాధవి. కొద్దిసేపు ఎవరూ మాట్లాడుకోలేదు. బేరర్ ఆర్డర్ తీసుకోని, బటర్‌స్కాచ్ ఐస్‌క్రీం తెచ్చి బల్ల మీద సర్దాడు.
"అవును నెక్స్ట్ నావల్ ఏం వ్రాస్తున్నావు?" మాధవి అడిగింది మాట్లాడటానికి ఏ విషయం దొరక్క.
"ఒక వెరైటీ నోవల్ ప్లాన్ చేస్తున్నాను.."
"అయితే అందులో హీరోయిన్‌కి నా పేరు పెట్టాలి.."
"నో..నో.. హీరోయిన్ పేరు ఎప్పుడో డిసైడ్ చేశాశాను - అనంత లక్ష్మి"
"హు అనంత లక్ష్మా? హీరో పేరేంటి సుబ్బారావా?" అడిగింది టీజింగ్‌గా.
"కొంచెం అలాంటిదే - సుబ్బరామయ్య" అన్నాడతను.
"ఏయ్.. నీకేమైనా పిచ్చా? మొన్నటిదాకా సుమధార, కౌస్తుభ్ అంటూ మోడ్రన్ పేర్లు పెట్టి ఇప్పుడు ఉన్నట్టుండి ఇలంటి పాత చింతకాయ పేర్లు పెడితే.."
"ఏం పెట్టకూడదా? అసలు నాలాంటి రచయితల వల్లే సుబ్బారావు, అప్పారావు లాంటి పేర్లు మాయమైపోతున్నాయి.. అచ్చమైన తెలుగు పేర్లు కదూ అవి. ఇదొక రకమైతే కొంతమంది వెరైటీగా వుంటే అర్థంలేని పేర్లు కూడా పెట్టేస్తున్నారు. ఆఖరికి మగపిల్లల పేర్లు ఆడవాళ్ళకి, ఆడపిల్లల పేర్లు మొగ పిల్లలకి పెట్టేస్తున్నారు. మొన్నా మధ్య మా ఫ్రెండ్‌కి కూతురు పుడితే పేరే దొరకనట్టు విదూషక అని పెట్టాడు. అర్థం తెలుసా అంటే తెలియదన్నాడు.."
కిల కిల నవ్వింది మాధవి.
"నాట్ జోక్ మధు.. దీనికి కొద్దో గొప్పో నాలాంటి రచయతలకి కూడా బాధ్యత వుందనిపించింది. చిత్ర విచిత్రమైన పేర్లు కనిపెట్టి సుబ్బమ్మలు, వెంకట్రావులు మాయం చేస్తున్నారు. అందుకే ఇక నుంచి నా కథల్లో హీరో హీరోయిన్లకి సాధారణమైన పేర్లే పెడతాను."
"మంచిది. వీలైతే నీకు పుట్టే పిల్లలకి కూడా పుల్లారావని,తిరుపతమ్మ అని పెట్టుకో.. సరేనా.. ఇంక ఆపు. నీ నవలల గురించి మొదలుపెడితే ఇంక ఆపవు కదా.."
"ఏయ్ మధు.. నా నవలలని మాత్రం ఏమనకు.. అవి చదివే కదా నువ్వు నన్ను లైక్ చేసింది..!"
"అలా అని నేనెప్పుడైనా చెప్పానా? నేను లైక్ చేసేది నీ రచనలని నిన్ను కాదు.."
"అంతేనా?" దెబ్బతిన్నట్టు చూసాడు శరత్.
"అవును.. అంతకన్నా ఇంకేముంటుంది?"
"అవును.. ఇంకేముంటుందిలే.." అని ఏదో గుర్తుకు వచ్చినవాడిలా -
"నీకు చెప్పడం మర్చిపోయాను.. ఒక అభిమాని నుంచి ఒక వుత్తరం వచ్చింది. వెరీ పెక్యూలియర్.." అన్నాడు టాపిక్ మారుస్తూ.
"నాకేం నీ ఫాన్స్ మీద ఇంట్రస్ట్ లేదు.."
"ఓకే.. లవ్ లెటర్ కదా చూపిద్దామనుకున్నాను"
"ఏయ్.. లవ్ లెటరా? ఏది ఇటివ్వు. ఇదేనా" అంటూనే పాకెట్‌లోనించి కవర్ తీసుకుంది మాధవి.
శరత్‌కి అందకుండా ఒడుపుగా తప్పించి, తీసి చదవడం మొదలుపెట్టింది మాధవి.
“ఏమని సంబోధించాలో అర్థం కావటంలేదు. పేరు పెట్టి పిలిచేందుకు మనసు వొప్పుకోవటంలేదు. మరింకేమైనా అనేందుకు చనువులేదు..!
మీ రచనలు చదివాను. ఊహు.. మీ రచనల్లోనే బతికాను. మీరు వ్రాసే అక్షరం అక్షరం ఒక అద్భుతం.. ప్రతి పదం మాటున దాగిన భావుకత గుండెల్లో చేరి రాగ రంజితం చేస్తుంది. అడుగడుగునా చిలిపితనం తొంగి చూసే మి రచనలు చదువుతుంటే నన్ను నేనే మర్చిపోతుంటాను.
మిమ్మల్ని కలవాలని, శరశ్చంద్రిక రూపమైన మీ దరహాసాన్ని చూడాలని.. ఆ అధరాలపై తీయటి మధురాక్షరాలు వ్రాయాలని నాకనిపిస్తోంది.
దీన్ని మీరు ప్రేమ అనుకున్నా నేను మాత్రం అనుబంధమనుకుంటున్నాను. లేకపోతే ఎక్కడో వున్న నేను మీకు ఇలా వుత్తరం వ్రాయటం ఏమిటి? మీ రూపం నాకు తెలియదు.. నా రూపం (ఫొటో) మీకు పంపుతున్నాను. మీ అక్షరాల మాటున దాగిన మీ భావాలు నేను చదువుకున్నాను. నా ఈ ఉత్తరంలో నన్ను అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను.
ఇట్లు
మీ కోసం పరితపించే
మీ
భవాని”
" హు భవాని... చూశావా శరత్.. నీ నవలల్లోంచే నాలుగు డైలాగులు ఏరేసి లెటర్ రాసేసింది. పైగా అనుబంధమంట.. అ-ను-భం-ధం" అందిమాధవి ఉక్రోషంగా.
"అనుభంధం అనకూడదు.. అనుబంధం.." సరిచేశాడు శరత్.
"స్టాపిట్.. శరత్.. అంతా రబ్బిష్.. ఎవరో అనాకారి పిల్ల చేసుంటుంది.."
"లేదు మాధవి.. బాగానే వుంది.." అంటూ మాధవి రియాక్షన్ గమనించి " ఫోటో పంపించింది కదా" చెప్పాడు శరత్.
"ఎంతందంగా వుందేం?" వెటకారంగా అడిగిందింది మాధవి. శరత్‌కి కావాల్సిందదే.. అందుకే తడుముకోకుండా అన్నాడు -
"నీ కన్నా కొంచెం ఎక్కువే" అని.
"నీకు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు.." అంది మాధవి హడావిడిగా ఐస్‌క్రీం పూర్తిచేస్తూ.
"లేదు మధు.. ఈ వుత్తరంలో ఆ అమ్మాయి మనసు కనిపిస్తోంది.. నిజంగానే ఎంతో ప్రేమిస్తున్నట్టు.."
"నీకు కొంచెం ఓవర్ అనిపించట్లేదా?" అంటూ లేచి నిలబడి బిల్ వైపు చూపిస్తూ "డబ్బులిచ్చెయ్.. థాంక్స్ ఫర్ ది పార్టి" అంటూ వెళ్ళిపోయింది మాధవి. శరత్ నవ్వుకున్నాడు.
***
"మాధవి నీతో నేనొక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని ఇక్కడికి పిలిచాను.." అన్నాడు శరత్. అప్పటికే పై సంఘటన జరిగి రెండు వారాలైంది.
"చెప్పు" ముభావంగా అంది మాధవి.
