కాశీకి పోయాను రామాహరి..!!

అవునండి.. అనుకోకుండా ఆఫీస్ పనిమీద కాశికి వెళ్ళే అవకాశం కలిగింది. వుద్యోగరీత్యా ప్రస్తుతమున్న ఇండోర్ నుంచి దక్షిణాదికి వచ్చే ప్రయత్నాలేవి ఫలించకపోగా, ఇంకొంచెం వుత్తరానికి బదిలీ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ కారణాల దృష్ట్యా ఈ వారం ఆంధ్రప్రదేశ్ రావాల్సింది రాలేకపోయాను. కొత్తగా చేపట్టబోయే బాధ్యతలలో ఉత్తర్‌ప్రదేశ్ కూడా వుండటంతో, మొన్న వారణాసి వెళ్ళాల్సి వచ్చింది. "ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళకపోగా ఈ వుత్తారాది కష్టాలేమిటి" అన్న మా ఆవిడతో - "దేవి..! కష్టములెట్లున్ననూ పరమ పావనమగు వారాణాసి క్షేత్రము దర్శించుటకు వీలాయకదా.." అంటూ ప్రయాణమయ్యాను.


అక్కడ పని వత్తిడి వున్నా, ఎలాగో వీలు చేసుకోని గంగా తీరానికి, విశ్వేశ్వర, అన్నపూర్ణ దర్శనానికి వెళ్ళగలిగాను. భద్రత దృష్ట్యా ప్రధాన ఆలయం దగ్గరకి సెల్‌ఫోనులు, కెమెరాలు అనుమతించలేదు. కాబట్టి ఈ సారికి "కాశికి పోయానును రామా హరి.. గంగ తీర్థమ్ము తెచ్చాను రామా హరి.." అంటూ ఇదుగో గంగమ్మ చిత్రాలు...!! కొన్ని కబుర్లు..!!
ప్రహ్లాద ఘాట్‌తో మొదలై అస్సీ ఘాట్‌తో ముగిసే ఎనభై ఘాట్‌లలో రెండు మూడు ఘాట్‌లు చూడగలిగాను. శవదహనాలు జరిగే మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్‌లు చూడలేకపోయాను.

గంగా స్నానం చెయ్యలేకపోయినా ఇలా చేసేవాళ్ళను చూసి సంబర పడ్డాను.
వారణాశి గంగ వొడ్డున తప్పక కనిపించేవి ఈ తాటాకు/వెదురు గొడుగులు. వీటికింద కూర్చోనే పండారీలు తర్పణాలు, పిండప్రదానాలు చేయిస్తుంటారు..!!


ఇంకా వారణాసిలో చూడాల్సినవి, తెలుసుకోవాల్సినవి చాలా వున్నాయి.. సంకటమోచన్ హనుమాన్, బనారస్ హిందూ యూనివర్సిటి.. ఇంకా బాల్య వివాహం తరువాత విధవలై ఇక్కడికి చేరినవారు, కాశిలో మరణిస్తే మోక్షం కలుగుతుందని ఇక్కడి సత్రాలలో వుంటూ చావుకోసం ఎదురుచూసే ముసలి వాళ్ళు.. గంగ వొడ్డున సాయంత్రం జరిగే హారతులు.. బనారస్ పట్టు చీరలు, బనారస్ పాన్... ఎన్నో విశేషాలు, కథలు..!! ముందు ముందు మళ్ళీ వారణాసి వచ్చే అవకాశం వుంది కాబట్టి.. ఈ సారి మరింత తీరిగ్గా రావాలనుకుంటూ తిరుగు టపా కట్టాను..!!
అక్కడ ఒక మిత్రుడు చెప్పిన మాట -


"రాండ్, సాండ్, సీడి, సన్యాసి

ఇన్‌సే బచ్‌పాయే తో భవ్య కాశీ"


అంటే -


"రాండ్ అంటే మన గీరీశం చెప్పిన "యంగ్ విడోస్", అందునా తప్పుదోవ పట్టినవాళ్ళు అన్నమాట, సాండ్ అంటే "అచ్చోసిన ఆంబోతులు" శైవ క్షేత్రంలో వాటికి అడ్డేముంది.. సీడి అంటే మెట్లు - ఎనభై ఘాట్లలో ఎన్నో మెట్లు - కొన్ని పాచి పట్టి జారేవైతే కొన్ని ఎదురు తగిలేవి.. ఇక సన్యాసి - ఇక్కడి సన్యాసులు చాలా ప్రమాదకరం. చాలా మందికి తెలుగు, తమిళ భాషలు తెలుసు.. నయానో, భయానో - భయపెట్టో భక్తి పెట్టో డబ్బు గుంజగల సమర్థులు. కాబట్టి ఇలాంటివన్నీ తప్పించుకోగలిగితే కాశీని మించిన గొప్ప క్షేత్రం లేదు.." అని


హర హర మహాదేవ..!!

5 వ్యాఖ్య(లు):

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

హర హర మహాదేవ

అజ్ఞాత చెప్పారు...

If you took a boat ride along the banks, from inside the Ganges you can see all ghats in one stroke. When I went I did that. It was cheap and fun. But not taking bath in Ganges? Its in inexcusable. How on earth you could not take snan? I cannot understand ...better luck next time.

If you already are not aware, make sure you understand what they speak before you go into the Manikarnika ghat. Otherwise the Pandas there make you perform last rites of your parents without asking whether they are alive or not. Naturally so because those who enter Manikarnika ghat enter only if either of their parents are no more. [mimmalni aDagakuMDA mI batikunna tallitaMDrulaki taddinaM peTTiMcEstAru. Thats the joke. ;-)]

భాస్కర్ రామరాజు చెప్పారు...

మాష్టారూ
బాగా గుర్తుచేసారు.
అజ్ఞాత చెప్పినట్టు ఒక పడవ మాట్టాడుకుంటే భేషుగ్గా అన్నీ ఘాట్లు ఒకేసారి చుట్టేయొచ్చు.
నేను మూడునిద్రలు చేసా కాశీలో. అలా చేద్దాం అని అనుకున్నా. నేను వెళ్ళినకారణం వేరనుకోండి. ఐతే నేనుకూడా నెత్తిన నీళ్ళు జల్లుకున్నానే కానీ దేనికో గంగలో మునగలేకపొయ్యా. కానీ త్రివేణీ సంగమంలో మునిగా.

సత్యప్రసాద్ అరిపిరాల చెప్పారు...

విజయమోహన్‌గారు,
నెనర్లు

అజ్ఞాత,
మీరన్నట్టు పడవెక్కే ఆలోచన, గంగా స్నానం చేసే ఆలోచన చేశాం కాని కుదరలేదు. మళ్ళీ వెళ్తాగా త్వరలో..!!

రామరాజుగారు,
త్రివేణిలో నేను గతంలో వెళ్ళినప్పుడు మునిగాను. కాశి వెళ్ళడం రెండోసారి, రెండుసార్లు ఎందుకో స్నానం కుదరలేదు..!! ఈ సారి హరిద్వార్ వెళ్ళే ఆలోచన చేస్తున్నా.. ఈ సారి గంగా స్నానం తప్పక చేస్తాను.

Kandi.Shankaraiah చెప్పారు...

సత్యప్రసాద్ కాశీకి పోయాడు రామాహరీ
తిప్పడు కొండపర్తికి పోయాడు గోవిందాహరీ.