ఇందోరుకు వీడ్కోలు - రెండొవభాగం: రాజవాడ - దాల్ బాఫ్లే

నిన్నటి టపాలో ఇందోర్ సరాఫాలో దొరికే పానీయాల గురించి చెప్తూ షికంజీ అన్నాను గుర్తుందా? దాని గురించి ఓ కథ:

షికంజీ అనేది ఇందోరులో మాత్రమే దొరికే ఒక పానీయం. మన లస్సీ కన్నా చిక్కగా వుంటుంది. పాలు, పెరుగు కలిపి చేస్తారు. ఇలాంటి సరికొత్త రకం పానీయం కనిపెట్టింది ఎవరా అని ఎంక్వైరీ చేస్తే నాగోరి అనే కుటుంబంవాళ్ళని తెలిసింది. వాళ్ళ షాపు సరాఫాలోనే వుంటుంది.. అయితే ఎప్పుడూ మూసేసి వుంటుంది..!! ఏమిటని అడిగితే -

"వాళ్ళ షాపులో సరుకు అయిపోయింది.. రోజు వుదయం పదకొండు గంటలకి తెరుస్తాడు..మధ్యాహ్నానికి అయిపోతుంది" అని చెప్పారు.

సరే కదా అనుకొని ఒకరోజు ఒంటిగంటప్పుడు అక్కడికి వెళ్ళాను. అప్పటికి షాపు తెరిచేవుంది. లోపలికి వెళ్ళేసరికి రెండు మూడు గంగాళాలు కడుగుతున్నారు. ఏమిటంటే - "షికంజీ అయిపోయింది.." అన్నారు.

"పోని లస్సీ"

"ఏమి లేదు సార్.. అన్నీ అయిపోయాయి" చెప్పాడతను.

పదకొండుకు షాపు తెరిస్తే ఒంటిగంటకు అయిపోయింది. రోజుకి రెండుగంటల వ్యాపారం..!! తరువాత వేరే ఒకటి రెండుచోట్ల షికంజి తాగాను కానీ నాగోరి దగ్గర తాగలేదు అని లోటు వుండిపోయింది. చూద్దాం ఇందోరు వదిలే లోపల తాగి తీరుతాను..!

అసలు ఈ రాజవాడ ప్రాంతంలో ఇలాంటివి చాలా వున్నాయి. ఒక చోట కచోరి మరో చోట పాన్ షాపులో పాన్ - (ఈ పాన్ షాపుకు షట్టర్లు వుండేవి కాదు.. ఇరవై నాలుగు గంటలు తెరిచే వుంచేవాడు. కుటుంబసభ్యులు షిఫ్టు డ్యూటీలు చేసేవారట. ఈ మధ్య పోలీసుల పుణ్యమా అని రాత్రి పన్నెండు నించి నాలుగు దాకా మూస్తున్నారు.) అసలింతా ఈ రాజవాడా ఏమిటయ్యా అంటే - ఇందోరు నగరాన్ని పాలించిన అహల్యా బాయి హోల్కరు వారి వశీకులు కట్టించిన భవనం.


ఈ భవనంలో శివ భక్తురాలైన అహల్యా బాయి హోల్కర్ వుంటూ రాజ్యపాలన చేసింది. ఇప్పుడు కనిపించే భవనాన్ని ఈ మధ్యే పునరుద్ధరించారు.

లోపల శిల్పాలు, శివ మందిరం ఆకట్టుకుంటాయి.

ఈమె పూజలో వుండే నవరత్న సాలగ్రామం ఒకసారి దొంగలు దోచుకెళ్ళి మళ్ళీ తెచ్చి యధాస్థానంలో పెట్టేశారట.


ఈ భవనం చుట్టూ వుండే వీధుల్లో రకరకాల వస్తువులు అమ్ముతుంటారు. ఒక వీధంతా స్టీలు సామాన్లు (బర్తన్ బజార్), ఒక వీధంతా చీరలు (కపడా బజార్) మరో వీధంతా ఎలక్ట్రానిక్ వస్తువులు ఇలాగన్నమాట. సాయంత్రంగా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకోని, సరాఫాలో తినేసి వెళ్ళేవాళ్ళు చాలా ఎక్కువ.