"భవాని.. అదే నీకు తెలుసుగా.. మొన్న లెటర్.."
"తెలుసు" తుంచేస్తూ అంది మధు.
"ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానేమో అని అనిపిస్తోంది మధు.. అదే విషయం లెటర్ వ్రాద్దామనుకుంటున్నాను.."
"వాట్.. నిజంగానే.. ఐ మీన్ ఇంత తక్కువ టైంలో.."
"అవును మధు.. నాకు ఆశ్చర్యంగానే వుంది.. నాకు నీ సలహా కావాలి.. అందుకే.." అంటూ చెప్పబోయాడు శరత్.
"నేనెందుకు ఇవ్వాలి..?" కోపంగా అడిగింది మాధవి.
"అందుకంటే.. ఆ అమ్మాయి వ్రాస్తున్న ప్రతి వుత్తరం నీకు చూపిస్తున్నాను కాబట్టి.. నేను పంపే లెటర్స్ నీకు చూపించాను.." చెప్పాడు.
"అదే.. అసలు నాకెందుకు చూపించావు" అప్పటికే చాలా కోపంగా వుందామెకు.
"ఎందుకంటే.. నువ్వు.. నాకు మంచి ఫ్రెండ్‌వి.. అందుకే.."
"ఫ్రెండ్.. జస్ట్ ఫ్రెండ్.. అంతేనా? ఇంకేం లేదా?"
"అంతే ఇంకేముంటుంది.." అన్నాడు శరత్ మామూలుగా.
"ఓహో నా డైలాగ్ నాకే చెప్తున్నావన్నమాట..! నిన్నగాక మొన్న పరిచయమైందే నీకు ఎక్కువైపోయింది.. ఆ అమ్మాయి ప్రేమిస్తున్నాంటే ఇట్టే అర్థమైపోయింది.. నా మనసు ఎప్పటికి అర్థమైయ్యేట్టు? నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న విషయం ఎప్పటి తెలుసుకుంటావు?" మధు కళ్ళలోనించి కన్నీళ్ళు రాలడానికి సిద్ధంగా వున్నాయి. మరీ తెగేదాకా లాగిన విషయం అర్థమై శరత్ ఏదో అనబోయాడు..
"నాకు నీ వివరణ, సంజాయిషీ అవసరంలేదు.. ఇంక నించి నన్ను డిస్టర్బ్ చెయ్యద్దు ప్లీజ్" చెప్పింది మాధవి. ఇక కన్నీళ్ళని ఆపటం ఆమె వల్లకాలేదు.
శరత్ దగ్గరగా వచ్చి ముఖంలో ముఖం పెట్టి అన్నాడు -
"ఈ మాత్రానికే ఇలా ఏడ్చేస్తే ఎట్లా.. ఎప్పుడూ నువ్వు నన్ను ఏడిపిస్తావు కదా అని.. సారి… వెరీ సారి..”
"అంటే..?" అదిగింది మాధవి అనుమానంగా.
"అంటే ఏమి లేదు.. నువ్వనుకున్నట్టు ఆ భవాని మిస్ భవాని కాదు.. మిస్టర్ భవాని.."
"ఏంటి.. మిస్టరా?"
"అవును భవానీ ప్రసాద్.. ఫోటో చూస్తే తెలిసేది.."
"వాట్ డూ యు మీన్??"
"నువ్వనుకునేదేమి కాదు.. సరదాగా నిన్ను టీజ్ చెయ్యడానికి చెప్పాను.."
"మరి మగవాడైతే నీకు లెటర్ ఎందుకు వ్రాసినట్టు??"
"ఎందుకంటే నా రచనలు చదివేవారికి నేను ఆడో మొగో తెలియదు కాబట్టి.. కలం పేరు రాజహంస కదా అంటే అమ్మాయి అనుకున్నారు చాలామంది.. అలాగని నాకు లెటర్స్ వస్తూనే వుంటాయి.. కాకపోతే ఈ లెటర్ చూడగానే.."
"నన్ను ఏడిపిద్దామనిపించింది.."
"అవును.." నవ్వాడు శరత్.
"యు ఆర్ ఎన్ ఈడియట్. నీకు ఇందుకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే.." నవ్వింది మధు.
"చెప్పు ఏం కావాలో"
"ఎనీథింగ్ తియ్య తియ్యగా.."
"యూ మీన్ ఐస్ క్రీం.." అడిగాడు శరత్.
"నో.. సంథింగ్ ఎల్సె" కన్ను కొట్టింది మాధవి.
***
(ఆవకాయ్.కాం లో గత జూన్ 20న ప్రచురితం)

(ఈ కథ ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో 6 జూన్ 2010లో ప్రచురితం)
"చిలకా ... చిలకా ...''
"... ... ...''
"పలకవేమే?'' రెట్టించింది ప్రియ.
ఏమిటన్నట్టు చూసింది చిలక.
"నాకో సాయం చేసి పెడతావా? నేను ఒక వుత్తరం రాసిస్తా. ఆయనకి ఇస్తావా?'' అడిగింది ప్రియ.
ఇస్తానన్నట్లు తలాడించింది చిలక.
ఆ అంగీకారమే చాలు ... వెంటనే ప్రియ వెతికి వెతికి ఎర్రటి గులాబీరంగు కాగితం తెచ్చుకుంది. చిక్కని రంగుతో రాసే కలాన్ని అందుకుంది.
కావ్య కన్యలా మంచం మీద పడుకొని ఉత్తరం మొదలుపెట్టింది.
ఉత్తరం నిండా ఎంత ప్రేమో, విరహమో, ఎన్నెన్ని అలకలో, కలతలో...!! రెండు సార్లు ఆ ఉత్తరాన్ని ఆప్యాయంగా చదువుకొని,
మురిసిపోయి, ముసిముసిగా నవ్వుకొని ఎంతో జాగ్రత్తగా మడిచింది.
"ఇస్తావుగా చిలకమ్మా ... శరత్ చేతికే ఇవ్వు ... మర్చిపోవుగా ...'' అంటూ పదే పదే చిలకకి చెప్పింది ప్రియ. ఆ కాగితం
అందుకొని రివ్వున వెళ్లిపోయింది చిలక.
***
శరత్ ఉత్తరం అందుకోగానే ఆనందంతో పరవశుడయ్యాడు. ఎంతకాలమైంది ఇలా ఉత్తరాలు రాసుకొని ... పైగా ఇలా చిలకతో పంపుతుందని అస్సలు ఊహించలేదు. కళ్లతోనే చిలకకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఉత్తరాన్ని పొదివి పట్టుకున్నాడు. పసిపిల్లని తాకినట్లు ముద్దుగా తాకాడు. గులాబిరంగు కాగితం నుంచి గులాబిపువ్వు గుబాళింపు. ప్రియ ఎప్పుడూ ఇంతే... ప్రేమలో పడి మునిగి తేలిన రోజులలోనూ ఇంతే... ఉత్తరం రాసిందంటే ఇలాగే మత్తెక్కించే మల్లెల పరిమళాలో, సంపెంగ సువాసనలో ఉండాల్సిందే. సరే సరే... ఇదంతా ఆలోచిస్తూ కూర్చుంటే ఇక ఉత్తరం చదివినట్లే. పైగా నిద్రముంచుకొస్తోంది. ఉత్తరం తెరిచాడు.
"నా శరత్ కాలమా...
ఎన్నాళ్ళైంది నిన్ను చూసి.. నవ్వకు. నాకు తెలుసు మూడురోజులే అని. కానీ క్యాలెండర్లో ఒక గడి నుంచి మరో గడికి మధ్య ఎంత దూరముందో నువ్వెప్పుడైనా కొలిచావా? మారిన తేదీలు కాదు అవి మారడానికి పట్టే గంటలు, నిమిషాలు, క్షణాలు గుర్తించావా? ఆ క్షణాల బరువెంతో ఎప్పుడైనా అడిగావా?
నిన్ను చూడాలని ఎంతగా అనిపిస్తోందో తెలుసా? ఒక్కసారి కనిపించిపోరాదూ... నిన్ను కాసేపు చూసిన జ్ఞాపకంతో ఎన్ని వేల క్షణాలైనా
ఆనందంగా గడిపేస్తాను.
