మొపాస కథలు: ఆమె చెప్పని రహస్యం

బాధా లేకుండా చనిపోయిందామె. మచ్చ లేని జీవితం గడిపిని స్త్రీగా లోకాన్ని విడిచిపెట్టింది. పరుపు మీద భావం లేని ముఖంతో, మూత బడ్డ కళ్ళతో స్థిరంగా పడుకోని వుందామే. ఆమె జుట్టు చనిపోయే ముందే దువ్వి అలంకరించినంతగా కుదురుగా వుంది. ఆమె ప్రశాంతమైన ముఖాన్ని చూసిన ఎవరికైనా ఒక గొప్ప జీవి శరీరంలో వుందన్న భావన రాక మానదు. తల్లి ఏంతో స్వచ్చమైన మరణాన్ని పొందిందని అర్థం అవుతోంది.

ఆమె శవం పక్కనే ఆమె పెద్ద కొడుకు మోకరించి కూర్చున్నాడు. ధర్మాన్ని నమ్ముకున్న మెజిస్ట్రేట్గా అతను అండరికీ తెలుసు. మరో పక్క దేవుడి సేవకి అంకితమై నన్ జీవితాన్ని గడుపుతున్న కూతురు గుండెలు పగిలేలా రోదిస్తోంది. చిన్నప్పటి ఇద్దరిలో దైవభక్తి పెంపొందేలా పెంచిందా ఇల్లాలు. మతం గురించి నేర్పింది కానీ మూఢత్వాన్ని నేర్పలేదు. బాధ్యతలు నేర్పింది కానీ బాఢ్యతా రాహిత్యాన్ని నేర్పలేదు. కొడుకు లా చదివి న్యాయాన్ని ఆయిధంగా చేఉసుకోని ఎందరో నేరస్థులకు సిక్ష విధించే జడ్జిగా ఎదిగాడు. కూతురు శోత్రీయమైన పెంపకంలో పెరిగి భగవంటుడికి చేరువవ్వాలని, వివాహాన్ని కాదని సేవకే జీవితాన్ని అంకితం చేసింది.

ఇద్దరికీ తండ్రి ఎవరో తెలియదు. తల్లి దుఖానికి కారణం తండ్రే అని మాత్రం తెలుసు. అంతకన్నా వివరాలు వాళ్ళు తెలుసుకోలేదు. వారికి తల్లి చెప్పలేదు.

నన్ దుస్తుల్లో వున్న కూతురు ఆమె తెల్లటి చేతిని పదే పదే ముద్దులు పెడుతోంది. పక్కనే వున్న ఏనుగు దంతంతో చేఇసిన శిలువ గుర్తు అంట తెల్లగా వున్నదా చెయ్యి. మరో పక్క వున్న రెండో చేయి మంచం మీద పరిచివున్న గుడ్డని గట్టిగా పిడికిట్లొ బంఢించి వుంది. ఆమే దైవలోకానికి చేయబోతున్న యాత్రకి ఆఖరి గుర్తులా గుడ్డ ఇంకా నలిగే వుంది.

ఎవరో గది తలుపులను రెండు సార్లు కొట్టి లోపలికి ప్రవేసించారు. వాళ్ళిద్దరూ తలెత్తి చూస్తే చర్చి నుంచి వచ్చిన ప్రీస్ట్ కనిపింఛాడు. చూడాబోతే ఆయన రాత్రి భోజనం కానిచ్చుకోని వచ్చినట్లున్నాడు. తిన్నది అరగక ఆయాసపడుతుండాటం వల్లేమో ముఖం ఎర్రగా వుంది. గత రెండు రాత్రులుగా ఇలాంటి కార్యక్రమాలే నిర్వహించి అతనికి నిద్ర లేక అలిసిపోయి వున్నాడు. మళ్ళీ శావజాగారం తప్పదని మంఛి స్ట్రాంగ్ కాఫీ తాగి మరీ వచ్చినట్లున్నాడు.

అతని ముఖంలో కూడా విషదం వుండి. అయితే అతని వృత్తి పరంగా అలవాటైన ముఖాన్నే పెట్టాడు. చావు బాధకరమైతే కావచ్చు కానీ అతనికి అదే జీవినాధారం కదా. చేతిని గుడె మీద శిలువ గుర్తులో తిప్పుతూ, నెమ్మదిగా ముందుకు నడిచాడు.
"
బిడ్డలారా... ఆమె ఆఖరి యాత్రకి సంబంధించిన విషాదంలో మీతోపాటు పాలుపంచుకోడానికే వచ్చాను.." అన్నాడు. సిస్టర్గా వున్న కూతురు వెంటానే సమాధానం చెప్పింది.

