సరికొత్త సినిమా పజిల్..!!

తెలుగువారికి సినిమాకి జన్మ జన్మల బంధం వుందని నా నమ్మకం. సినిమా బాగాలేదంటే 'ఏం బాలేదో తెలుసుకుందామని' సినిమాలకెళ్ళేవాళ్ళు మనకు తెలుసు. 'పాపం అంతంత డబ్బులు పెట్టి సినిమా తీసి అది ఫ్లాపైతే మనలాంటి వారు టికెట్టు కొని చేతనైనంత సాహాయం చెయ్యొద్దూ..?' అంటూ సంజాయిషీ చెప్పుకునేవాళ్ళు మనకి బాగా తెలుసు.


సినిమాకి కథ అవసరం ఎక్కువా? హీరో అవసరం ఎక్కువా? డైరెక్టర్ అవసరం ఎక్కువా? అని చాలా చర్చలు వుంటే వుండచ్చుగాక.. కాని నా దృష్టిలో సినిమాకి అతి ముఖ్యమైంది పోస్టర్.. అందులో టైటిల్. ప్రతి సినిమాకి టైటిల్ ఒక ప్రత్యేకమైన ఫాంట్లో వుంటుంది. నగిషీలు చెక్కినట్లు అవి ఎంత బాగుండేవంటే - స్కూల్ రోజుల్లో వాటి నకళ్ళు గీయడానికే సోషల్ క్లాసులు వినియోగించేవాణ్ణి.

ఇదంతా మాకు తెలుసులేవోయ్ అంటారా? సరే అసలు సంగతి చెప్పేస్తా. విషయమేమిటంటే.. ఇదుగో క్రింద వున్న ఈ పజిల్.


పజిల్ చాలా సులభం.. క్రింద తెలుగు అక్షరమాలలో అచ్చులు వున్నాయి. ఒక్కొక్క అక్షరం ఒక్కొక సినిమా టైటిల్ నుంచి తీసుకోబడింది. ఆ సినిమా పేర్లు చెప్పుకోండి చూద్దాం...!!


7 వ్యాఖ్య(లు):

జీడిపప్పు చెప్పారు...

అ - అరుంధతి
ఇ - ఇడియట్
ఐ - ఐతే
ఒ - ఒక్కడు
ఔ - ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు
అం - అంకుశం

Unknown చెప్పారు...

jIDipappu,
3 correct answers.

aripirala

జ్యోతి చెప్పారు...

అ - అరుంధతి
ఆ - ఆమె
ఇ - ఇద్దరు
ఈ - ఈ అబ్బాయి చాలా మంచోడు
ఉ - ఉగాది
ఊ - ఊయల
ఐ - ఐతే
ఒ - ఒక్కడు
ఔ - ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు
అం - అంకురం

Unknown చెప్పారు...

జ్యోతిగారు,

మీకు మూడూ మార్కులే..!!

ఇద్దరి సమాధానంలోనూ సరైనవి అవే మూడూ:

అరుంధతి
ఐతే
ఔను వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు

అజ్ఞాత చెప్పారు...

ఆ-ఆవకాయ్ బిర్యాని
ఇ-ఇష్టం
ఉ-ఉల్లాసంగా ఉత్సాహంగా
అం- అందరి వాడు(?) నాకు తెలిసిన మిగిలిన మూడూ జ్యోతి, జీడిపప్పు గార్లు చెప్పారు. ఇవి కూడా తప్పే కావొచ్చులెండి. నాకంత సినిమా క్నాలెడ్జ్ లేదు.

Unknown చెప్పారు...

నీలాంచలా,

సినిమా నాలెడ్జ్ లేకపోయినా పోస్టర్ నాలెడ్జి వుంటే చాలుగా..!!

ఉల్లాసంగా ఉత్సాహంగా
అందరివాడు

సరైన జవాబులు

చైతన్య చెప్పారు...

అ - అరుంధతి
ఆ -
ఇ - కొంచం ఇష్టం కొంచం కష్టం
ఈ - అ ఆ ఇ ఈ
ఉ - ఉల్లాసంగా ఉత్సాహంగా
ఊఁ - ఒక ఊరిలో
ఎ - ఎవడైతే నాకేంటి
ఏ -
ఐ - ఐతే
ఒ - ఒంటరి / ఒక్కడు
ఓ -
ఔ - ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు
అం - అందరివాడు