నాకు తెలుసు నువ్వేమంటావో ... నన్ను చూడాలనిపిస్తే అన్నీ వదిలేసి నా దగ్గరకి రా... అంటావు. అంతే కదా? మనకోసం మన ప్రేమకోసం అలాగే అన్నీ వదిలేసి నీతో కలిసి రాలేదూ. కాని ఇప్పుడు ఏం చెయ్యగలం చెప్పు ... మనమంతట మనమే గాజుగోడల గదుల మధ్య ఇరుక్కుపోయాం... మనకోసం కాకపోయినా మనకి పుట్టబోయే బిడ్డకోసమైనా మరికొంత కాలం... ఓహ్... చెప్పేశానా? నువ్వు కలిసినప్పుడు చెప్పాలనుకున్నా... అది విన్నప్పుడు నీ కళ్లలో ఆశ్చర్యంతోనో, ఆనందంతోనో వచ్చే మెరుపు చూడాలనుకున్నా... ప్చ్... అయినా నీ ఆనందాన్ని నేను ఊహించుకోగలనులే ... అదిగో నీ చిరునవ్వు నాకు కనిపిస్తోంది ... ఈ వాక్యం చదివాక మరికొంచెం పెద్దదైన నీ నవ్వు నాకు వినిపిస్తూనే ఉంది....
మరో మూడు రోజులు ... నువ్వు వచ్చేస్తావు ... వచ్చేస్తావు కదూ ...!
నీ ప్రియ
(ఈ విషయమంతా నీకు ఫోన్ చేసి చెప్పొచ్చు... కానీ నేను ఎప్పుడు ఫోన్ చేసినా నువ్వు బిజీగా ఉన్నానంటావు. లేదా... నిద్ర వస్తోందంటావు. అదిగో ఇప్పుడు కూడా ఆవలిస్తున్నావు కదూ... సరే ఇక ఉంటాను... హాయిగా నిద్రపో...) చదువుతూనే నిద్రపోయాడు శరత్.
***
ప్రియా,
నేను వచ్చాను ... నిజంగా వచ్చాను. నువ్వు మంచి నిద్రలో ఉన్నావప్పుడు. నా గురించే కలలు కంటున్నట్లున్నావు. లేకపోతే మనకి పుట్టబోయే పాపను తలచుకుంటున్నట్లున్నావు ... నిద్రలో చిన్నగా నవ్వుతున్నావు. అబ్బ ... ఎంత బాగుందో తెలుసా నిన్ను అలా చూస్తుంటే ... ! అందుకే అలానే చూస్తూ ఉండిపోయాను. నీలో కొత్తగా వచ్చిన మార్పు వల్లేమో... ఇంకా అందంగా కనిపిస్తున్నావు ... ఒక్కసారి నిద్రలేపి పలకరిద్దామనుకున్నాను. కానీ, ఎందుకో అలాగే బాగుందనిపించింది. ఇష్టం లేకపోయినా అక్కడి నుంచి వెళ్లక తప్పలేదు. ఎప్పుడు నిద్రపోయానో గుర్తులేదు. లేచి చూసేసరికి నువ్వు లేవు. ఇంకా రెండు రోజులు ఆగాలి మనం కలవడానికి ... రెండు రోజులు !! నీకోసం ఎదురుచూస్తూ ... - శరత్
(నీలాగ నేను కవిత్వం రాయలేకపోయినా, ఉత్తరాలు రాయటం మాత్రం నిన్ను ప్రేమించిన తరువాతే నేర్చుకున్నాను. ఫోన్ చెయ్యకు... ఇదే బాగుంది)
చిలక ఇచ్చిన ఉత్తరం చదివి ప్రియ చిన్నగా నవ్వుకుంది. కాగితాన్ని మడిచి తన నీలంరంగు డైరీలో పెట్టుకుంది. పక్కనే ఎర్రరంగు డైరీ... శరత్ది.
అందులో తను వ్రాసిన ఉత్తరాలు ... రంగురంగులవి కనిపిస్తున్నాయి. ఒకసారి తీసి చూద్దామనుకుంది. అంతలోనే వద్దనుకుంది. ఆకుపచ్చటి కాగితం తీసుకొని శరత్ ఉత్తరానికి జవాబు మొదలుపెట్టింది.
"శరత్ వెన్నెలా ... నువ్వు వచ్చిన సంగతి నాకు తెలియకుండా ఎందుకు ఉంటుంది? నీ రాక నా మనసులో వెయ్యి వీణలై మోగదూ ... నిద్రలో కూడా నువ్వొచ్చావని తెలిసి నవ్వుకున్నానేమో... అలా నువ్వు నన్ను తదేకంగా చూడ్డం బాగుందనే నాకు మెలకువ రాలేదేమో. నేను కూడా నిన్ను చూశాను తెలుసా? అవును ... నువ్వు నిద్రపోగానే నేను లేచాను. ప్రశాంతంగా నిద్రపోతున్నావు ... కలలో నేనో, మరి మన బాబో ... (అవును... నువ్వన్నట్లు పాప కాదు ... బాబు ... నీ పోలికలతో మన బాబు) వచ్చినట్టున్నాం. అయినా నీలాగ నేను అలాగే చూస్తూ ఉండలేకపోయాను. లేపాలని చూశాను. మగత కళ్లతో చూసినట్లున్నావు కూడా... నిజంగ చూశావో లేదో ... మళ్ళీ నిద్రలోకి ... సరే ఇక్కడే ఆపేస్తున్నా... మన చిలక తొందరపడుతోంది ...
రేపేగా ఆదివారం.. మనం కలిసే రోజు.. ఈ రేపటికోసం వారం కాదు ఎన్ని యుగాలైనా వేచి ఉంటాను.
రేపటి కోసం ...
ప్రియ''
అప్పటికే వెళ్లిపోబోతున్న చిలకని బ్రతిమిలాడి ఆపి ఉత్తరం ఇచ్చి "ఇస్తావు కదూ...'' అంది ప్రియ.
"ఇస్తానమ్మా... అయినా విచిత్రం కాకపోతే ఒకే ఇంట్లో ఉండే మొగుడూ పెళ్లాలు ఇట్టాగ వుత్తరాలు రాసుకోవడమేంది? పోనీ అయ్యగారూ మీరూ ఇద్దరూ పగలూ రేయీ కాకుండా ఒకటే షిప్టు వుద్యోగాలు చూసుకోకూడదూ...'' నవ్వుతూ అంది పనమ్మాయి చిలకమ్మ.

అహ నా పెళ్ళంట అనే సినిమా చూశారా? అవునండి..నేను మాట్లాడేది కోటశ్రీనివాసరావు పాత్ర లక్ష్మీపతి గురించే..!! మన అరగుండు బ్రహ్మానందం చెప్పినట్టు - "బోరింగు పంపులో ముందు కొంచెం నీళ్ళు పోయందే ఎలా నీళ్ళు బయటకు రావో.. అలాగే లక్ష్మీపతిగారికి చేతిలో బరువు పడందే పని జరగదు.. (పరమ బోరింగు ముఖం..!!)"
ఇలాంటి మనుషులు మనకి రోజు తగులుతూనే వుంటారు..!! ఏ విషయమైనా మనకేంటి అని అని ఆలోచించిగాని ఏ పనైనా మొదలు పెట్టరు. ఇలాంటి వాళ్ళని చూస్తే మనకందరికీ చిరకు రావటం సహజం. అయితే వీళ్ళకన్నా దారుణంగా మనం ప్రవర్తిస్తామనేది మనం చాలా సులభంగా మర్చిపోతుంటాం. నిజానికి ఇలాంటి లక్ష్మీపతులకన్నా మనలాంటి వారి వల్లే సమాజానికి చెడు జరుగుతుంది. నమ్మటం లేదా..?? లక్ష్మీపతి కన్నా మనం చెడ్డవాళ్ళమా అని కోపం వస్తోందా? శాంతం.. శాంతం.. సాంతం విన్నాక మీకే తెలుస్తుందిగా..!!
