మాయాబజార్ సినిమా క్విజ్..!!


ఆ మధ్య మాయాబజార్ రంగుల్లో వచ్చినప్పుడు మా అమ్మాయిని తీసుకెళ్ళాను (రెండున్నర సంవత్సరాల వయసు). అంత చిన్న పిల్లకు కథ అర్థం కాదేమోనని దగ్గర కూర్చోపెట్టుకోని చెప్పాలని ప్రయత్నిస్తే వద్దని వారించి తనే స్వయంగా చూసింది. పైగా విరామ సమయంలో పక్కన వున్నవారికి జరిగిన కథంతా వల్లె వేసి ఆశ్చర్యపరిచింది. మొత్తమ్మీద ఆ సినిమా మా అమ్మాయికి నచ్చింది.



నచ్చింది కదా అని మొన్న ఈ సినిమాతో పాటు పిల్లలకు నచ్చే సినిమాలు (అనుకుని) బాలభారతం, యశోదాకృష్ణ, లవకుశ, భక్తప్రహ్లాద వంటి సినిమాల సీడీలు కొనుక్కొచ్చాను. అన్ని సీడీలలో మాయాబజార్ సీడిని గుర్తుపట్టి (అన్నగార్ని, ఎస్వీఆర్‌ని), అదే పెట్టమంటూ మారాం చేసింది. "ఆహా ఎంత గొప్ప సినిమా.. యాభై సంవత్సరాల తరువాత కూడా ఈ తరానికి నచ్చడమే గొప్ప.." అనుకుంటూ ఆ సినిమా పెట్టాను. మా అమ్మాయేమో ఎంతో జ్ఞాపకం పెట్టుకోని.. ఇదుగో ఇప్పుడు శశి పాట పాడుతుంది.. ఘటోత్కచుడు మీసం మెలేస్తాడు.. ఆయన చేతులు అతుక్కుపోతాయి అంటూ ముందే చెప్పేస్తోంది. నేనూ సంతోషపడి నా ఫేస్‌బుక్‌లో కూడా వ్రాసుకున్నాను..!!



ఆ తరువాత మొదలయ్యాయి మా కష్టాలు -


ఇక రోజూ అదే సినిమా.. పగలు.. రాత్రి.. మళ్ళీ మళ్ళీ.. "ఇంక చాలమ్మా" అంటే వినదు.. ఇంతకు ముందే మాయాబజార్ సినిమా డైలాగులన్నీ నోటికి వచ్చనుకుంటున్న నాకు, ఇప్పుడు నేపధ్య సంగీతం కూడా నోటికి వచ్చేసే పరిస్థితి.. మా అమ్మాయి ఇప్పటికే మాటలు పాటలు నేర్చేసుకుంటోంది..


సరే ఏది ఏమైనా ఇన్ని సార్లు మాయాబజార్ చూడటం కూడా ఒక అనుభవమే - సెట్టింగుల దగ్గర్నుంచి, ఆహార్యం వరకు, కెమెరా సంగతులు, జూనియర్ ఆర్టిస్టుల నటన దాకా గమనించే అవకాశం కలిగింది. ఆ చిత్రం పైన, ఆ దర్శకాది సాంకేతిక నిపుణులపైనా గౌరవం పెరిగింది. ఆ అనుభవంతో ఇదుగో ఈ క్విజ్.. ప్రయత్నించండి -


1. తానశర్మ తందానశాస్త్రి పెట్టిన ముహూర్తం "దగ్ధయోగం"లో వుందని, బలరాముడి ఆస్థాన పురోహితులు వారిస్తారు. (తరువాత శశిరేఖాభిమన్యుల పెళ్ళి అదే ముహూర్తానికి జరుగుతుందనుకోండి అది వేరే విషయం). ఆ వారించిన పురోహితుడి పేరేమిటి?

2. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయనం చేసిన నటుడెవ్వరు?

3. తానశర్మ, తందాన శాస్త్రి విడిదిలో కొన్ని రకాల భ్రాంతులకు లోనౌతారు. అవేమిటి?

4. శకునిమామను ఈ చిత్రంలో నలుగురు వ్యక్తులు పందెం వెయ్యమని అడుగుతారు. చిత్రంగా అందరూ రెండు వెయ్యమంటారు. ఒక్కరు తప్ప. పందెం అడిగేదెవ్వరు? రెండు కాకుండా వేరే పందెం అడిగేదెవ్వరు?

5. శాకంబరీదేవి ప్రసాదం ఏమిటి?

