అప్పుడెప్పుడో
మెరిసిన ఆ ఒక్క చిరునవ్వు
ఇన్ని సంవత్సరాల
అనుబంధానికి నాంది అవుతుందనుకోలేదు
నిన్న మొన్నలా
అనిపించే ఇన్నేళ్ళ అనుబంధం
ఒక్క పరిచయం
పునాదిపై నిలుస్తుందనుకోలేదు
గంటలు నిముషాల్లా
గడిచిపోయిన ఆ చిన్న పరిచయం
మన జీవితాన్ని
ప్రేమతో పెనవేస్తుందనుకోలేదు
ఇలాంటి ప్రేమ
ఒకటి నాకోసంఎదురుచూస్తూ వుందని తెలిసుంటే
కొన్ని యుగాల
ముందే నిన్ను పలకరించేవాణ్ణి కదా..!!
3 వ్యాఖ్య(లు):
awesome.
Chaity
wah waa....
సముద్రం దగ్గర కూడా కొంగలు ఉంటాయా?
కామెంట్‌ను పోస్ట్ చేయండి