మనం చేసే ఏ పనికైనా లాభం నష్టం రెండూ వుంటాయి. అయితే ఈ లాభం నష్టం అనేవి డబ్బుతో మాత్రమే కొలవలేము. ఈ లాభ నష్టాలను బేరీజు వేసుకోని, దాని అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాం. వుదాహరణకి ఈ రోజు ఆఫీసుకి వెళ్ళాలా లేదా అని ఆలోచన వచ్చిందనుకోండి - ఇంట్లో వుండటం ద్వారా కలిగే లాభాలు (ఎక్కువసేపు నిద్ర పొవటం నించి, మనకి ఇష్టమైన క్రికెట్ మ్యాచ్ టీవీలో చూడటందాకా) నష్టాలు (ఆఫీసులో పని మిగిలిపోవటం నించి బాసు గారికి కోపం రావటం దాకా) అన్నీ ఆలోచించే కదా నిర్ణయించుకుంటాం. ఇంతవరకూ బాగానేవుంది - కొంచెం స్వార్థం వున్నా (లక్ష్మీపతిలాగానే), అంతమాత్రం ఆలోచించకపోతే "తనకు మాలిన ధర్మమౌతుంది".
అయితే వచ్చిన చిక్కల్లా ఏమిటి అంటయ్యా అంటే - మనం బేరీజు వేసుకోవాల్సిన మరో విషయాన్ని మర్చిపోవడం. అదేమిటంటే మనం చేసే పని వల్ల మన పక్కవారికి, చుట్టుపక్కలవారికి, ఇంకా పెద్దదిగా చూస్తే సమాజానికి కలుగుతున్న లాభనష్టాల గురించి ఆలోచించకపోవడం. ఈ విషయం అర్థమవ్వాలంటే ఒక చిన్న వుదాహరణ-
ప్రతి నెల రెండొవ ఆదివారం తెలుగు బ్లాగర్ల సమావేశం కృష్ణకాంత్ వుద్యానవనంలో జరుగుతుంది. ఈ సమావేశానికి వెళ్ళలా లేదా అనేదే సమస్య అనుకుందాం. వెళ్ళక పోతే ఇంట్లో ఒక కునుకెయ్యచ్చు, లేదా టీ.వీ.లో వచ్చే ఏ రియాలిటీ షోనో చూడచ్చు - ఇవీ లాభాలు. ఈ-తెలుగు చర్చల్లో పాల్గొనలేకపోవటం, కొంతమంది మిత్రులతో కలిసి సమయం గడిపే అవకాశం లేకపోవటం ఇలాంటివి కొన్ని నష్టాలు.
ఒక వేళ వెళ్తే - అక్కడిదాకా బండి మీద వెళ్ళటం, కాస్తో కూస్తో డబ్బులు ఖర్చు, ఇంట్లో పెళ్ళాం పిల్లలు - "ఆదివారం కూడా ఏదో పని పెట్టుకున్నారని" సణగటం అనేవి కొన్ని నష్టాలు. (ఇంకా చాలా వుండచ్చు.. అవి ఎవరికి వారు ఆలోచించుకోవచ్చు) మరి లాభాలు ఆలోచిస్తే కొంతమంది మిత్రుల్ని, సాహిత్యకారుల్ని కలవటం, ఈ-తెలుగు చర్చల్లో పాల్గొనడం వంటివి వుండచ్చు.
వీటి ఆధారంగానే నిర్ణయం తీసుకోవడం సహజం. అయితే ఇక్కడ ఆలోచించడం మర్చిపోయిన విషయం ఏమిటంటే - మనం వెళ్ళడం వెళ్ళకపోవడం వల్ల ఈ-తెలుగు/తెలుగు బ్లాగర్ల సఘానికి ఏదైనా నష్టం కలుగుతుందా? అని
"ఛ! వూరుకోండి మాష్టారు.. నేను వెళ్ళకపోతే ఈ-తెలుగుకి నష్టం ఏమిటి? నేనేదో సముద్రంలో నీటిచుక్కగాడిని" అంటున్నారా..!! అలా అనుకోవడమే పెద్ద సమస్య. సముద్రమైనా ఒక్క నీటి చుక్కతోనే మొదలౌతుంది.. ప్రతి నీటిచుక్కా కలిస్తేనే సముద్రమౌతుంది. అందువల్ల ప్రతి నీటి చుక్కా సముద్రానికి అవసరమూ, అమూల్యము.
సరే మనం వెళ్ళకపోవడం వల్ల ఈ-తెలుగుకి తెలుగు బ్లాగర్ల సంఘానికి జరిగే నష్టం ఏమిటి? ఆలోచించండి - సభ్యులు కరువైతే సంఘం అస్థిత్వాన్ని కోల్పోతుంది. ఆ సంఘం అవసరం కరువైపోతుంది. ఒకరిని చూసి మరొకరు - ఆ ఈ మధ్య ఎవరూ రావట్లేదు - అనుకుంటూ తాము రావటం మానేస్తారు. ఇలాంటి సమావేశానికే విలువపోతుంది. నిర్వహించేవారిని నిరుత్సాహం ఆవహిస్తుంది..!! చివరికి సదరు సంఘానికి మనుటయా మరణించుటయా అనే ప్రశ్న తలెత్తచ్చు.
"ఇవన్నీ నావల్లే జరిగుతాయా" అని మీరనచ్చు - మీరంటే ఎవరు? మీరొక్కరే కాదుకదా - మీలాంటివారే అందరూ.. మీలాంటి వాళ్ళే ఎందరో కలిస్తే మనం అందరం తయారౌతాం..!! అందరూ విడివిడిగా స్వంత లాభం చూసుకోని "అందరి లాభం" మర్చిపోయినప్పుడు.. అందరిలో మనం వున్నాం కాబట్టి ఆ "అందరి నష్టం" విడివిడిగా భరించాల్సి వస్తుంది. తికమకగా వుందా? సరే ఒక కథ చెప్తాను వినండి -
ఒక వూరి ప్రజలంతా కలిసి కరణంగారి ఆధ్వర్యంలో దేముడికి పాలతో అభిషేకం చేయాలనుకున్నారు. అందరూ చెంబెడు పాలు తెచ్చి పెద్ద గంగాళంలో పొయ్యాలని ప్రకటించారు. అయితే ఆ రోజు సాయంత్రం గంగాళంలో చూస్తే మొత్తం నీళ్ళే వున్నాయిట. ఎందుకని విచారిస్తే - ప్రతివాడు, అందరు పాలుపోసి నేనొక్కణ్ణే నీళ్ళుపోస్తే ఎవరికి తెలుస్తుందిలే అనుకోని అందరూ నీళ్ళు పోసారట..!!
ఆ రకంగా వాళ్ళంతా కలిసి చెయ్యాలనుకున్న పని చెయ్యలేకపోయారు. అలాగే ఒక సంఘంగా, ఒక సమాజంగా మనం చెయ్యాలనుకున్న పని చెయ్యలేకపోతే నష్టపోయే సంఘంలో, సమాజంలో మనం కూడా వున్నామన్న సంగతి మర్చిపోకూడదు. ఇలా "సొంతలాభం కొంత మానుకొని" ఆలోచించడం మొదలుపెడితే - ట్రాఫిక్, కాలుష్యం, ప్లాస్టిక్ వాడకం లాంటి ఎన్నో సమస్యలకు సమాధానం దొరుకుతుంది. మనమంతా "అహనా పెళ్ళంట లక్ష్మీపతులం" కాదని నిరూపించుకునే అవకాశం కలుగుతుంది.

(ఈ కథ ప్రముఖ అంతర్జాల పత్రిక పొద్దులో ప్రచురితం)
కొంచెం దూరంగా తన కొలీగ్స్ తో భోజనం చేస్తూ కనపడిందామె. చటుక్కున తల తిప్పుకున్నాను.