ఈ సరాఫా వెనుకే పృథ్వీలోక్ అనే ఒక రెస్టారెంట్ వుంది. ఇక్కడ రోజు పెట్టే థాళి కన్నా ఆదివారం నాడు పెట్టే దాల్ బాఫ్లే ప్రత్యేకమైంది. బాఫ్లే అనేది ఈ ప్రాంతంలో ప్రముఖంగా తయారు చేసే ప్రత్యేక వంటకం. మన సంకటి లాగా పూర్వపు వంట. పట్టణాలలో అరుదుగా దొరుకుతుంది. దీని తయారి గురించి చెప్పేదా? - వినండి -

దాల్ అంటే తెలుసుగా మన పప్పు లాంటిదే.. కాకపోతె కొంచెం పల్చగా చేస్తారు.

ఇక బాఫ్లే -

కావల్సిన పదార్థాలు:


గోధుమ పిండి (రొట్టలకు చేసే పిండి కన్నా గరుకుగా వుంటుంది)
వుప్పు వగైరాలు
ఆవు పేడ పిడకలు - లేదా బొగ్గులు - లేదా మైక్రో ఓవెన్
ప్రజర్ కుక్కర్

విధానం:

పిండి సరిపడ వుప్పు కొంచెం నీళ్ళు, కొంచెం నెయ్యి వేసి అరచేతిలో పట్టేంత వుండలుగా చేయ్యాలి. వాటిని వుప్పు నీటిలో కొంచెం వుడకబెట్టి (మూడు విజిల్స్) ఆ తరువాత కాలుతున్న పిడకల్లోనో బొగ్గుల్లోనో ఓవెన్లోనే గట్టిపడే దాకా కాలుస్తారు.


ఆ తరువాత వాటిని బాగా కాచిన నేతిలో వేస్తారు (అవును నేతిలోనే..!!) అవి నేతిలో వూరిన తరువాత తీసి ప్లేట్లో పెట్టి దాల్‌తో పాటుగా ఇస్తారు.


తినే విధానం:


ఆ వుండలను రెండు చేతులతో ముక్కలు చేసి.. పొడి పొడిగా నలిపి దానిమీద దాల్ కుమ్మరించడమే.. సిమెంటులో నిళ్ళు పోసినట్టు.. బాఫ్లే దాల్ పీల్చేస్తూ వుంటే మరి కొంచెం.. మరికొంచెం దాల్ పోస్తూ వెళ్ళాలి. ఆ తరువాత దానితోపాటు ఇచ్చే వెల్లుల్లి పచ్చడి నజుకుంటూ, పచ్చి మిరపకాయలు, వుల్లిపాయలు కొరుక్కుంటూ తినెయ్యడమే.

చట్టబద్దమైన హెచ్చరిక:

1. సామాన్యమైన బ్యాటింగ్ చేసేవాళ్ళు రెండు కన్నా ఎక్కువ బాఫ్లేలు తినలేరు.. ప్రయత్నిచవద్దు.

2. తిన్న దగ్గరనుంచి విపరీతంగా దాహమెయ్యడం.. విపరీతంగా నిద్ర రావటం.. రాత్రికి ఆకలెయ్యకపోవటం సర్వ సాధారణం. దీనికి తోడుగా రెండు గ్లాసులు జల్‌జీరా తాగితే ప్రయోజనం వుండచ్చు.

3. ఒక్కొక్క బాఫ్లేతోపాటు ఎంత నెయ్యి లోపలికి వెల్తుందో చెప్పలేం కాబట్టి బరువు పెరిగే అవకాశం లేకపోలేదు.

ఇదే వంటకాన్ని కొంచెం మార్పులతో దాల్ భాటి అని గుజరాత్, రాజస్థాన్‌లలోనూ - లిట్టీ పేరుతో ఉత్తర్ ప్రదేశ్‌లోనూ తయారు చేస్తారు. ఉత్తర్ ప్రదేశ్‌లో దీన్ని చౌకా (మన కాల్చిన వంకాయ పచ్చడి లాంటిది) తో ఇస్తారు ఇలాగ -

ఇక్కడికి కల్నరీ టూరిజం (culinary tourism) అయిపోయింది. తరువాత టపాలో దగ్గర్లో పర్యాటక స్థలాల గురించి చెప్తాను..

