ఆ మధ్య ఒక వూరెళ్ళాను.. భోపాల్‌కి దగ్గర్లో వున్న సీహోర్ అనే వూరి నించి దాదాపు ముప్పై కిలోమీటర్లు లోపలికి వున్న చిన్న పల్లెటూరు. ఉత్తర భారతంలో బాగా ప్రసిద్ధికెక్కిన సీహోరి/సుజాత అనే రకం గోధుమలు ఇక్కడ పండుతాయి. అలాగే నీటి కరువులేదు కాబట్టి చెరకు కూడా బాగా పండుతుంది. ఇంతకీ మేమెళ్ళింది ఆ పల్లెటూరు సర్పంచి చెరకు తోటకే.
ఫార్మ్ హౌస్ చేరుకున్నా ఆయన జాడలేకపోవటంతో మిత్రుడొకరు అక్కడే వున్న చిన్న గుట్ట ఎక్కి ఆయనకి ఫోన్ చేశాడు. అదేమిటంటే - "ఆ గుట్టమీద తప్ప ఇంకెక్కడా నెట్వర్క్ రాదు" అన్నాడు. ఇదేదో విక్రమార్క సింహాసనం లాగుందే అనుకున్నాను నేను.
ఆయన వచ్చేలోగ అక్కడ చెరకురసంతో బెల్లం తయారు చేసే బట్టీల దగ్గరికి వెళ్ళాను.
సర్పంచిగారు వస్తూనే ఒక స్టీలు బక్కెట్ పట్టుకోని దాని నిండా చెరకు రసం పట్టుకొచ్చాడు. వెనక తోటలోకి వెళ్ళి నాలుగు నిమ్మకాయలు కోసుకొచ్చి అందులో పిండాడు. తలా ఒక గ్లాసు తీసుకున్నాం. ఇలా చెట్టు నీడన నులకమంచం మీద కూర్చొని అందమైన ప్రకృతి మధ్యలో స్వచ్చమైన చెరకు రసం.. మన పట్టణాలలో ఐసు వేసి ఇస్తే మాత్రం దీనికి సాటిరాగలదా..!
ఇలా అనుకుంటున్నామో లేదో గ్లాసు మళ్ళీ నిండిపోయింది. మరో అయిదు నిముషాలలో మూడు గ్లాసులు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఇంతలో సర్పంచిగారి అబ్బాయి ఎదురుగా వున్న పొలంలోకి వెళ్ళి శనగ మొక్కలు పీకి తీసుకొచ్చాడు. కాబూలి చెనా, దేశీ చనా అంటూ శనగ గుత్తులు చేతిలో పెడుతూ తినిపించారు.
ఆ తరువాత అవే శనగలు వేయించి అప్పుడే తయారైన బెల్లంతో.. తర్వాత మరో గ్లాసు చరకు రసం..!!
"సార్ ఇంకొక అరగంట వున్నారంటే దాల్ బాఫ్లే తో భోజనం సిద్ధం చేస్తా"నన్నాడు.."
వెళ్ళిన ముగ్గురం పొట్టలు పట్టుకొని, దణ్ణం పెట్టి "మళ్ళీ వస్తాం" అని చెప్పి తిరుగు ప్రయాణమయ్యాం. మళ్ళీ వచ్చే వారం వెళ్ళే ఆలోచన చేస్తున్నాం.. ఎవరైనా మతో వద్దామనుకుంటున్నారా?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
4 వ్యాఖ్య(లు):
Nice way of narrating it .. I wish I could join you
CHALA
చాలా బావుంది.
శ్రీపాద ఆత్మకథలో కోనసీమ పొలాల్లో చెరుకు పానకం పుచ్చుకోవడం, అప్పూడే తయారై వచ్చిన వేడి వేడి వెండితీగల బెల్లంతో లేత కొబ్బరి ముక్కలు తినడం రాస్తారు. ఆ సీను గుర్తు చేశారు.
ok
కామెంట్‌ను పోస్ట్ చేయండి