“ఉష లాగా వుందే..!! లాగా వుండటం ఏమిటి ఉష.. కొంచెం వొళ్ళు చేసినట్లుంది..!! నన్ను చూసిందా? గుర్తు పట్టిందా? ఏమో.. గుర్తు పట్టకపోతే బాగుండు..!!” అనుకుంటూ మళ్ళీ అటు చూడకుండా భోజనం వడ్డించుకున్నాను.
నాకు ఆ కంపెనీలో అదే మొదటిరోజు. ఇండక్షన్ ట్రైనింగ్ జరుగుతోంది. మూడేళ్ళ వుద్యోగానుభవం వున్నా కొత్త కంపెనీ, కొత్త ఇండస్ట్రీ కావటంతో నాకు అంతా కొత్తగా వుంది. అప్పుడే పరిచయమైన కొత్త మిత్రులతో కలిసి క్యాంటీన్‌లో వున్నాను.
"హేయ్.. రమణ ఈజ్ దట్ యూ?" వినిపించి వెనక్కి చూశాను. ఉష..!!
"ఉష.. హాయ్.. ఏంటి ఇక్కడ" అన్నాను ఆశ్చర్యం నటిస్తూ.
"అవును ఇక్కడే.. బిజినెస్ ఎక్సలెన్స్ టీంలో వున్నాను.. సో.. నువ్వు ఇక్కడే చేరావన్నమాట.. ఏ డిపార్ట్మెంట్?" అడిగింది నా మెళ్ళో వున్న ట్రైనీ టాగ్ చూసి.
"ఎలయన్సెస్" చెప్పాను క్లుప్తంగా. తను నవ్వింది.. ఐదు సంవత్సరాల క్రితం నన్ను కట్టిపడేసిన అదే నవ్వు..!!
"ఎలయన్సెస్.. ఎవరెవరికి..??" అంటూ మళ్ళీ నవ్వింది. నేను చిన్నగా చిరునవ్వు నవ్వాను.
"నన్ను చూసి ఎక్సైట్ అవుతావనుకున్నాను.. అలాంటిదేమీ లేదే?.. సర్లే నా తో రా" అంటూ చెయ్యి పట్టుకుంది. “ఫ్రెండ్స్ వున్నారు.. ట్రైనింగ్ మధ్యలో లంచ్ బ్రేక్ ఇచ్చారు త్వరగా వెళ్ళాలి” అన్నాను
"ఓకే.. ట్రైనింగ్ అయిపోగానే నాకు రింగ్ చెయ్యి.. కలుద్దాం" అనేసి వెళ్ళిపోయింది.
లంచ్ చేసి, ఫ్రెండ్స్‍తో కిందకి వెళ్ళి సిగరెట్ వెలిగించగానే ఉష కూడా అక్కడికి వచ్చింది.
"ఓ నువ్వు కూడా మొదలెట్టావన్నమాట.. ఏదీ నాకూ ఒకటి ఇవ్వు" అడిగింది. ఆడవాళ్ళు సిగరెట్ తాగడం నాకేమి కొత్తకాదు.. కాని ఉష సిగరెట్ కాలుస్తుందా?
"ఒక్కటే వుంది.." చెప్పాను.
"ఫర్లేదు.. వీ కెన్ షేర్" అంటూ నా చేతిలో సిగిరెట్ అందుకుంది. గట్టిగా రెండు దమ్ములు లాగి తిరిగి నా చేతిలో పెట్టింది. ఉష పెదవులను తాకిన సిగిరెట్ నా పెదవుల మీదకి.. ఆ వూహే నాకు గిలిగింత పెట్టింది. అదీ నా కొలీగ్స్ ఆశ్చర్యంగా చూస్తున్నారని తెలిసినప్పుడు ఇంకా గమత్తుగా వుంది. ఇద్దరం కలిసి సిగరెట్ పూర్తి చేశాం.
"మర్చిపోవద్దు.. ట్రైనింగ్ అవ్వగానే కలుద్దాం" అని మళ్ళీ చెప్పి తను వెళ్ళిపోయింది.
"ఎవరు రమణ ఆ అమ్మాయి?" అడిగాడు ట్రైనింగ్ రూంలో నా పక్కనే కూర్చున్న హేమేంద్ర.
"కాలేజిలో నా సీనియర్.. ఉష " చెప్పాను నేను టూకీగా. "సీనియర్" అనగానే అతను వూహించుకున్నదంతా తప్పు అనుకున్నాడేమో మళ్ళీ మాట్లాడలేదు. కాని అతను వూహించుకున్నదానికన్నా ఎక్కువే జరిగిందని అతనికి తెలియదు.
***
నేను ఎంబీయే కాలేజిలో చేరిన మొదటిరోజే ఉష పరిచయమైంది. భయం భయంగా నడుస్తున్న నన్ను సీనియర్స్ గ్యాంగ్ ఒకటి పిలిచింది. నాకిప్పటికీ గుర్తు.. అందరూ లైబ్రరీ మెట్లమీడ కూర్చోని వున్నారు. అందరి మధ్యలో ఉష.. బ్లాక్ జీన్స్ పైన ఎర్రటి స్లీవ్లెస్ టాప్.
"పేరు" ఎవరో అడిగారు.
"రమణ సార్"
"పూర్తి పేరు చెప్పు"
" "
"చెప్పు"
"వద్దు సార్ మీరు వెక్కిరిస్తారు"
"అంత వెక్కిరించే పేరా.. అయితే చెప్పాల్సిందే"
"హటకేశ్వరం ఇందీవర వెంకటరమణ"
ఉష వెంటనే నవ్వింది.. మిగతావాళ్ళకి అర్థమవ్వలేదు. తను నిలబడి -
"అంటే ఎచ్.ఐ.వి. రమణ అన్నమాట" అన్నది నవ్వుతూనే. అందరూ ఘొల్లు మన్నారు.
"అందుకే మేడం పేరు చెప్పను అన్నది.." అన్నాను ఆమె వైపు చూస్తూ.
"ఏయ్.. మేడం ముందు కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తావా? దించు.. చూపు దించు.." అన్నాడు పక్కనే వున్న మరో సీనియర్. నేను కొంచెం తల దించాను. పూర్తిగా దించలేదని ఆమెకి కోపం వచ్చింది.
"కొందకి దించు అంటే ఎక్కడరా చూస్తున్నావు.. ఇక్కడేనా చూస్తున్నావూ?" అన్నది గుండెమీద చెయ్యేస్తూ. నేను భయంగా తలెత్తాను..
"ఏంటి నచ్చిందా? చూడు అయితే.. చూడు.." అంటూ చేతులు వెనక్కి విరిచి ముందుకొచ్చింది. అప్పుడు నేను పరుగెత్తిన పరుగు క్లాస్‌రూంకి వెళ్ళేదాకా ఆపలేదు. వెనకాల అందరూ నవ్వుతున్నారు.
***
అందరూ నవ్వుతున్నారు. ట్రైనర్ నా వైపే చూస్తున్నాడు..
"విల్ యు ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్." అన్నాడు కోపంగా.
"సారీసార్.. మీరు చెప్పింది వినలేదు." చెప్పాను నేను నిజాయితీగా.
"ఇది కాలేజ్ కాదు.. ట్రై టు బి ప్రొఫెషనల్..!!" అన్నాడు కోపంగా. నేను తల వూపాను. కాని మనసు ఉష చుట్టే తిరుగుతుంటే ఆలోచనలని ఎలా ఆపగలను?
ఎలాగైనా ఈ రోజు కలవకుండా తప్పించుకోవాలి. ట్రైనింగ్ అయిపోగానే గెస్ట్‌హౌస్‌కి వెళ్ళిపోవాలి అనుకున్నాను. ‘ఉష అంటే ఎందుకంత భయం..’ అంతలోనే అనిపించింది. తనతో నాకు వున్న ఇంటిమసీ వేరే ఎవ్వరికీ వుండేది కాదు.. అప్పుడు నేను చేసిన తప్పుకి ఇప్పుడు గిల్టీగా ఫీలౌతున్నానా? ఏమో అర్థం కావటంలేదు. కాని ఉష మాత్రం ఏమి మారినట్టులేదు. అదే రెక్లెస్నెతస్ అదే ఓపెన్ టాక్..!!