4 వ్యాఖ్య(లు):

అజ్ఞాత చెప్పారు...

Talk about purity of milk and milk products in north (MP, UP etc). Also the simple folk eating milk and jilebi as breakfast (!). Have you seen Omkareswar yet (and remember the route via bus? My God!). Sunday feasts? Dassara and Deevali festivals (laxmi puja), the sardars spending money like crazy for fire crackers? Transport business? Dhaba food? A million other things to talk. Huh?

Once upon a time I was at Indore SGSITS ;-) BTW is there a direct train from Hyd to Indore? When I went from AP, I had to catch three different trains/buses. I love those MP highways - on par with the american highways about safety and smooth riding. Excellent roads back then. Amazing bus drivers too. I once went on an express bus from Indore to Bhopal in 3 hours with just one stop at Ujjain.

BTW if you have not seen ujjain before leaving Indore go and see that too. Sandeepani Ashram, Kali temple where Kalidasa got his boons, scores of river side temples and of course the majestic Mahakaleswar. I can talk forver on these things.

Unknown చెప్పారు...

అజ్ఞాత మిత్రమా,

వ్యాఖ్యకు నెనర్లు. పేరు చెప్తే ఇంకా బాగుంటుందేమో..!

పాల విషయం: రెండేళ్ళు గుజరాత్ పాలు తాగాను.. పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్, ప్రత్యేకించి మథుర, ఆగ్ర, రాయబరేలి, అయోధ్య దాకా.. పాల స్వచ్చత రుచే వేరు. పాలంటే ఇష్టపడే శ్రీకృష్ణుడు ఈ ప్రాంతాలలోనే పెరగటం(మథుర), రాజ్యం చేయటం (ద్వారక) వింతేమి కాదు కదా..!

పాలు జిలేబి ఎక్కువగా మహరాష్ట్ర బ్రేక్‌ఫాస్ట్... మ.ప్ర.లో కూడా వుందనుకోండి..! ఇందోరులో ముఖ్యమైన బ్రేక్‌ఫాస్ట్ పోహా-జిలేబి, కచోరి.

విజయవాడ నుంచి ఇందోర్‌కి వారానికి ఒక ట్రైన్ వుంది. భోపాల్ వచ్చి రోడ్డు దారిలో ఇందోర్ రావటం వుత్తమమైన మార్గం. మీరన్నట్టు రోడ్లు కూడా బాగుంటాయి కాబట్టి. ఇందోర్ భోపాల్ మధ్యలో మీరు ఆగిన ప్రదేశం ఉజ్జైని అయ్యుండదు.. సోన్‌కచ్ అయ్యుంటుంది..!!

ఓంకారేశ్వరం, ఉజ్జైని మూడుసార్లు వెళ్ళి వచ్చాను. తరువాత వ్రాయబోయేది వాటి గురించే. మీరు రేపటి టపా చదివితే ఆ జ్ఞాపకాలు గుర్తుచేసుకొవచ్చు.

అజ్ఞాత చెప్పారు...

No. No. It was definitely Ujjain, not sonekuch. One of my relatives used to work in Ujjain pipe factory (SAIL) and I visited Ujjain more than once.

Poha is ok but most frequent was glass of milk and jilebi when I lived there. Also I used to mistake many of the college going girls as telugu ladies and then learned that these cycle riding bindi wearing ladies were Maharastrians. They look exactly like Telugu ladies. Boy, they ride bicycles to college at 100 KMPH. Huh? Amazing! I love(d) Indore.

I did not like kachori though. I liked karanji (kajjikAya). The most amazing thing was the quality of milk for me - especially after I went from AP where the entire Godavari river comes in coffee first thing in the morning albeit in white color called 'milk.' ;-)

అజ్ఞాత చెప్పారు...

Sorry. mIrE raiTu. The bus did not stop at Ujjain. I see that my geographay failed me. Ujjain is not on the way from Bhopal to Indore bus route. It could be Devas or someother. How are you able to take pictures of the Sanctum Sanctorum? Is that not prohibted in India? Amazing.