నాడీ జ్యోతిషం - అసలు రహస్యం (2)

(ఇది వ్యాసంలో రెండో భాగం
చివరి భాగం చదవాలంటే ఇక్కడ నొక్కండి

మొదటి భాగం చదవాలంటే ఇక్కడ నొక్కండి)

మరో రెండు నెలలు గడిచాయి. ఈ సారి గుంటూరులో వాళ్ళ బ్రాంచి వచ్చిందని పేపర్లో చదివాను. మళ్ళీ నా తెహల్కా మొదలైంది. ఈసారి మరీ అనుమానంతో కాకుండా కొంచెం నమ్మేవాడిలా ప్రవర్తించాలని అనుకున్నాను. మళ్ళీ అదే రకమైన గది, మళ్ళీ అదే కాషాయం, తాళపత్రం, అదే వుపోద్ఘాతం. ఆ తరువాత తమిళంలో పద్యాలు, తెలుగు తర్జుమా ప్రశ్నలు.
"మీ పేరు ర, క, మ తో ప్రారభమౌతుందా?"
"లేదు"
"అయితే ఈ పేజిలో లేదు.
"అంటే"
"ఇది మరెవరిదో. ఒక్కొక్క పత్రంలో ఒక్కొక్కరి జాతకం వుంటుంది.
"సరే అడగండి"
"మీ వయసు 21-25 మధ్యలో వుందా"
"అవును"
"మీ సొంతవూరు గుంటూరు"
"సొంత వూరంటే పుట్టిన వూరా? పెరిగిన వూరా?"
"ఎక్కువ కాలం గడిపిన వూరు"
"గుంటూరే.. పుట్టింది మాత్రం నెల్లూరు"
"గుంటూరే వుంది.. మీ నక్షత్రం ప, మ, ఆ లతో మొదలౌతుందా"
"లేదు"
"మీరు పుట్టిన నెల జనవరి నుంచి జూన్‌లో వుందా?"
"వుంది"
"మీకు చిన్నప్పుడు చిన్న అగ్ని ప్రమాదం జరిగిందా?"
"చిన్నప్పుడంటే ఆరో ఏట దీపావళికి టపాసు కాలుస్తుంటే చేతిలో పేలింది"
"మీరు పుట్టిన తేది సరి సంఖ్యా"
"అవును"
"మీరు ప్రైవేటు అంటే బ్యాంకులు, సాఫ్ట్వేర్ వుద్యోగం చేస్తున్నారా?"
"లేదు"
"మీరు గవర్న్మెంటు వుద్యోగం చేస్తున్నారా"
"అవును"
"మీరు పుట్టిన నెల వైశాఖం, జేష్టం ఆషాఢంలో వుందా?"
"అవును"
"మీరు పుట్టిన సంవత్సరం 1978"
"అవును"
"మీకు లవ్ ఫైల్యూర్ ఎమైనా వుందా"
"లేదు"
మధ్యలో మరో తాళపత్రం తెచ్చాడు.
"మీకొక సోదరుడు"
"లేదు"
"మీరు పుట్టిన నెల జూన్"
"అవును"
"మీకొక చెల్లెలు"
"అవును"
"మీరు పుట్టిన తేది 4, 6, 8 లలో దెనితోనైనా ముగుస్తుందా?"
"లేదు"
"మీకు ఈ మధ్య ఏదైనా ఆక్సిడెంట్ అయ్యిందా"
"లేదు"
"మీరు పుట్టిన తేది 2"
"అవును"
"మీరు చేసే వుద్యోగం పోస్టాఫీసులో.."
"లేదు"
"రైల్వేలో?"
"అవును"
"మీ పేరు చివర్లో శర్మ, శాస్త్రి, రెడ్డి, నాయుడు, లాంటిది వుంది"
"లేదు"

(ఇంకా ఇలాంటి ప్రశ్నలు చాలా అడిగాడు. అందులో ముఖ్యమైనవి మాత్రం ఇక్కడ చెప్పాను.) అతను ఇక్కడ ఆపి -

"మీ జాతకం దొరికేట్టే వుంది. వుండండి మరొకటి తెస్తాను" అంటూ లోపలికి వెళ్ళాడు. నేను ఒక్కసారి ప్రశ్నలన్నీ తిరిగి గుర్తు తెచ్చుకున్నాను. ఎక్కడో ఏదో లింకు దొరుకుతోంది...!! తళుక్కున మెరిసింది..!!


"ఇప్పుడు అతను తిరిగి రాగానే అడగబోయే ప్రశ్న - "మీ నక్షత్రం ఆశ్వని అవునా కాదా?". అలా అడిగాడంటే నా వూహ సరైనదే" అనుకున్నాను. అతను వచ్చాడు. నాకు నా గుండె కొట్టుకోవటం స్పష్టంగా తెలుస్తోంది. అతను కూర్చొని నవ్వి అడిగాడు -

"మీ నక్షత్రం అశ్వని. అవునా కాదా?"
(ఇదెలా జరిగింది.. ఎవరికైనా అర్థమైతే చెప్పండి. ఒకసారి ప్రశ్నలను మళ్ళీ చూడండి. అప్పటికీ సమాధానం దొరకకపోతే తరువాత టపాదాకా ఆగాల్సిందే.)
చివరి భాగం చదవాలంటే ఇక్కడ నొక్కండి
మొదటి భాగం చదవాలంటే ఇక్కడ నొక్కండి

7 వ్యాఖ్య(లు):

నేస్తం చెప్పారు...

మీరు మరీ అన్యాయమండి ఇంత సస్పెన్సా:(

pruthviraj చెప్పారు...

పుట్టిన తేది, నెల, సంవత్సరమ్ సరైనవి గా తెలిసింది కదా ఆమాత్రం చాలుగా నక్షత్రం, వగైరా చెప్పడానికి..కాబట్టి గెస్ చేసివుంటాడు ఎందుకంటే జాతకాని మొదటిలెక్క నక్షత్రం నుండే కదా మొదలవుతుంది ఇలా కనిపెట్టినట్టు మొదలెట్టి మొత్తం చిట్టా ఇప్పడానికి ఆ కషాయవస్త్రదారుడు ప్రయత్నించవచ్చని నాకు తెలిసింది., మరి మేరెమంటారు..:D

మొత్తానికి చదివింఛేస్తున్నారు సస్పెన్స్ తో..

చైతన్య.ఎస్ చెప్పారు...

పృథ్వీరాజు గారి మాటే నాది... త్వరగా 3వ భాగం కోసం ఎదురుచూస్తూ

అజ్ఞాత చెప్పారు...

మీ పరిశోధన చాలా బాగుంది.

నేనిదివరకు ఒక ప్రసిద్ధుడైన నాడీజ్యోతిష్కుడి దగ్గర కొన్నాళ్ళు శిష్యరికం చేశాను. ఆ అనుభవాలు ఇవిగో:
http://www.eemaata.com/em/issues/200803/1212.html

Young Buzzer చెప్పారు...

అచ్చం నాకూ ఇలానే జరిగింది...:)
అక్కడే scene అంతా అర్థమైపోయింది...

krishna rao jallipalli చెప్పారు...

ఇంతకీ వాడు మీ దగ్గిర ఎంత నొక్కాడు??

Unknown చెప్పారు...

so simple 1978 was true in that year even date is true,and u said ok for birthstars,so by those he go search calender and get ur date of birth.thaanx i got them now