ప్రియమైన జార్జ్,
ఈ మధ్యకాలంలో పేపర్ తెరిస్తే తరచుగా ఆత్మహత్యలకి సంబంధించివ వార్తలు
కనపడుతున్నాయి. ఇదుగో ఇలా -
"గత బుధవారం రాత్రి ఫలానా ప్రాంతంలో వెంటవెంటనే వినపడ్డ తుపాకి చప్పుళ్ళకి ప్రజలు అదిరిపడ్డారు. ఫలానా వ్యక్తి వుండే ఫలానా ఫలానా అపార్ట్మెంట్ నుంచి ఈ శబ్దాలు వినిపించాయి. తలుపులు పగలగొట్టి చూస్తే రక్తపు మడుగులో
అతను పడివున్నాడు. అతని చేతిలో అతని ప్రాణం తీసిన రివాల్వర్ ఇంకా అలాగే వుంది. మృతుడికి యాభై ఏడేళ్ళు వుండచ్చు. చేతి నిండా సంపాదన, సుఖసంతోషాలకి కావాల్సినవన్నీ వున్నా అతను ఇంతటి దారుణానికి ఎందుకు సిద్ధపడ్డాడో తెలియరాలేదు"

అన్నీ వుండి సంతోషంగా వుండాల్సిన వ్యక్తి ఇంతటి దారుణం చేసుకున్నాడంటే ఆ చర్య వెనుక ఎంత విషాదం వుందో కదా? మనకి తెలియని ఏ సమస్యో, గుర్తించలేని ఏ గాయమో అతణ్ణి ఆ ఆ పనికి ప్రేరేపించి వుండచ్చు కదా? మనం కారణాలు వెతుకుతాం.
ప్రేమరాహిత్యమేమో అనుకుంటాం. ఆర్థిక సమస్యలేమో అని అనుమానిస్తాం. ఏ సమాధనం దొరకక చివరికా ఆ ఆత్మహత్యని మిస్టరీగా కొట్టిపడేస్తాం.
ఇలాగే కారణాలు గుర్తించలేని ఒక ఆత్మహత్య కేసులొ అతను రాసుకున్న ఆఖరి వుత్తరం మా చేతికి దొరికింది. బహుశా తనని తాను చంపుకునే రాత్రి, రివాల్వర్ లోడ్ చేసుకుంటూ అతను ఈ ఉత్తరం రాసి వుంటాడు. ఆ వుత్తరాన్నిక్షుణ్ణంగా పరిశీలించాలనిపించింది. మనం వూహించే భయంకరమైన కష్టాలు ఏవీ అతని చావు కారణం కాదని తెలిసింది. కేవలం క్రమక్రమంగా పెరుగుతూ పోయిన చిన్న చిన్న అసంతృప్తులు, శిధిలాలుగా మిగిలిపోయిన ఒంటరి రాత్రులు, అదృశ్యమైపోయిన కలలు ఇవీ అలాంటి చావులకు కారణాలు. మానసికంగా ఎంతో ఎదిగి, కొద్దొ గొప్పో భావుకత వుంటే తప్ప అర్థం కాని కారణాలు అవి. ఇదిగో ఆ వుత్తరం ఇలా సాగింది:
“అర్థరాత్రి అయ్యింది. ఈ ఉత్తరం పూర్తిచేసి నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను. ఎందుకు? చెప్తాను. ఆ కారణాలన్నీ చెప్తాను. నేను చచ్చిపోయిన తరువాత చదవబొయే వారి కోసం కాదు. బతికుండగా నాకు నేను చెప్పుకోవడం కోసం. నాలో నేనే ధైర్యాన్ని నింపుకోవడం కోసం. ఎంత సర్ది చెప్పుకున్నా చావక తప్పని ప్రాణాంతకమైన కారణాల్ని మననం చేసుకోవడం కొసం.
నేను పుట్టింది చాలా సామాన్యమైన కుటుంబంలో. దేవుణ్ణి నమ్మిన నా తల్లిదండ్రులు నేను ఏది కావాలన్నా కాదనకుండా పెంచారు. వారి పెంపకంలొ నేనూ దైవాన్ని నమ్మాను. అందమైన ఆ కల చాలా కాలం సాగింది. కళ్ళ ముందు మంచు తెరలా వున్న ఆ రోజులు క్రమంగా కరిగిపోయాయి.

