మెర్సిడీస్ బెంజ్ మొదటి డీజిల్ కారు - జెర్మనీలో తయారు 1936



ఈ రెండు కార్లు 1938 క్యాడిలాక్ అమెరికా తయారి; మొదటిది రాజుగారిదైతే రెండొవది రాణీ గారిది.. రాణీ గారి కారులో పరదా అడ్డంగా వేసి వుంటుంది. రాణిగారు డ్రైవరుతో మైక్రోఫోనులో మాట్లాడేవారు. ఎప్పుడన్నా రాణీగారికి బండి నడపాలన్న ఆలోచన వస్తే డ్రైవరు సీటు ముందు వున్న అద్దానికి నీలం రంగు అద్దంతో పరదా వేసేవారు.


ఇక ఇవన్నీ రోల్స్‌రాయ్స్ కార్లు (1924-26).. రాజావారి వివాహ సమయంలో వరకట్నంగా వచ్చినవి..!! అందుకే కారుకు ఒక వైపు రాజావారి రాజ్య చిహ్నం మరోవైపు రాణీగారి రాజ్య చిహ్నం వుంటాయి..!!
ఇందులో మొదటిది పురాతన కార్ల పోటీలో ఉత్తమ కారుగా దేశం మొత్తంలో మొదటిస్థానంలో వచ్చింది.



బ్యిక్ సూపెర్ 8 సాల్లొన్


ఫోర్డ్ స్టాండర్డ్ ఫాంటొన్ (ఎలిజ్బెత్ మహారాణి ఉదయ్‌పూర్ వచ్చినప్పుడు వాడిన బండి)


మోరిస్ మైనర్

ఔటిన్ రంబ్లెర్ 1961

ఔటిన్ రంబ్లెర్ 1965

చెవ్రొలెట్ బస్ 1947 (దీన్ని స్కూల్ బస్‌గా వాడేవారు)

ఫోర్డ్ జీప్ 1942 (ఇది రాజా వారు వేటకి వెళ్ళినప్పుడు వాడే జీపు)
ఇక ఇవి రాజావారి సోలార్ వాహనాలు..
చిత్రమేమిటంటే ఇక్కడున్న కార్లన్నీ వాడకంలో వున్నవే.. దాదాపు అన్ని భాగాలు ఒరిజినల్..!! ఏదైనా రిపేర్లైతే ఇంగ్లాడు నుంచో జెర్మనీ నుంచో మనుషులు వచ్చి రిపేరు చేసి వెళ్తుంటారు. వారానికి ఒకసారి అన్ని కార్లు ఒక రౌండ్ వేస్తాయి..!! హోలి, దసరా వంటి సందర్భాలలో వీటిని వాడతారు.. అన్నట్టు కొందరు ప్రముఖుల పెళ్ళిళ్ళకీ వీటిని వాడటం జరిగింది.
3 వ్యాఖ్య(లు):
డబ్బున్న మారాజులు. ఎన్ని కార్లయినా పెట్టుకుంటారు. బావున్నాయి కార్లు.
సత్యప్రసాద్ గారూ, మీరు వ్రాసిన కవితను కామెంటు నుండి తొలగించి main post లో ప్రచురించాను. చక్కటి కవిత అందించినందుకు ధన్యవాదాలు.
udayapur rajula vaibhogam telisindi
కామెంట్‌ను పోస్ట్ చేయండి