ట్రైనింగ్ పూర్తైపోయింది. మిగిలినవారు ఏవో జాయినింగ్ ఫార్మాలిటీస్ పూర్తి చెయ్యాలని ఆగిపోయారు. నేను మాత్రం వెంటనే టాక్సీ ఎక్కి గెస్ట్‌హౌస్‌కి వెళ్ళమని చెప్పి,నిర్లిప్తంగా కిటికీలోనించి బయటకు చూస్తున్నాను.
ఉష నా కోసం ఎదురు చూస్తుంటుందా? అసలు ఎందుకు వుండమంది? కాలేజిలో నా రాగింగ్ ప్రహసనం విన్న తరువాత నా క్లాస్‌మేట్స్ చెప్పింది గుర్తుకు వచ్చింది.
"ఆ అమ్మాయి పేరు ఉష.. చాలా ఓఓఓపెన్" అన్నాడు మధుర్ చివరి పదాన్ని సాగదీస్తూ.
"అంటే"
"అంటే ఏముంది బ్రదర్.. షీ ఈజ్ ఆల్వేస్ విల్లింగ్.. నెవర్ సే నో.. ఇంట్రెస్ట్ వుంటే ప్రయత్నించు" చెప్పాడు వాడు. అది విన్న తరువాత నాకెందుకో ఆమెంటే మంచి అభిప్రాయం కలుగలేదు. కాని ఇప్పుడు..!! ఇప్పుడున్న అభిప్రాయమే వేరు..!!
టాక్సీ ఏదో సిగ్నల్ దగ్గర ఆగింది. ఒక పిల్లాడు చేతిలో రకరకాల మేనేజిమెంట్ పుస్తకాలు అమ్ముతున్నాడు. ప్రత్యేకించి రెండు పుస్తకాలు నన్ను ఆకర్షించించాయి - "రాబర్ట్ కియోసాకి - రిచ్ డాడ్ పూర్ డాడ్" దాని పక్కనే "రాబిన్ శర్మ - ద మాంక్ హూ సోల్ద్ హిస్ ఫెరారి". అవే పుస్తకాలు.. కాలేజిలో ఉషతో నాకు పరిచయాన్ని, ఆ తరువాత చనువుని పెంచినవి....
నా చేతిలో "రిచ్ డాడ్..” పుస్తకం చూసి అడిగింది.
"నచ్చిందా?" అని
"ఏమిటి?"
"అదే ఆ బుక్"
"బాగానే వుంది.."
"ఏంటి బాగుండేది.. ఇట్స్ కంప్లీట్‌లీ మెటీరియలిస్టిక్.. రీడ్ రాబిన్ శర్మ.. అతను మెటీరియల్ ప్లజర్స్ అనుభవించి వాటికి అతీతంగా వుండాలని వ్రాసిన పుస్తకం" చెప్పింది.
"మెటీరియలిజం అంటే మీకు ఇష్టంలేదా?" అంటే ఆ అమ్మాయి నవ్వింది.
"నీ గర్ల్‌ఫ్రెండ్‌తో సెక్స్ తరువాత ఆమెకి వెయ్యి రూపాయలు ఇస్తే ఆమె ఏమంటుంది" అడిగింది కాజువల్‌గా. వూహించని ప్రశ్నకి ఖంగు తిన్నాను. తడబాటును కప్పిపుచ్చుకోని -
"నాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు.." అన్నాను.
ఉష గట్టిగా నవ్వి "చో చ్వీట్.." అంటూ నా తలపై చేత్తో చిన్నగా కదిపింది.. "ఎనివేయ్.. నేను చెప్పాలనుకున్నది నీకు అర్థమైందని నాకు తెలుసు" అంటూ కన్ను గీటింది.
"అలా ఎలా తెలుస్తుంది?" అడిగాను.
తను నాకు దగ్గరగా వచ్చి అన్నది - "అదే కాదు... గర్ల్‌ఫ్రెండ్ తో సెక్స్ అనగానే నీ ఖంగారు చూస్తే నువ్వు వర్జిన్ అని కూడా తెలిసిపోయింది.."
నా గుండే కొట్టుకుంటున్న వేగం మెదడుదాకా తెలుస్తోంది. ఈమె నిజంగానే ఆ టైపా? చూడటానికి చక్కగానే వుందే..! ఏమైనా ఈమెకి దూరంగా వుండాలి అనుకున్నాను.
"ఈవినింగ్ ఇంటికిరా ఆ పుస్తకం ఇస్తాను.. డోంట్ ఫర్గెట్.." అనేసి వెళ్ళబోయి మళ్ళీ వెనక్కి తిరిగి తల మీద చెయ్యి పెట్టి అన్నది - "చో స్వీట్.." అని.
***
"సార్ బాంద్రా గెస్ట్‌హౌస్" అన్నాడు టాక్సీ డ్రైవర్.
నేను తేరుకోని డబ్బులిచ్చి నా రూంలోకి వడివడిగా వెళ్ళిపోయాను. రూంలో బాత్‌టబ్ వుంది. దాని నిండా గోరువెచ్చటి నీళ్ళు నింపుకోని అందులో దిగాను. మళ్ళీ ఉష గురించే ఆలోచన. ఇప్పుడు ఎక్కడ వుంటుంది? నా కోసం ఎదురుచూస్తూ ఆఫీస్‌లోనే వుంటుందా? లేకపోతే తన గురించి మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోయి వుంటుందా? పెళ్ళైందో లేదో..!!
అప్పుడు కాలేజిలోనూ అలాగే చేశాను.. తను రమ్మన్నా నేను ఆమె ఇంటికి వెళ్ళలేదు.
"నువ్వు వస్తావని ఎంతసేపు వైట్ చేశానో తెలుసా? ఇంట్లో ఎవ్వరూ లేరు.. నాకు బోరు కొడుతూ వుండింది. నువ్వొస్తే ఎంతబాగుండేది" అన్నది
"మార్కెటింగ్ ప్రాజెక్ట్ గురించి ప్రొఫెసర్‌తో..." చెప్తుండగానే మధ్యలో అందుకుంది.
"స్టాపిట్ యార్.. ఒక అమ్మాయి పిలిస్తే రాకపోవటానికి చాలా సిల్లీ రీజన్ అది.. వేరే ఏదైనా అమ్మాయితో కలిసి పార్క్‍కి వెళ్ళాను అనో డేట్‌కి వెళ్ళాననో చెప్పు కొంచెం బాగుంటుంది" అన్నది
"ఛ ఛ అలాంటిదేమి లేదు"
"ఛ ఛ ఏమిటి.. అదేదో చెయ్యకూడని తప్పు చేసినట్టు.. నేనైతే తప్పు చేసినా ఛ ఛ అనుకోను తెలుసా?" కన్నుగీటింది.
ఏమిటీ అమ్మాయి.. ఎందుకలా మాట్లాడుతోంది..??
"ఈ రోజైనా వస్తావా..?" అడిగింది
"వస్తాను" చెప్పాను.
నా క్లోజ్ ఫ్రెండ్ శేఖర్‌కి జరిగింది చెప్పాను. పక్కన మధుర్ కూడా వున్నాడు.
"నాకు తెలిసి ఆ అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.. గో ఎహెడ్ బ్రదర్.." అన్నాడు శేఖర్.
"అవును.. మంచి ఛాన్స్.. నేను ముందే చెప్పానుగా.. ఆల్వేస్ విల్లింగ్.. ఎంజోయ్ రమణ" అన్నడు మధుర్.
"ఛ.. ఛ.. అలాంటిదేమిలేదు.. పుస్తకం ఇవ్వటానికే.." అన్నాను నేను తడబాటుగా.
"పుస్తకం ఇవ్వాలంటే తనే తెచ్చి ఇవ్వచ్చుగా.. ఇంటికి రమ్మనడం ఎందుకూ" శెఖర్ అడిగాడు.
"అవును.. అది కూడా ఇంట్లో ఎవరూ లేరు అని చెప్పడం ఎందుకూ? అనుమానమే లేదు.." మధుర్ వంతపాడాడు.