గత కొన్ని సంవత్సరాలుగా నాలో ఏవో తెలియని మార్పులు సంభవించాయి. అందమైన సాయంత్రాలవంటి సంఘటనలన్నీ నా జీవితపు చీకటిలోకి జారిపోయాయి. ఎన్నో సంఘటనల నిజమైన అర్థాలు కటినమైన వాస్తవాలుగా గోచరించడం మొదలైంది. ప్రేమ కోరుకునే మనసు నాలో ఒక ఏహ్యభావాన్ని పెంచింది. అర్థంలేని అందమైన ఎండమావుల వెనక పరుగెత్తే ఆటబొమ్మలం మనం అనిపించింది. ఆ ఎండమావులు ఎప్పటికప్పుడు కొత్త రూపంలో వూరిస్తూనే వుంటాయి.
కాలం గడిచేకొద్ది అంతుతెలియని జీవితపు బాధలతో రాజీపడటం అలవాటు చేసుకున్నాను. ఫలితం దక్కని ప్రయత్నాలు వ్యర్థమని నిర్థారించుకున్నాను. కానీ, మళ్ళీ ఈ రోజు రాత్రి నా చుట్టూ వున్న శూన్యం మళ్ళీ ఒక్కసారిగా నాపైన విరుచుకుపడింది.
చూడటానికి నేను సంతోషంగానే కనిపిస్తాను. నా చుట్టూ వున్నవన్నీ నాకు సంతోషాన్ని ఇస్తున్నట్లే కనిపిస్తాయి. నేను వుండే చోటు, నాకు నిత్యం కనిపించే వీధులు, వచ్చీపొయ్యే అమ్మాయిలూ.. అంతా బాగున్నట్లే అనిపిస్తుంటుంది. నా బట్టలు వస్త్రధారణ విషయంలో కూడా నేను ఈ మధ్య ఉత్సాహాన్ని చూపిస్తూ వున్నాను. కానీ రోజూ చూసిన వాటినే మళ్ళీ మళ్ళీ చూడాల్సిరావాటం ఎంత విసుగు కలిగిస్తుందో చెప్పలేను. నా గుండెల్లో ఒకరకమైన విరక్తిని, అసహ్యాన్ని నింపేసేట్టుగా వుంటాయవి. ఒకే నాటకాన్ని ప్రతిరాత్రీ చూస్తే కలిగే విసుగులాంటిదది.
గత ముప్ఫై సంవత్సరాలుగా ఒకే సమయానికి లేస్తున్నాను. ముప్ఫై ఏళ్ళుగా అదే హోటల్కి వెళ్తున్నాను. అదే తిండి తింటున్నాను. అప్పుడప్పుడు మారే వెయిటర్లు తప్ప ఇంకే మార్పూ లేదు.

ఎక్కడైనా వెళ్ళి కాస్త తిరిగి వస్తే ఏమన్నా ఉపయోగం వుంటుందేమోనని ప్రయత్నించాను. కొత్తచోట కలిగే వొంటరితనం ఇంకా భయంకరమైనది. ఈ భూప్రపంచంలో ఒంటరిగా గుర్తు తెలియని ఒక చిన్న ప్రాణిలా వుండటం ఇష్టం లేక తిరుగు ప్రయాణం
చేసేవాణ్ణి.
మళ్ళీ ఇక్కడే.. ఏమాత్రం మార్పూలేని కుర్చీలు, సోఫాలు.. అలాగే కదలకుండా ముప్ఫై ఏళ్ళుగా పడివున్న చోటే వున్నాయి. ఈ గదిలో వచ్చే వాసన (అవును ప్రతి ఇంటికి ఒక ప్రత్యేకమైన వాసన వుంటుంది) అది కూడా మారలేదు. ఇలాంటివన్నీ కలిసి చివరకి నాకు బతకటం దండగ అనే అభిప్రాయాన్ని కలిగిస్తుంటాయి.
జరిగినవే మళ్ళీ మళ్ళీ జరుగుతుంటుంటాయి.. అనంతంగా.!! నేను తాళం తీసేటప్పుడు తాళంచెవి పెట్టే విధానం, నేను అగ్గిపెట్టి పెట్టే స్థలం, ఇంట్లోకి అడుగుపెట్టగానే మొదట కనిపించే వస్తువు... ఇవన్నీ అలాగే మళ్ళీ మళ్ళీ జరుగుతుంటాయి. ఏ మాత్రం మార్పులేని ఈ సంగతులన్నీ నాకు చికాకు పుట్టిస్తాయి. అమాంతంగా వెళ్ళి కిటికీలోనుంచి దూకేసి వీటన్నింటికి ముగింపు పలకాలన్నంత కసి పుడుతుంది.
