అడుగుపెడుతూనే పెద్ద రాజద్వారం. ఇదుగో ఇలా...

ఆ పైన ఒక పురానీ హవేలి (పురాతన మహలు)... ఇలా

నాకెందుకో సితార సినిమా గుర్తొచ్చింది. మరీ ముఖ్యంగా శరత్‌బాబు హుందాగా భవంతి బయట మాట్లాడి లోపలికెళ్ళి కోటు విప్పితే చొక్కాకి చిరుగు కనపడుతుందే ఆ సీను...
వెంటనే - "సార్ మరి ఇంత పెద్ద భవంతిని మైన్‌టైన్ చెయ్యాలంటే కష్టం కాదూ" అన్నా ఆరాతీస్తూ..
నేననుకున్నది నిజమే.. ఆయన భోరున ఏడ్చినంత పని చేసాడు. "ఏం చేస్తాం సార్.. ఈ భవంతిని వూడ్చడానికే ఒక నౌకరున్నాడు.. ఇంకా గుర్రాలు ఏనుగులను మొన్నే వదిలించుకున్నాను" అన్నాడు ఆ ఏనుగు అంబారీ ఫోటో చూపిస్తూ. నాకు అర్థమైపోయింది... ఈయన శరత్‌బాబే..!!
కానీ ఆ ఇంటిని (కనీసం మేము కూర్చున్న రాణీగారి గదివరకైనా) చక్కని పురాతన వస్తువులతో, ఆయన వంశం రాజుల బొమ్మలతో చక్కగా అలంకరించారు. మరీ ముఖ్యంగా నాకు నచ్చింది ఇదుగో ఈ గ్రాముఫోను..

ఇది ఇంక పనిచేస్తోంది సుమండి.. చక్కని రాజ్‌కుమార్ పాటలు వినిపించారాయన కీ ఇచ్చి.
కొసమెరుపేమిటంటే ఒకప్పుడు గుర్రాలను ,ఏనుగులను కట్టేసే చోట 1957 నాటి ఒరిజినల్ రాజ్‌దూత్ బండి వుండటం. అప్పట్లో బండ్లు తక్కువ కావటం మూలాన అట్టే రిపేరు షాపులు వుండేవి కావట. అందుకే ఈ బండి సైలెన్సరు పైన ఒక గాలి పంపు, పంచర్లు వేసుకునే సామాగ్రీ పక్కన పెట్టెలో వున్నాయి. ఇది ఇప్పటికీ పనిచేస్తోంది... రాజావారి ప్రయాణం రోజూ దీని మీదే -

(కొన్ని కారణాలవల్ల ఆయన పేరు ఫోటోలు ఇక్కడ వ్రాయలేను..)
1 వ్యాఖ్య(లు):
nijaMgaa guMDelu baruvekkE sannivESAlu, nija jIvitaMlO taarasa paDDAyi mIku.
maMchi informEtion ni ichchaaru, thanks!
కామెంట్‌ను పోస్ట్ చేయండి