"
మీకు ధన్యవాదాలు ఫాదర్... కానీ మేము ఆమెతో ఒంటరిగా గడపాలని అనుకుంటున్నాము. ఆమెను చూసుకునేందుకు ఇదే ఆఖరి అవకాశం కదా.. మేము కలిసి వుండేందుకూ కూడా ఇదే ఆఖరిసారి కదా... మేము ముగ్గురం మళ్ళీ మా చిన్నతనంలోలా, పేదవాళ్ళగా వున్నప్ప్టిలా మళ్ళీ అమ్మతో కలిసి... వుండాలనుకుంటున్నాము. అమ్మతో... మా అమ్మతో..." బాధ కన్నీళ్ళు ఆమె మాటలకు అడ్డుకట్టా వేశాయి. పైన మాట్లడాలేకపోయింది.

ఫాదర్ తలాడించి ముందుకు వంగి అభివాదం చేశాడు. "మీరు ఎలా చెప్తే అలాగే నాయనా.." అన్నాడు. తరువాత మోకరిల్లి, శిలువ గుర్తును సూచిస్తూ భుజాలను తాకి, ప్రార్థించి బయటికి కదిలాడు. "దేవతలాంటి తల్లి వెళ్ళిపోయింది" అనుకున్నాడు తనలో తానే బాఢగా. గదిలో వాళ్ళు ముగ్గురే మిగిలారు. చనిపోయిన తల్లి, ఆమె ఇద్దరు పిల్లలు. ఎక్కడో చీకట్లో వున్న గోడాగడియారం చప్పుడు మాత్రమే స్పష్టంగా వునపడుతూ వుండి. గాలికి తెరుచుకున్న కిటికోలోనుంచి మెత్తటి వెన్నల, దానితో పాటే పచ్చి చెట్ల పరిమళం గదిలోకి ప్రవేసించింది. అడపదడపా ఎక్కడో కప్పలు చేస్తున్న చప్పుడు, కీచురాళ్ళు ఉండుంది అరుస్తున్న శాబ్దము తప్ప ఇంకేమీ వినపడటం లేదు. నిశబ్దంలోనే అంతులేని శాంతి, అనిర్వచనీయమైన విషాదం, ప్రశాంటమైన వాతావరణం ఆమె చుట్టూ పరుచుకున్నాయి. ఆమె తుదు శ్వాసని కలుపుకున్న ప్రకౄతిలోకే కలిసిపోయినట్లుగా వుందామె.

జడ్జిగారైన కొడుకు ఇంకా మోకాళ్ళామీదే వున్నాడు. అతని తలని తల్లి పడుకోని వున్న పరుపులోకి ముఖం పెట్టి, బాధతో అలసటతో బొంగురుపోయిన గొంతుతో "అమ్మా అమ్మా" అంటూ ఏడుస్తున్నాదు. ఆమె కూతురు అంతులేని విషాదం ముప్పిరిగొనగా ఏం చేస్తోందో తెలియని ఆవేశంతో తలని మంచం పట్టీకి కొట్టుకుంటూ, అరుస్తూ "ప్రభువా... అమ్మని తీసుకెళ్ళిపోయావా? ఇప్పుడేం చేసిది భగవంతుడా..." అంటూ ఏడుస్టోంది. విషాదానికి ఇద్దరూ కదిలిపోయి, కరిగిపోయి ఏడ్చి ఏడ్చి పెద్ద పెద్దగా శ్వాస తీసుకుంటూ, ఇక ఏడవలేక గొంతుకు ఏదో అడ్డాం పడినట్లు ఆగిపోయారు.

కొంట సేపటికి సేదతీరారు. బాధ మత్రం తగ్గలేదు. నిశబ్దంగానే విలపిస్తూ, తుఫాను తరువట సముద్రంలా వుండిపొయారు. మరికొంట సమయం గడిచిన తరువాత ఇద్దరూ లేచి తల్లి శవం వైపు చూశారు. ఒక్కసారిగా ఆమె జ్ఞాపకాలు ఇద్దరినీ వుట్టుముట్టాయి. నిన్నటిదాకా ఎంతో ఆహ్లాదకరమైన జ్ఞాపకాలు ఇప్పుడు విషాదాలుగా పరిణమించాయి. చిన్న చిన్న సంఘటనలు కూడా కళ్ళాముందు జరిగుతున్నంత స్పష్టంగా జ్ఞప్తికి వచ్చాయి. విధంగా చనిపోయిన తల్లి వాళ్ళాకి ఊహల్లో సజీవంగా కంపించింది. ఆమె సంతోషంగా ఉల్లాసంగా కనిపించింది. ఆమె చిన్న చిన్న కదలికలు కూడా కనిపించాయి. ముఖ్యంగా ఏదైనా గట్టిగా చెప్పాల్సి వస్తే ఆమె బల్ల గుద్ది మరీ చెప్పడం కళ్ళ ముందు జరిగినట్లే కనపడింది.