గడ్డం చేసుకున్న ప్రతిసారీ, అదే కత్తితో గొంతు కోసేసుకోవాలన్న కోరికని బలవంతంగా ఆపుకుంటాను. ఏ చేస్తాను? ఆ చిన్న అద్దంలో సబ్బు నురగ పూసుకున్న నా ముఖం ఎప్పుడూ అలాగే కనిపిస్తుంటుంది. అదే ముఖం మళ్ళీ మళ్ళీ కనపడి నాలో బాధని పెంచుతుంటుంది.
ఈ మధ్య మరీ దారుణం. నేను ఎవరితో కలిస్తే సంతోషంగా వుండేవాడినో వాళ్ళని కలవడానికి కూడా మనస్కరించటం లేదు. వాళ్ళతో ఇంతకాలం గడిపిన తరువాత వాళ్ళు నాకు చాలా దగ్గరైపోయారు. ఎంత దగ్గరంటే వాళ్ళు అనబోయే మాటలు నాకు ముందే తెలిసిపోతున్నాయి. అదే నాకు నచ్చటం లేదు.
మానవుడి బుర్ర బహుశా ఒక సర్కస్ రింగు లాంటిది అనుకుంటాను. అవే గుర్రాలు రింగు చుట్టూ పదే పదే చక్కర్లు కొడుతూవుంటాయి. మనం అంతే. చక్కర్లు కొడుతూ వుండాలి. అవే ఆలోచనలు, అవే సంతోషాలు. అవే ఆనందాలు, అవే అలవాట్లు, అవే నమ్మకాలు, అవే అసహ్యం కలిగించే భావాలు... అన్నీ గుర్రాలే మన బుర్రలో.
ఈ రోజు సాయంత్రం విపరీతంగా మంచు కురిసింది. ఊరు వూరంతా మంచులో కూరుకుపోయినట్లుంది. వీధి దీపాలు మంచు మసకలో సాంబ్రాణి పొగలా కనిపిస్తున్నాయి. నా గుండెల్లో బరువు రెండింతలైంది. నేను రాత్రి తిన్న ఆహారం అరిగినట్లు లేదు.
తిన్నది అరగడం జీవితంలో చాలా ముఖ్యమైనదని నా అభిప్రాయం. అలా జరిగినప్పుడే కళాకారులకి ఊహలు పుడతాయి, యువకులకి ఆవేశపూరితమైన ఆలోచనలు వస్తాయి, ఆలోచనాపరులకి ఆలోచనలు కలుగుతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా మనస్పూర్తిగా మళ్ళీ తినేందుకు అవకాశం కలుగుతుంది. (మనస్పూర్తిగా తినగలగడం కన్నాఆనందకరమైన విషయం ఇంకేముంటుంది?) అరుగదల లేని కడుపులోనుంచే పిచ్చి పిచ్చి ఆలోచనలు, జీవితం పైన అపనమ్మకం, పీడకలలు ఆఖరికి చావాలన్ని కోరిక కూడా పుడుతుంది. ఇది నేను చాలాసార్లు గుర్తించిన సత్యం. బహుశా ఈ రోజు నేను తిన్నది సరిగా అరిగిపోయి వుంటే ఆత్మహత్యా ప్రయత్నం చేసేవాడిని కాదేమో.
ముప్ఫై ఏళ్ళుగా ప్రతిరోజూ నేను కూర్చునే పడక కుర్చీలో ఈ రోజు కూడా కూర్చోని చుట్టూ పరికించి చూశానో లేదో, ఒక్కసారిగా నిస్పృహ నన్ను కమ్మేసింది. నాకు పిచ్చిపట్టేస్తుందేమో అన్నంతగా కప్పేసింది.

నా నుంచి నేనే పారిపోవాలంటే ఏం చెయ్యాలా అని తీవ్రంగా ఆలోచించాను. ఏ పని చేద్దామన్నా మనస్కరించలేదు. ఏదైనా పని చెయ్యడం కన్నా ఖాళీగా కూర్చోవడమే మేలని అనిపించింది. ఎలాగో నా కాగితాలు సర్దుకుందామని నిర్ణయించుకున్నాను.
చాలా రోజులనుంచి నా టేబుల్ సొరుగులను సర్దాలని అనుకుంటూనే వున్నాను. ముఫై ఏళ్ళుగా నా కాగితాలు, ఉత్తరాలు, బిల్లులు, చెత్త చెదారం మొత్తం ఆ సొరుగుల్లోనే వేస్తూ వచ్చాను. చాలా సార్లు ఏదన్నా కావాల్సి వచ్చినప్పుడు వెతుక్కోలేక ఇబ్బందులు కూడా పడ్డాను. ఇన్నాళ్ళూ వాటిని సర్దాలంటే కావాల్సిన ఓపిక, శారీరికంగానూ, మానసికంగానూ లేక వూరకుండిపోయాను.
చివరికి ఎలాగైతేనేం ఆ కాగితాలను సర్ది, అనవసరమైనవన్నీ తగలబెట్టాలని నిర్ణయించుకోని పని మొదలుపెట్టాను. లోపల వున్న కాగితాలను చూస్తే ఒక్కసారి పిచ్చిపట్టింది. కాలంతో పాటు కరిగి రంగు మార్చుకోని పసుపు పచ్చగా తయారైన కాగితాలు చాలా వున్నాయి. అందులో నుంచి ఒకటి అందుకున్నాను.
ఓహ్.. ఇప్పుడు నేను చెప్పబోయేది బాగా జ్ఞాపకం వుంచుకోండి. జీవితంలో సంతోషంగా వుండాలనుకుంటే సమాధి స్థితిలో వున్న పాత వుత్తరాలని కదిలించకండి. ఒకవేళ పొరపాటున వాటిని తీయాల్సివస్తే ఒక్కసారిగా ఒక కట్ట కాగితాలను తీసుకోండి. వాటి వైపు చూడకుండా కళ్ళు గట్టిగా మూసుకోండి. అలా కాదని ఆ ఉత్తరాలలో ఏ ఒక్కటైనా చూశారా...! ఇక అంతే. మీరు ఎప్పుడో మర్చిపోయిన చేతిరాత ఒకటి కనిపిస్తుంది. జ్ఞాపకాల సముద్రంలో పడిపోతారు. అందులోనే మునిగిపోతారు...!! అందువల్ల కళ్ళు మూసుకోనే వాటిని మంట దగ్గరకు తీసుకెళ్ళి తగలబెట్టి అవి బూడిదైన తరువాత చివరికి నుసి చేయ్యండి. నా మాట వినకుండా చదివారో ఇక మీరు అందులో లీనమైపోతారు. సరిగ్గా నేను అలాగే ఒక గంట సేపు ఆ వుత్తరాలతో గడిపాను.
మొదటగా చదివిన ఉత్తరాలలో చెప్పుకోడానికి ఏమీ లేదు. అవన్నీ ఈ మధ్యకాలంలో వచ్చినవి. పైగా అవన్నీ ఇప్పుడు బతికే వున్నవాళ్ళు వ్రాసినవి. వాళ్ళని నేను తరచుగా కలుస్తూనే వున్నాను కూడా. వాళ్ళ సహచర్యం కూడా ఏమంత చెప్పుకోదగ్గది కాదు. అప్రయత్నంగా ఒక కవరు అందుకున్న తరువాతే అంతా మొదలైంది. ఆ కవరు మీద నా పేరు స్పష్టంగా, అందంగా పెద్ద పెద్ద అక్షరాలతో రాసివుంది. నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అది నా చిన్ననాటి స్నేహితుడి దగ్గర్నుంచి వచ్చింది. నాతో ఊహలు పంచుకున్న మిత్రుడి ఉత్తరం అది. ఇలా తలుచుకోగానే వాడు నాకు కళ్ళ ముందు స్పష్టంగా కనిపించాడు. అదే చిరునవ్వుతో, చేతులు చాచి కనిపించాడు. నాకు వెన్నులో భయం చలిలా పాకింది. అవును.. నిజం. చనిపోయిన నా బాల్య మిత్రుడు కనిపించాడు. ఈ ప్రపంచం కన్నా జ్ఞాపకం ఎంత గొప్పది. ఇక లేరు అనుకున్నవాళ్ళని కళ్ళ ముందు నిలుపుతుంది.
వణుకుతున్న చేతులతో, మసకబారిన కళ్ళతో వాడు చెప్పిన విషయాలను మళ్ళీ చదివాను. చదువుతున్న కొద్దీ నా గుండెల్లో ఏదో గాయం సలుపుతున్నట్లు, నా శరీరంలో ఎముకలన్నీ కుచించుకుపోతున్నట్లు బాధ కలిగింది.
ఆ తరువాత మొదలైంది నా ప్రయాణం. నదిమీద తేలే నావలాగా కాలంలోకి ప్రయాణం చేశాను. ఎందరో మనుషుల్ని మళ్ళీ కలిశాను. ముఖాలు మాత్రమే గుర్తున్న కొందరి పేర్లను మళ్ళీ తెలుసుకున్నాను. మా అమ్మ రాసిన వుత్తరాలలో ఆ పాత ఇంటిని, ఇంట్లో పాలేర్లనీ, నౌకర్లనీ చూశాను. ఒకప్పడు ప్రాధాన్యత ఇవ్వని చిన్న చిన్న విషయాలు మళ్ళీ గుర్తించాను.
