
1784లో అసఫుద్ద్‌దౌలా అనే నవాబ్ గారి ఆదేశాల మేరకు ఈ కట్టడాన్ని కట్టారు. ఆ సమయంలో కరువు

ఈ ప్రాంగణంలో కనిపించేవి మూడు కట్టాడాలు - బరాఇమాంబారా, ఒక మసీదు, దిగుడుబావిగా రూపాంతరం చెందిన అయిదంతస్థుల భవనం. మూడూ మొఘలు-పెర్షీన్-గోథిక్ శైలుల సమాగమంగా కనపడుతాయి.
భూల్‌భులయ్య
ఇమాంబారాలో మూడు పెద్ద పెద్ద హాల్సు లాంటి గదులుంటాయి. ఈ ముడు గదుల మధ్య వుండే లింకులే మన భూల్‌భులయ్య.

అక్కడి గైడులు అంతా చూపించి చివరగా పై అంతస్థుకు తీసుకెళ్తారు. అక్కడ కిందికి వెళ్ళడానికి ఆరు దారులుంటాయి. మీ ఇష్టం వచ్చిన దారి ఎంచుకోండి ఎంత సేపటికి వెళ్ళగలరో చూద్దామని సవాలు విసురుతారు.

మరిన్ని విశేషాలు
ఒకేలా కనిపిస్తున్న ఆ మార్గాలో వెళ్తూ వెళ్తూ ఉన్నట్టుండి ఒక హాలు పై భాగంలో వుంటారు. "అదిగో చూడండి గుండ్రటి పైకప్పు చైనా శైలిలో నిర్మించారు" అంటాడు గైడు. కొంచం ముందుకి అంటే కుడి ఎడమలు ఎడాపెడా తిరిగి మళ్ళి అలాగే కనిపిస్తున్న ప్రదేశానికి చేరాక చూస్తే - అది గుండ్రటి కప్పున్న హాలు కాదు.. అంటే రొండొవ హాలన్నమాట. ఎప్పుడు మొదటి హాలులోనించి రెండోవ హాలులోకి వచ్చామో అర్థం కాదు. గుండ్రటి చైనా కప్పుకోసం చూస్తే అది పర్షియన్ శైలిలో కట్టిన చతురస్రాకారాకారపు కప్పు. "మీరు నిలిచున్న చోటే నవాబుగారు కూర్చునేవారు" అంటాడు గైడు మళ్ళి. వొల్లు జలదరిస్తుంది... ఈ నవాబుగారేమైనా బిల్డింగు నమూనా పట్టుకొని తిరిగేవారా అనిపిస్తుంది. ఇక్కడే ఒక మూల మనల్ని నిలబెట్టి గైడు అవతలి వైపు (330 అడుగులు) నిలబడి అగ్గిపుల్ల గీస్తాడు. ఆ శబ్దం మనకి స్పష్టంగా వినపడుతుంది. అలాగే కాగితం చించిన చప్పుడు సైతం మనకి వినపడుతుంది. శబ్దం ప్రాయాణించే మార్గాలని నిర్దేశించే పెర్షియన్ శైలి ఆర్చీలు నవ్వుతున్నట్టు కనిపిస్తాయి.

ఆ పరిసరంలోనే వున్న మరో కట్టడం పడమటివైపున్న షాహీ హమాం అనే భవంతి. ఇది ముందు సైనికుల నివాసంగా రూపొందించినా తరువాత తరువాత దుగుడు బావిగా మార్చారు (భవంతి అంత బావి..!!). ఆ భవంతి ముఖద్వారం దగ్గర నిలబడితే, అదంతస్తుల భవనం పైకప్పే కనపడుతుంది. ఆ భవంతిలో వున్న వారికి మాత్రం దర్వాజా దగ్గర నిలబడ్డవారు గురి చూసి బాణం వదిలేంత స్పష్టంగా కనపడతారు - అదీ నీటిలో..!!

ఈ భవనంలో ప్రస్తుంతం రెండు అంతస్థులు భూగర్భంలో నీటిలో వున్నాయి. ఈ బావి గోమతీ నదితో కలపబడిందని, లోతు తెలుసుకునే ప్రయ్త్నాలు అందుకే ఫలించలేదని చెప్తారు. ఈ భావికి ఎదురుగానే మసీదు వుంది - ఎదో టర్కీ దేశంలో వున్నాట్టు పొడవాటి మినార్లు అద్బుతంగా కనపడతాయి.
బయటికి వచ్చాక గుర్రపుబండ్లు ఎక్కి అలా ఆ వీధుల్లో తిరిగితే మనంకూడా ఏదో రాజ్యానికి నవాబులం అపోయినట్లుంటుంది.

0 వ్యాఖ్య(లు):
కామెంట్‌ను పోస్ట్ చేయండి