6. సుభద్రాభిమన్యులను రథంపై ద్వారక నుంచి ఘటోత్కచుని ఆశ్రమానికి చేర్చే సారథి ఎవరు?

7. శశిరేఖ ఇష్ట సఖి పేరేమిటి?

8. అడవిలో సుభద్రాభిమన్యులను గోడకట్టి అడ్డుకునే రాక్షసుడి పేరేమిటి?

9. సుభద్రాభిమన్యులను అడవిలో ఘటోత్కచుడి రాక్షసులు ఎదుర్కునేటప్పుడు నేపధ్య సంగీతం ఏమిటి?

10. ఘటోత్కచుడి ఆశ్రమంలో దీవించడానికి వాడే పదం ఏమిటి?



మీ సమాధానాలు వ్యాఖ్య పెట్టండి.. నా సమాధానాలు రేపటి టపాలో)

9 వ్యాఖ్య(లు):

mmkodihalli చెప్పారు...

1.SanKutiarthulu
2.N.T.R(?)
4.duryOdhanuDu, duSSAsanuDu, karNuDu mariyu mAyASaSirEKa. vearea pandem (okaTi)aDigindi duryOdhanuDu.
5.gOngUra
6.dArukuDu(mAdhavapeddi satyam)
7.mainaa
9.pO...pO...venakki pO...
10.alamalam

సుభద్ర చెప్పారు...

satyaprasad gaaru,

నాకు గర్వభ౦గ౦ జరిగి౦ది..
మాయబజర్ నాను కొట్టినపి౦డి అనుకు౦టూ వచ్చా ...మూడు వ౦తులు తెలియవు..
తెలిసిన ఒక వ౦తు ప్రక్క కాదు...
నేను మళ్ళి సినిమా చూసి మీకు జవాబు రాస్తాను...

subhadra vedula చెప్పారు...

1. శంఖుతీర్థులవారు
2. కమెడియన్ బాలకృష్ణ
3. ఛిత్తభ్రాంథి
4. దుర్యోధనుడు, దుశ్శాశనుడు, కర్ణుడు, మాయా శశిరేఖ. ముందు ఒకటి అడిగి తరవాత రెండు అడిగేది దుర్యోధనుడు.
5. గోంగూర
6. దారుకుడు
7. మైనా
8. కుడ్యాసురుడు
9. పో పో.. వెనక్కి పో.. మరలిపో
10. అలమలం

subhadra vedula చెప్పారు...

1. శంఖుతీర్థులవారు
2. కమెడియన్ బాలకృష్ణ
3. ఛిత్తభ్రాంతి
4. దుర్యోధనుడు, దుశ్శాశనుడు, కర్ణుడు, మాయా శశిరేఖ. ముందు ఒకటి అడిగి తరవాత రెండు అడిగేది దుర్యోధనుడు.
5. గోంగూర
6. దారుకుడు
7. మైనా
8. కుడ్యాసురుడు
9. పో పో.. వెనక్కి పో.. మరలిపో
10. అలమలం

karthik చెప్పారు...

కమెడియన్ బాలకృష్ణ double action??? how??? plz explain..

-Karthik

subhadra vedula చెప్పారు...

@karthik garu.
Balakrishna plays the roles of saradhi and dwarapalaka as far as I know. Please confirm the same.

Unknown చెప్పారు...

@ కోడీహళ్ళి మురళీ మోహన్ గారు: 6/10
@ సుభద్రగారు: 8/10
మూడొవ ప్రశ్న: "కొన్ని రకాల భ్రాంతులు".. బహువచనం సుమండీ..!!
తొమ్మిదొవ ప్రశ్న: కొంచెం జాగర్తగా వినాలి..
బాలకృష్ణ ద్విపాత్రాభినయం సరైన జవాబే.

అజ్ఞాత చెప్పారు...

2 - I think the balakrishna double action is misconception. The actor who does dvarapalaka and obstructs Ghatotkach - his face is not clear.

9 - కోరు కోర్ శరణుకోర్

Your q 3 is not very clear - do you want a list of incidents that confuse them?
Their dialog goes something like this:
మనఃభ్రాంతి
మన@భ్రాంతికి కారణం
పైత్యప్రకోపంలో ఒక లక్షణం

Unknown చెప్పారు...

బాలకృష్ణ ద్విపాత్రాభినయనం గతంలో ఎక్కడో చదివిన గుర్తు..
మూడో ప్రశ్నకి జవాబు - మనఃభ్రాంతి, లోభ్రాంతి, సమాధి భ్రాంతి.. ఇప్పుడు ప్రశ్న స్పష్టమేనా అజ్ఞాతా..