రాజధాని నగరంలో... మెట్రో అందాలతో


ఇందు మూలముగా యావన్మంది బ్లాగరు మహాశయులకు తెలియజేయునది ఏమనగా.. ఒక చిన్న విరామము తరువాత నా బ్లాగుల ప్రస్థానాన్ని రాజధాని నగరం డిల్లీ నుంచి పునఃప్రారంభిస్తున్నానహో..!!

డిల్లీ నగరం గురించిన విశేషాలు.. ఇంకా నేను చూసి వచ్చిన కొత్త ప్రదేశాల సంగతులు... ఈ విరామంలో రాసి పెట్టుకున్న కొన్ని కథలు అన్నీ ఒక్కొక్కటే వినిపిస్తాను.. అందాకా డిల్లీ మెట్రో రైలు అందాలను చూడండి...!!
6 వ్యాఖ్య(లు):

కత్తి మహేష్ కుమార్ చెప్పారు...

ఫోటోలు చాలా బాగున్నాయి. అవూనూ...హైదరాబాద్ వస్తున్నానన్నారు! ఏమయ్యింది?

Sujata చెప్పారు...

భలే వారే ! మెట్రో లో ఫుటువా ఖీచ్ నా మనా హై! ఒక సారి పెళ్ళయిన కొత్త లో మేము తీసుకుంటే, సెక్యూరిటీ గార్డు మా ఆయన వెనకాల పడ్డాడు. కేమెరా అన్నా ఇవ్వు లేదా రూ.500/- జరిమానా అన్నా అని. కొత్త పెళ్ళి కొడుకు, మా ఫోటోలు మాత్రం డిలీట్ చేసి, వాడికో దణ్ణం పెట్టి తప్పించుకున్నాడు. మర్చిపోలేని పిచ్చి అనుభవం అది. ఆ తరవాత మాకు చాలా కోపం వచ్చింది. ఇదేమి పిచ్చి రూలు ? అనుకున్నం.

హరే కృష్ణ . చెప్పారు...

సెంట్రల్ Secretariat yellow line నుండి రాజీవ్ చౌక్ blue line ki వెళ్లి అక్కడ ఫొటోస్ తీస్తే ఇంకా బావుండేది ,మీరు పెట్టింది ద్వారకా స్టేషన్ మెట్రో ఫోటోకదా

నాగప్రసాద్ చెప్పారు...

ఫోటోలు బాగున్నాయి. పునఃస్వాగతం.

ఉండేది ఒకరోజే అయినా, ఢిల్లీ నాకు చాలా బాగా నచ్చింది. ఇండియా గేటు వద్ద రాత్రి ఒంటిగంట దాకా గడిపిన అనుభవం నా జీవితంలో మర్చిపోలేనిది.

సత్యప్రసాద్ అరిపిరాల చెప్పారు...

మహేష్‌గారు,
హైదరాబాదు పర్యటన అనివార్య కారణాల వల్ల రద్దైంది... మళ్ళీ ఆగష్టులో రావాలని అనుకుంటున్నా.. వస్తే తప్పక కలుద్దాం.

సుజాతగారు,
ఏదో మొబైల్లో చాటుగా లాగించా.. అయినా మీరు చెప్పినంత స్ట్రిక్టుగా లేనట్టుంది ఇప్పుడు..!!

హరే కృష్ణగారు,
మీరు చెప్పింది నిజమే. రాజీవ్ చౌక్ స్టేషన్ చాలా బాగుంది. నిన్ననే పాలికా బజార్‌కు వెళ్ళా. కాని అక్కడ ఫొటో తీయకపోవడానికి కారణం తెలియాలంటే పైన సుజాతగారి వ్యాఖ్య చదవగలరు. నేను తీసింది ద్వారక అని భలే కనిపెట్టేశారే..!!

నాగప్రసాద్‌గారు,
నెనర్లు

హరే కృష్ణ . చెప్పారు...

క్షమించాలి..మొబైల్ లో ఫ్లాష్ ఆఫ్ చేసి తీస్తే ఏమి కాదు రాజీవ్ చౌక్ లో ..మెసేజ్ చదువుతున్నట్టు వేరే ఏదో గేమ్ ఆడుతున్నట్టు..పాలికా బజార్ కి శనివారం సాయంత్రం వెళ్ళండి వీలైతే atmosphere చాలా బావుంటుంది ప్రోగ్రామ్స్ etc..మరో పోస్ట్ కూడారాసేయొచ్చు