వెలుగు గోడలు

ఎరుపు రంగు ఆకాశానికి పులిమి

సూర్యుడు అలసటగా కొండచాటుకి దిగిపోతాడు


అప్పుడు మా గుట్ట మీద కూర్చుంటే

ఎదురుగా వూరు పరుచుకున్న చిత్రపటంలా వుంటుంది

సాయంత్రం చలిగాలి మొదలౌతుంటే

గాలిపటాలతోపాటు వెలుగునీ లాకెళ్ళే పిల్లలు కనపడతారు


వూరి మధ్యలో వున్న గడియారం స్థంభం

చిన్నగా కొట్టే ఏడుగంటలకోసం కిక్కిరించి వింటుంటే

"అల్లాహో అక్బర్" అంటూ ఒక మూల మసీదు అరుస్తుంది

దానికి సమాధానమన్నట్టు మరో మైకు నుంచి

"అష్ హదు అన్ లా ఇలాహ ఇల్ అల్లాహ్".. అంటూ మరో మసీదు బదులు పలుకుతుంది

ఇంతలో వినాయాకుడి గుడిలో గంటలు, బాబా గుడిలో ఆరతులు మొదలుతాయి

ఇక్కడ్నించి చుస్తుంటే సెక్యులరిజం గొంతులో అన్నీ కలిసిపోయినట్టే వుంటాయి


అందరికన్నా ముందుగా వెలిగే వీధి దిపాలు

ముగ్గెయ్యడానికి ముందు చుక్కల్లా వుంటాయి

ఆ తరవాత ఒక్కొక్కటిగా ఇంటి దిపాలు వెలుగుతుంటే

మీణుగురు పురుగులు రెక్కలిప్పి లేస్తున్నట్టుంటుంది

ఇంకొంచెం చికటి పడగానే

రోడ్డెక్కిన బండ్లన్నీ

టర్చిలైటు పట్టుకున్న చీమల్లా పరుగెడుతాయి

వ్యాపారం విధుల్లో వ్యభిచారుల్లా

రంగు రంగు దిపాలు మిణుకు మిణుకు మంటూ కన్ను కొడతాయి..

మరో వైపు ఇరుకు ఇళ్ళలో లాంతరు దిపాలు బిక్కు బిక్కు మంటూ కంటనీరెడతాయి..

సరిగ్గా చూస్తే అప్పుడు మా వురి మీద

పేదా ధనిక మధ్య వెలుగు సరిహద్దులు పుట్టుకొస్తాయి


(నిన్న, (18.08.2009) నాహర్‌గఢ్ కోటపైనుంచి జైపూర్ నగరాన్ని చూస్తుంటేకలిగిన భావాలు..)
Category:

5 వ్యాఖ్య(లు):

వేమన చెప్పారు...

బావుందండీ !

Praveen Mandangi చెప్పారు...

>>>>>
అస్రదుల్లాహో... అల్లా.. అంటూ మరో మసీదు బదులు పలుకుతుంది
>>>>>
మీకు మరోలా వినిపించి ఉంటుంది. "అష్ హదు అన్ లా ఇలాహ ఇల్ అల్లాహ్" అని ఆజాన్ లో చదువుతారు. ఆ అరబ్ వచనానికి అర్థం "అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడు అని నేను ప్రవచిస్తున్నాను" అని.

Unknown చెప్పారు...

@ వేమనగారు,
నెనర్లు

@ ప్రవీణ్‌గారు,
సరి చేసాను. వివరం తెలిపినందుకు నెనర్లు.

భావన చెప్పారు...

చాలా బాగుందండి.. నాకు మీ అంత ఎత్తు మీద నుంచి కాదు కాని మా వూరి లోనే పొద్దుగూకుతున్న వేళ డాబా పైన కూర్చుని చూస్తూ వుంటే ఏదో భావం ఇది అని నిర్వచించలేనిది, ప్రపంచమంతా పరుగెడుతుంటే నేను నా నుంచే విడి పోయి ఒక ప్రేక్షకురాలి గా అంతటిని పరికిస్తున్నట్లు అనిపించేది, ఆ భావానికి మీరు అక్షర రూపమిచ్చారు. చాలా బాగుంది..
"సాయత్రం చలిగాలి మొదలౌతుంటే
గాలిపటాలతోపాటు వెలుగునీ లాకెళ్ళే పిల్లలు కనపడతారు
సరిగ్గా చూస్తే అప్పుడు మా వురి మీద
పేదా ధనిక మధ్య వెలుగు సరిహద్దులు పుట్టుకొస్తాయి" -- చాలా బాగున్నాయి.
కొంచం టైపోస్ చూసుకోరు........, అంటే అంత బాధేమి పెట్టటం లేదు.. పాయసం లో బాగా దంచని యాలుక గింజల్లే అంతే...

Praveen Mandangi చెప్పారు...

మేము కూడా జైపూర్ వెళ్ళాము. ఢిల్లీ నుంచి మౌంట్ ఆబూ వెళ్ళేటప్పుడు టాటా సుమోలో జైపూర్ మీదుగా ప్రయాణించాము.