నిజం. మా అమ్మ కట్టుకున్న గౌన్లను చూశాను. ఆమె రకరకాలుగా దువ్వి ముడుచుకునే జడలను చూశాను. ముఖ్యంగా ఆమె కట్టుకునే పాత అంచు సిల్కుగౌను నన్ను వెంటాడింది. ఆ గౌనులో ఆమె నాతో చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయి.
"రాబర్ట్ నిటారుగా నిలబడం నేర్చుకో. లేకపోతే నీ బతుకంతా వంకరగా మిగిలిపోతుంది."
మరో సొరుగు తెరిచి చూశాను. కుర్ర వయసులో కలిగిన చిన్న చిన్న ప్రేమల గుర్తులన్నీ నా కళ్ళముందు నిలిచాయి. చిన్న చేతి రుమాలు, అమ్మాయిల బూట్లు, తలకి కట్టుకునే రిబ్బను, నల్లటి జుట్టు, ఎండిన పూలు. ఒకప్పటి నా ప్రేమ కథలో అందమైన కలల రాణులు గుర్తుకొచ్చారు. వారందరూ ఇప్పుడు నెరిసిన జుట్టుతో వార్థక్యంలో వుంటారన్న ఊహే నన్ను విషాదంలో ముంచెత్తింది. ఆ తీరైన కనుబొమ్మలు, ఆ వొంపుల జడలు, ఆ చేతులు పంచిన ఆనురాగాలు, మాట్లాడిన చూపులు, పలికిన గుండెలు.. నవ్వులు అందించిన పెదవులు, పెదవులు అందించిన ప్రేమలు... ఇక ఆ తొలి ముద్దు...!! ఇక అంతం కాదేమో అన్నంత ప్రేమలో మునితేలుతూ పెట్టుకున్న తొలిముద్దు, తమకంతో కను రెప్పలు వాల్చేసి అనంతమైన ఆనందంలో మునిగితేలిన మధురానుభూతులు.
ఆ మాజీ ప్రియురాళ్ళు నాతో చేసిన బాసలు ఇదుగో అక్షరరూపంలో నా చేతిలో..! వాటిని సుతారంగా తాకాను. గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలైనట్లు అనిపించింది. ఇక విరక్తికి లోనౌతూ, వాటిని తదేకంగా చూస్తూ నేను అనుభవించిన బాధ బహుశా కథల్లో చెప్పే నరకంలో బాధల కన్నా ఎక్కువేనేమో.

ఆఖరుగా ఒక్క ఉత్తరం మిగిలిపోయింది. యాభై ఏళ్ళ క్రితం నేను రాసిన ఉత్తరం. మా క్లాసులో ఇంగ్లీషు టీచరు చెప్తుంటే రాసిన ఉత్తరం అది.
ప్రియమైన అమ్మకి,
ఈ రోజుతో నాకు ఏడేళ్ళు నిండుతాయి. నాకు ఊహ తెలిసే వయసు వచ్చింది. అందుకే నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నన్ను ఈ భూమి మీదకు తీసుకొచ్చినందుకు నీకు ధన్యవాదాలు.
నిన్ను ఎంతో ప్రేమించే నీ బుజ్జిబాబు
రాబర్ట్
అన్నీ అయిపొయాయి. అంతా అయిపోయింది. మొత్తం మళ్ళీ మొదటికి వచ్చింది. ఒక్కసారి మిగిలిపోయిన నా జీవితం వైపు దృష్టి సారించాను. ఏం మిగిలుందక్కడ? వయసుతో వచ్చిన వృద్ధాప్యం. దానితోపాటే ఆక్రమిస్తున్న అనారోగ్యాలు. అన్నీ వెళ్ళిపొయి, అన్నీ కోల్పోయి ఇక ఎవరూ నాతో లేని ఓంటరితనం.
నా దగ్గర నా రివాల్వర్ వుంది. దాంట్లో గుండ్లు నింపుతున్నాను....
గుర్తుంచుకోండి - ఎప్పుడూ.. ఎప్పుడూ పాత ఉత్తరాలు తీసి మళ్ళి చదవకండి"
అలా ముగిసిందా ఉత్తరం. అతని జీవితం కూడా. కొన్ని జీవితాల చివరి అకం ఇలాగే వుంటుంది. ఇదంతా తెలియని మనం మాత్రం వాళ్ళ మరణానికి వెనక ఏదో పెద్ద విషాదం వుండాలే అని వెతుకుతుంటాము.

మూల కథ: సూయిసైడ్స్ (Suicides)