కౌముదిలో నా కథ

ఈ మాసం కౌముదిలో నా కథ "వానరవీరుడు" ప్రచురితమైనది. చదివి మీ అభిప్రాయం చెప్పండి.

http://koumudi.net/Monthly/2009/september/index.html
Category:

8 వ్యాఖ్య(లు):

కొత్త పాళీ చెప్పారు...

చాలా బాగా .. కాదు కాదు అద్భుతంగా రాశారు. ఒక కథాపాఠకుడిగా చూస్తే ముగింపు కొంచెం నిరాశ పరిచింది. రామాయణ కథాపరంగా చూస్తే, రామ విజయ వార్తని అశోక వనానికి తెచ్చినవాడు లక్ష్మణుడు, హనుమంతుడు కాదు. అయినా అది పెద్ద సమస్య కాదు, కథని పునరుద్ఘాటించేవారు తగిన మార్పులు చేసుకోవచ్చు. నా విన్నపం అల్లా ఒక్కటే .. ఈ కథని గనక సంస్కరించ దలిస్తే కేతకి ప్రేమకి ఒక సార్ధకత చేకూర్చండి ముగింపులో .. ప్రస్తుత ముగింపు అర్ధాంతరంగా ఉంది.

veerendra చెప్పారు...

MI blog templette chala bagundi ituvanti templetes ekkada nundi download chesukovachu cheppagalaru

కామేశ్వరరావు చెప్పారు...

సత్యప్రసాద్ గారు,

కథ చాలా బాగుందండి. కొత్తపాళీగారన్నట్టు చివర హఠాత్తుగా కేతకి ప్రేమ అలా మిగిలిపోవడం అసంతృప్తిగానే ఉంది కాని అంతకన్నా చెయ్యగలిగింది లేదు! ముగింపు అదే అయినా, చివరలో కథనంలో మరికొంత తేడా చూపిస్తే బాగుండేదేమో.
కొత్తపాళీగారు, సీతకి విజయవార్త తీసుకువెళ్ళినది హనుమంతుడేనండీ లక్ష్మణుడు కాదు.

కోడీహళ్లి మురళీమోహన్ చెప్పారు...

ఎట్టకేలకు మీ కథ చదువ గలిగాను.ఆలస్యానికి మన్నించండి. కథ అత్యద్భుతంగా ఉంది. పౌరాణిక నేపథ్యం గల కథలు మరిన్ని మీనుండి ఆశిస్తున్నాను.

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

సత్యప్రసాద్ గారూ, మీరు చైనీస్ లో కామెంటితే కష్టం సుమా :)

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

అది జపనీస్ అని ఇప్పుడే తెలిసింది

Unknown చెప్పారు...

భాస్కర రామిరెడ్డిగారు, రజనీకాంత్‌కి వున్నట్టే నాక్కూడా జపాన్‌లో అభిమానులున్నారని మీకు అసూయ కదూ... (తొలగించాను)

Praveen Mandangi చెప్పారు...

అవెక్కడ జపనీస్ కామెంట్లు? అవి స్పామయితేనూ.