"నాకు ఇలాంటివేమి తెలియదురా.. ఫస్ట్ టైం" అంటుంటేనే నాకు గుండెల్లో దడ పెరుగుతోంది.
"ఫర్లేదులేరా.. ఆ అమ్మాయికి అంతా తెలిసే వుంటుంది.. తీసుకెళ్ళాల్సినవి మర్చిపోకు" అన్నాడు కన్ను గీటుతూ.
"ఛ.." అన్నాను మనసులో మరోరకంగా ఆలోచిస్తూ.
ఆ రోజు సాయంత్రం రూంలో స్నానం చేసి నీటుగా తయారయ్యాను. మథుర్ తన సెంట్ బాటిల్ ఇచ్చి "వాడరా.. బాగుంటుంది" అన్నాడు. శేఖర్ తన బైక్ ఇచ్చాడు. కొత్త పెళ్ళికొడుకుని శోభనానికి తయారు చేసినట్లు ముస్తాబు చేశారు ఇద్దరూ. మధ్య మధ్యలో ఆ టైపు జోకులు.. చివరికీ విజయీభవ అంటూ ఆశీర్వదించి పంపించారు.
నేను ఉష ఇంటికి వెళ్ళాను. గుండె చప్పుడు చెవుల్లో కొడుతున్నట్టు వినపడుతోంది. నుదిటిమీద చమట తుడుచుకున్నాను. ఎన్నిసార్లు కాలింగ్ బెల్ మీద చెయ్యిపెట్టి మళ్ళీ వద్దనుకున్నానో లెక్కే లేదు. చివరికి స్థిరంగా నిర్ణయించుకోని కాలింగ్ బెల్ కొట్టాను.
***
గణ గణ మోగింది ఫోను. అలా ఎంతసేపు బాట్ టబ్బులో వున్నానో నాకు తెలియనే లేదు. చట్టుక్కున లేచి టవల్ చుట్టుకోని ఫోను ఎత్తాను. అవతల రిసెప్షనిష్ట్.
"సార్ మీకు ఎవరో ఫోన్ చేశారు..!! కనెక్ట్ చెయ్యమంటరా" అడిగిందామె.
"సరే ఇవ్వండి" అన్నాను. అది ఖచ్చితంగా ఉషే అని అనిపించింది. నా ఆలోచన తప్పు కాదు.
"ఏమైంది.. నన్ను కలవమన్నాను కదా"
"ఏం లేదు.. కొంచెం ఫ్రెష్ అయ్యి వద్దామని రూంకి వచ్చాను" అబద్దం చెప్పాను.
"ఏంటి సంగతి.. ఫ్రెష్‌గా వచ్చి ఏం చేద్దామని.." అంటుంటే ఆమె గొంతులోనే చిలిపితనం వినపడుతోంది.
"నువ్వేం మారలేదు ఉషా" అన్నాను నేను.
"అవును.. మారే వుద్దేశ్యాలు కూడా లేవు.. నాతో పాటు వస్తే నీకే తెలుస్తుంది.."
"ఎక్కడికి?"
"హవాయన్ షాక్స్.." అంటూ అడ్రస్ చెప్పింది.
నేను ఫోను పెట్టేసి బయలుదేరాను. అక్కడికి చేరుకునే సరికి ఆమె అక్కడే వుంది. చెయ్యి పట్టుకోని లోపలికి లాక్కెళ్ళింది. లోపల వాతావరణం అర్థమవ్వటానికి రెండు నిమిషాలు పట్టింది. అది ఒక పబ్.
"ఏం తీసుకుంటావు?"
"నువ్వు తాగుతావా?"
"ఏం నువ్వు తాగవా?"
"ఎప్పుడన్నా"
"ఇదే ఆ ఎప్పుడన్నా.. చెప్పు"
"విస్కీ విత్ షోడా.."
తను ఆర్డర్ ఇచ్చింది. తనకేమో లాంగ్ ఐలాండ్ చెప్పింది. తను మందు తాగుతుందని నేను వూహించనే లేదు.
చిన్న పడవ గోడలో నుంచి దూసుకొచ్చినట్లు వుంది ఆ కౌంటర్. మిగిలిన భాగమంతా తక్కువ కుర్చీలతో ఎక్కువ శాతం డాన్స్ వెయ్యడానికి వీలుగా వుంది. చాలా ఇరుకుగా వుంది.. అయినా చాలా మంది వున్నారక్కడ.. ఇంకా వస్తూనే వున్నారు. రంగు రంగుల లైట్లు దారి తప్పినట్లు ఎటంటే అటు తిరుగుతూ వున్నాయి.
నా గ్లాస్ నాకిచ్చి, తను కాక్‌టైల్ పట్టుకోని చిన్నగా డాన్స్ చెయ్యడం ప్రారంభించింది. నన్ను కూడా డాన్స్ చెయ్యమంది. "నా వల్ల కాద" న్నాను. అసలు ఒకరి మాటలు ఒకరికి వినపడకుండా మోతగా వున్న ఆ పాటలే నాకు రుచించట్లేదు. ఉష నన్ను పట్టుకోని గట్టిగా ముందుకు లాగింది. తుళ్ళిపడబోయి తమాయించుకున్నాను. నా చేతిలో విస్కీ ఆమె మీద కొద్దిగా వొలికింది. "ఫర్లేదు" అన్నట్టు నాలుక చిత్రంగా బయట పెట్టి నా నడుం మీద చెయ్యివేసిది. మరో చెయ్యి భుజం మీద పడింది. నేనూ డాన్స్ చెయ్యడం మొదలు పెట్టాను.
ఆ రోజు ఇలాగే ఇంతే దగ్గరగా.. పుస్తకం తీసుకోడనికి వెళ్ళి ఎంత సేపు వున్నానో నాకే గుర్తులేదు. అటకం మీద పుస్తకాలు దించేందుకు చిన్న స్టూల్ వేసుకోని ఎక్కింది. నేను స్టూల్ పట్టుకోని.. ఆమె చేతులు పైకెత్తి పుస్తకాలందుకుంటుంటే నేను అలాగే ఆమె "స్ట్రెచ్డ్" శరీరాన్నే చూస్తూ వుండిపోయాను. స్టూల్ ఎప్పుడు వదిలేశానో నాకే తెలియలేదు.
తను నా మీద పడింది. ఇద్దరం మంచం మీద పడ్డాం. అది ఆమె కావాలనే చేసిందా, లేక యాదృశ్చికంగానే జరిగిందా ఆలోచించే స్థితిలో లేను. ఆ దగ్గరతనం.. ఆ స్పర్శ మాధుర్యంలో ఎప్పుడు కరిగిపోయానో నాకే తెలియదు. కొద్దిగా ముదుకు వంగి ఆమె పెదవుల మీద…
***
"ఏయ్ ఏమైంది నీకు… ఎక్కడ ఆలోచిస్తున్నావ్? కమాన్ డాన్స్.. ఇదే ఆఖరు పాట" చెప్పిందామె. అప్పటికే ఆమె నాలుగు గ్లాసులు నేను నాలుగు గ్లాసులు తాగేశాము.
పబ్‌లో డాన్స్ అయిపోగానే తన ఇంటికి రమ్మన్నది ఉష.
"వద్దు ఉష.. బాగుండదు..." అన్నాను.
"ఏ కాలంలో వున్నావ్ రమణ.. ఇది ముంబై... నువ్వు రావటమేకాదు.. నాతో కాపురం చేసి నలుగుర్ని కన్నా కనీసం పక్కింటోళ్ళకి కూడా తెలియదు.." చెప్పిందామె.
ఇద్దరం ఆమె కార్లో బయలుదేరాము.
"ఉషా.. పెళ్ళి చేసుకున్నావా?"
"ఈ ప్రశ్న నాతో డాన్స్ చెయ్యక ముందు అడగాల్సిందేమో కదా.." అంటూ నవ్వేసి "అయ్యింది.. ఖంగారు పడకు ఆయన ఇంట్లో లేదులే. మేం విడిపోయాం." చెప్పింది. నేను ఆమె వైపు ఎంతసేపు చూశానో, ఎందుకు చూశానో కూడా గుర్తులేదు.
