నా కథల గురించి ప్రముఖ రచయితలు “వసుంధర” గారి విశ్లేషణ (రచన జూన్ 2011 సంచికలో ప్రచురితం.)
అరిపిరాల సత్యప్రసాద్ రచన ఊహాచిత్రం ఓ చిత్రకారుడి మరణానికి వినూత్న కథనం. ఆంధ్రజ్యోతి ఆదివారం (మార్చి 27)లో వచ్చిన ఈ కథ చైతన్యస్రవంతి కథనాన్ని ఇంత ఆసక్తికరం చెయ్యగలదా అనిపింపజేస్తుంది. ఇదే రచయిత స్వప్న (మే 2011) లో వ్రాసిన వాడూ – మసాలా దోశ సింగిల్ పేజీ కథకి ఇతివృత్తం బాల కార్మికుడు. సామాజిక స్పృహని ఒక్క పేజీలో ఇమిడ్చి కొసమెరుపుతో హృద్యం చేయగల ప్రతిభకీ రచనకి మచ్చుగా తీసుకోవచ్చు.
సంపుటి వెబ్ పత్రిక నిర్వహించిన కథల పోటీలలో బహుమతి పొందిన కథ అలిగితివా సఖీ ప్రియా విశ్లేషణ కట్నం లేకుండా నా చెల్లెలికి పెళ్ళి కుదిరింది. నా భార్య ప్రియ సహకారంతో ఆ పెళ్ళి ఘనంగా చేశాను. కానీ నా భార్య అలిగింది. కారణం నా పెళ్ళికి రెండు లక్షలు కట్నం తీసుకున్నా. అది నా చెల్లెలి పెళ్ళి కట్నానికని అమ్మ అప్పట్లో నా మామగారికి సంజాయిషీ ఇచ్చింది. మరిప్పుడు నా చెల్లి పెళ్ళికి కట్నం లేదు కాబట్టి – మామగారికి ఆ బాకీ తీరాల్సి ఉంది. నేనా మాటే అనుకోవడం లేదని తన అలక విశ్లేషణ: కట్నం తీసుకుందుకు సంజాయిషీలివ్వడం ఆధునికులకి రివాజు. వాటిలో చిత్తశుద్ధిని వ్యంగ్యాత్మకంగా చెప్పిన ఈ కథలో సందేశం అంతర్లీనం, కథనం అద్భుతం. ఈ కథకు మూడొవ బహుమతినిచ్చిన నిర్వాహకులకూ, అందుకున్న రచయితకీ అభినందనలు.
1 వ్యాఖ్య(లు):
సాక్షి లో చూశాను. బాగుంది.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి