మీరు ఏటీ్‌యం లైన్లో నిలబడ్డప్పుడు
మీచూపు నన్ను విసుగుగా పలకరిస్తుంది
మీ చీదరింపు నా పెదాలపై బలవంతంపు చిరునవ్వై పులుముకుంటుంది
క్రెడిట్ కార్ద్ కావాలా సార్ అని అడగడానికి
వెనకముందాడే నా మొహమాటం
మీ తిరస్కారం వరదలో కొట్టుకుపోతుంది
వచ్చీరాని ఇంగ్లీషులో నాలుగు ముక్కలు పలకగానే
మీ ఆర్ధిక సంక్షోభాలన్నింటి నేనే కారణమై కనిపిస్తాను
'మీ బాంకు చార్జీలన్నీ మోసం ' అంటూ నన్నోక దోపిడీ దొంగను చేస్తారు
గ్లోబలైజేషన్‌కి కాంపిటీషన్‌కి పుట్టిన చిన్న వుద్యోగాన్ని నేను
మీ బాంకు చార్జీలకి కారణం ఎలాగౌతాను
ఈ మాట మీతో చెప్పేలోపే లైన్లో మీ వంతొస్తుంది
డబ్బులు లెక్కపెట్టుకుంటూ నన్నో అంటరానివాణ్ణిలా చూస్తూ వెళ్ళిపోతారు
మీ శాపాలు తగిలి నా వుద్యోగం పోయినా ఫర్లేదు
మరోరోజు ఆక్స్‌ఫోర్డ్ డిక్ష్నరీ పట్టుకొని మళ్ళీ కనిపిస్తాను
(26 సెప్టెంబరు)
---
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
9 వ్యాఖ్య(లు):
superb. Even i used to be very insensitive towards these people.
But one day my friend made me realize what they go through. After that i started thinking sensibly about them. Good Post.
very good one
Excellent Sir. They literally stand atleast 12 hrs a day just for one or two applications . I hate people who treat them in the most insensible manner. Most of them take up these jobs for their college or course fees or to support their families.
వ్యాఖ్యాతలకు నెనర్లు
అరిపిరాల
ఆహా! :(
malli form loki vacchavu... gud one
హమ్మ్..
తెలుగు లో ఏమంటారో తెలియదు కానీ ఇంగ్లీష్ లో "other side of the coin" ని చూపించారు. వాళ్ళూ మామూలు మనుషులే వాళ్ళకీ ఎన్నో బాధలుంటాయి అని చక్కగా చెప్పారు.
excellent
కామెంట్‌ను పోస్ట్ చేయండి