ఇంట్లోకి అడుగుపెట్టగానే సిగరెట్ వాసన గుప్పుమంది.
"కూర్చో.. ఫ్రెష్ అయ్యి వస్తాను.." అంటూ వెళ్ళబోయి మళ్ళీ ఆగి "ఫ్రిజ్‌పైన విస్కీ వుంది.. ఫ్రిజ్‌లో సోడా.. నాక్కూడా ఒకటి కలిపివుంచు" కన్నుగీటి వెళ్ళిపోయింది.
నేను లేచి ఫ్రిజ్ వైపు నడిచాను.
***
విస్కీ గ్లాసులో సోడా కలపగానే మధుర్ వెంటనే పైకెత్తాడు..
"చీర్స్.. చీర్స్" అరిచాడు వుత్సాహంగా
"ఇంతకీ పార్టీ ఎందుకో చెప్పనే లేదు.." అడిగాడు శేఖర్.
"ఇంకెందుకురా.. మనవాడు నిన్న వెళ్ళిన పని దిగ్విజయంగా పూర్తిచేశాడు." మధుర్ అన్నాడు. నాకేదో ఇబ్బందిగా వుంది.
"ఏరా నిజమేనా? మరి చెప్పనే లేదు? ఏంటి వర్క్ఔట్ అయ్యిందా"
"ఊ" అన్నాను నేను.
"దానికి సిగ్గెందుకోయ్.. బీ లైక్ ఏ మాన్.. ఇంతకీ ఎలాజరిగిందో చెప్పు"
"చెప్పేదేముంది.. వి డిడ్ ఇట్.."
"అదే రా ఎలా.. ఐ మీన్ ఎలా మొదలైంది.. ఎవరెవరు ఏం చేశారు"
"నోరు ముయ్యి.. అదంతా ఇక్కడా.. రూంకి వెళ్ళాక చెప్తా.. ఇందాకే మధుర్ గాడికి చెప్పాను.."
"అవునురా.. డీటైల్డ్‌గా చెప్పాడు.. నేను చెప్తాగా" అన్నాడు మధుర్ కన్నుగొడుతూ.
నేను ఆలోచిస్తూ వుండిపోయాను.
***
"ఏంటి ఎప్పుడూ ఏదోవొకటి ఆలోచిస్తుంటావు.." ఉష అడిగింది. తెల్లటి నైట్ డ్రస్ వేసుకోని వుందామె.
"ఏమిలేదు..” అన్నతరువాత చాలాసేపు మాట్లాడుకోలేదు. తర్వాత నేనే అడిగాను “ఎందుకు విడిపోయారు.." అని.
ఆమె సూటిగా చూసింది. "ఈ ప్రశ్న ఇంకెవరన్నా వేస్తే నీకెందుకు అనేదాన్ని.. నీతో అలా అనలేను.. వాడు నా గురించి పూర్తిగా తెలిసే పెళ్ళి చేసుకున్నాడు. నీకు తెలుసుగా నేను మాట్లాడే తీరు.. అవతలి వాడు ఏమనుకుంటాడో ఆలోచించకుండానే డబల్ మీనింగ్ డైలాగులు.. ఒక్కోసారి డైరెక్ట్ మీనింగ్ డైలాగులు.. మొదట్లో అతనికీ ఇలా వుండటం నచ్చింది కాని తరువాత తరువాత అతనితోనే అలా వుండమనే వాడు. మిగతా మొగవాళ్ళతో అలా మాట్లాడకూడదన్నాడు.. నేను అలా వుండలేనన్నాను.. అలా మా ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.. అంతే విడిపోయాము.." చెప్పింది. "అంతేనా...?” అడిగాను.
"అసలు బేసిక్ కారణం అదే.. కాకపోతే.. నాకు వేరే ఎవరితోనో సంబంధం వుందని అతనికి ఎవరో చెప్పారు.. జోక్ చెప్పనా ఆ సంబంధం ఎవరితోనో కాదు.. నీతోనే వుందట.. దట్ వాజ్ ద లాస్ట్ నైల్"
నేను అదిరి పడ్డాను. ఉషకి నాకు అఫైర్... నా వల్లే ఉష ఆమె భర్త విడిపోయారు...!
"హలో.. అంత ఆలోచించాల్సిన పనిలేదు.. ఆ మనిషే అంత... నువ్వు కాకపోతే ఏ పోస్ట్‌మానుకో, పాలవాడికో అంటగట్టేవాడు.. కాలేజిలో మనిద్దరి గురించి ఏం మాట్లాడుకునేవారో నీకు తెలుసుగా.. అదే ఎవరో వాడికి చెప్పారు, దాంతో వాడికి ఒక పేరు దొరికింది అంతే.. పోస్ట్మాకన్, పాలవాడికన్నా నువ్వే బెటర్ అని అక్కడే సంబంధం తెంచేసుకున్నాను.. నువ్వేం దిగాలుగా ముఖం పెట్టాల్సిన పనిలేదు." అన్నదామె మరో పెగ్గు కలుపుకుంటూ.
ఆ తరువాత ఇద్దరం ఏమి మాట్లాడలేదు.
***
ఆమె ఏమి మాట్లాడలేదు.
మంచం మీద అలాగే వున్నాం.. నేను కొంచెం దగ్గరగా జరిగి ఆమె పెదవులమీదకు వంగాను. ఆమె చట్టుకున తేరుకోని గట్టిగా నన్ను తోసేసింది. లేచి మంచం దిగి -
"ఫర్లేదే.. మంచి స్పీడు మీదే వున్నావు.." అంది.
జరిగిన దానికి నేను తత్తరపడ్డాను. "అయితే నీ కవ్వింపులు దీనికోసం కాదా" అని అడగబోయాను. కాదని తెలుస్తూనే వుంటే ఇంకా అడగటం ఎందుకని తల దించుకోని "అయాం సారీ" అన్నాను.
ఆమె గట్టిగా నవ్వి - "దట్స్ ఓకే.. ఫర్లేదు.. నన్ను చూసిన ప్రతివాళ్ళు ఇలాగే అనుకుంటారు. నేను ఓపెన్‌గా మాట్లాడటం వల్లే అందరూ అలా అనుకుంటారు అనుకుంటా.. అయినా నేను ఇంతే..నా నేచరే అంత.. నిన్ను చూస్తే ఎందుకో నా గురించి అలా అనుకోవట్లేదు అనిపించింది.. అందుకే ఇంకొంచెం చొరవగా వున్నాను.. ఇంకెప్పుడూ నా గురించి ఇలా ఆలోచించకు.. లెట్స్ బీ గుడ్ ఫ్రెండ్స్.." చెప్పిందామె.
నేను తలవూపాను.
***
"ఏమిటి మళ్ళీ ఆలోచిస్తున్నావు?" అడిగింది ఉష.
"అదే మన గురించి అలా ఎవరు చెప్పారో అని.." అన్నాను.
"ఎవరో మా ఆయన కొలీగ్... మన క్యాంపస్ లోనే చదివాడట.. ఎవరో మథురో మాథురో..”
నాకు వూహించని షాక్..!!
అప్పుడేదో యవ్వనోత్సాహంలో జరగనిది జరిగినట్లు నా ఫ్రెండ్స్ దగ్గర కోతలు కోసాను..!! దాని పర్యవసానం ఇంత దారుణంగా వుంటుందా? నాకెందుకో గిల్టీ ఫీలింగ్ ఎక్కువౌతూ వుంది.
"హలో మాష్టారు.. అది గెస్ట్ బెడ్‌రూం.. వెళ్ళి అక్కడ పడుకోని తీరిగ్గా ఆలోచించుకోండి.." చెప్పిందామె.
నాకెందుకో ఆమెకి జరిగింది చెప్పి క్షమించమని అడగాలని వుంది. కాని మనసుకు మాటకు మధ్య ఏదో అడ్డం పడుతోంది. నేను లేచి ఆ బెడ్‌రూం వైపు అడుగులువేశాను.
ఉషకి ఆ విషయం ఇప్పటికీ చెప్పలేదు..!!

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)