ఇండియన్ ఐడల్‍లో తెలుగువాడు.. మైనంపాటి శ్రీరామచంద్ర


సోనీ టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే "ఇండియన్ ఐడల్" ఐదొవ అంకంలో మనవాడు.. మన తెలుగువాడు.. "శ్రీరామచంద్ర" టాప్ 13లో ఒకడుగా నిలిచాడు. ఇంతవరకూ ఈ పోటీలో కారుణ్య తరువాత ఇంత ఎత్తుకు ఎదిగింది.. రామచంద్ర మాత్రమే.. గతంలో ఈ టీవీ "సై", "ఒక్కరే" పాటల పోటీలో విజేతగా నిలిచిన శ్రీరామచంద్ర ఈ పోటీలో కూడా గెలవాలని తెలుగువారే కాదు.. దక్షిణభారతీయులం అందరం కోరుకోవాలి... గతంలో "కారుణ్య" ఎస్.ఎమ్.ఎస్. ల కారణంగా ఈ అరుదైన అవకాశాన్ని కోల్పోయాడు.. అలా మన శ్రీరామచంద్రకి జరకకూడదంటే.. వెంటనే మొబైల్ అందుకోండి... 52525కు "SREERAM" అని టైప్ చేసి పంపించండి... లేదా ఏ మొబైల్ నించి అయినా 505252507కి, బీఎస్‍ఎన్‍ఎల్ నుంచి అయితే 1861888252507కి కాల్ చెయ్యండి.. ఒక తెలుగువాడు "ఇండియన్ ఐడల్" అయ్యేందుకు సహకరించండి..
నా బ్లాగులో శ్రీరామచంద్రని గెలిపించమని అభ్యర్ధిస్తూ ఒక బ్యానర్ పెట్టాను. మీ బ్లాగులో కూడా అలా పెట్టదలిస్తే ఆ బొమ్మని తీసుకోవచ్చు.(ఈ రోజు అనుకోకుండా కలిసిన శ్రీరామచంద్ర తండ్రిగారు.. ఎమ్.ఎస్.ఎన్. ప్రసాద్ గారి అభ్యర్థన మేరకు)

8 వ్యాఖ్య(లు):

అజ్ఞాత చెప్పారు...

encourage the real talent. too bad to say encourage because he is telugu.

అజ్ఞాత చెప్పారు...

Hi Ajnyatha garu,
I think the reason behind this post to give information. Watch the show .. if you like him then send SMS. No one is forcing you to do it kada...

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

మొదటి అజ్ఞాతగారూ! తప్పేంలేదు,ఇప్పటి పరిస్థితి అలాగే ఉంది,మనమొక్కరం మడి కట్టుకుని కూర్చుంటే లాభం లేదు.

హరే కృష్ణ . చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...

hey hey
where are you? Looooooooooooooooooong time no see. :-) Still in Delhi? Why not writing on blog regularly?

You know me!
[SGITS Alumni]

సత్యప్రసాద్ అరిపిరాల చెప్పారు...

అజ్ఞతగారు,

నిస్సందేహంగా "టాలెంట్" వున్న వాళ్ళే గెలవాలి. ఇది పైన చెప్పినట్లే శ్రీరామచంద్ర తండ్రిగారి అభ్యర్థన మేరకు ఉంచిన "ప్రకటన" మాత్రమే. అయితే తెలుగువాడు (టాలెంట్ ఆధారంగానే) గెలిస్తే సంతోషిస్తాను.. ఒకవేళ శ్రీరామచంద్ర సరిగా పాడకుంటే అతన్ని గెలవకుండా చేసి తెలుగు పరువు నిలబెట్టటమూ అవసరమే.. ఏది జరగాలన్నా ఇలా ఒక తెలుగువాడు ఒకడు అక్కడిదాకా వెళ్ళాడని పది మందికి తెలియాలి కదా?

SGITS,
నమస్తే. డిల్లీకి రాం రాం.. భాగ్యనగరికి చేరాం చేరాం.
http://jokabhiramayanam.blogspot.com

మధు చెప్పారు...

మా మైనంపాటి వాడా. చాలా థ్యాంక్స్

హారం ప్రచారకులు చెప్పారు...

సత్యప్రసాద్ అరిపిరాల గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.