అంటవరకూ తల్లి మీద వున్న మమకారం ఒక్కసారిగా రెట్టింపు అయ్యింది. వారి విషాదాన్ని వారే కొలుచుకోవటంతో, ఆమె లొటు వాళ్ళని ఎంత ఒంటరివాళ్ళాను చేశ్తుందో అర్థం అయ్యి కుమిలిపోయారు. వాళ్ళా ఆట బొమ్మ, వాళ్ళ గురువు, వాళ్ళ మార్గదర్శి అన్నీ ఒక్కసారిగా మాయమైపోయిన సంగతి అర్థం అయిపోయింది. వాళ్ళ బాల్య కౌమారాల జ్ఞాపకాలలో ఆనందం ఇగిరిపోయినట్లు అనిపించింది.
వాళ్ళా తల్లి... వాళ్ళా అమ్మ... వాళ్ళాకి వాళ్ళ జీవితానికి అనుబంధాల వారధి. వారథి ఇప్పుడు కూలిపోయింది. తమ తండ్రితోటి, తాత ముత్తాతలతోటీ, తమ వంశానికి సంబధం కలిపే గొలుసులో లంకె తెగిపోయింది. తండ్రి ఎవరో చెప్పకుండానే తల్లి వెళ్ళిపోయింది కాబట్టి ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమే లేదు. ఇప్పుడు వాళ్ళిద్దరూ అనాథలైపోయారు.

ఇద్దరిలో ఆడపిల్లకి ఏదో స్ఫురించింది.-

"అన్నయ్యా నీకు గుర్తుందా? అమ్మ ఎప్పుడూ ఏవో పాత ఉత్తరాలు చదువుతూ ఉండేది. బల్ల సొరుగులో వున్నాయవి. మనం అవి తీశి చదువుదామా? ఆమె కోసం చదువుదాం. ఆమె జీవితాన్ని మన మాటలద్వారా మళ్ళీ జీవించే అవకాశం ఆఖరుసారిగా అమ్మకి ఇద్దాం. ప్రభువుని కలిసే దారిలో వున్న అమ్మకి ఆమె నడిచి వచ్చిన దారిని మళ్ళీ గుర్తు చేద్దాం. మనకి కూడా ఆమెను గురించి, మన తాతలు తండ్రుల గురించి తెలుసుకునే అవకాశం వస్తుంది. అమ్మ చెప్పేది కదా వాళ్ళా ఉత్తరాలు ఆమె దగ్గర వున్నాయని.." అంది ఆమె.

బల్ల సొరుగులో నుంచి పసుపు పచ్చని రంగులో వున్న పది కాగితాల కట్టలను బయటికి తీశారు ఇద్దరూ. ఎంతో అందంగా పేర్చి, దారంతో కట్టి వున్నాయవి. వాటన్నింటినీ తెచ్చి తల్లి పడుకోని వున్న మంచం మీదే వేశి - "మీ నాన్న" అని వ్రాసి వున్న కట్టను తెరిచి ఒక్కొక్క వుత్తరం చదవటం ప్రారంభించారు.

పాతకాలం నాతి ఉత్తరాలు ఎలా వుంటాయో అలాగే వుందది. వేరే శతాబ్దం తాలూకు సువాసనలేవో కాగితం నుంచీ వస్తున్నాయి. మొదటి ఉత్తరం తెరిచింది.
"ప్రియా" అంటూ మొదలైందది. మరో దాంట్లొ "నా అందమైన పిల్లకి" అని వుంది. "నా ముద్దుల అమ్మాయికి" అని మరోదాంట్లో, ఇంకో దాంట్లో "నా చిరునవ్వుల దేవికి" అనీ వుంది. అవన్నీ చూసిన కూతురు బిగ్గరగా చదవటం మొదలుపెట్టింది. పువ్వుల్లాంటి జ్ఞాపకాల్ని చనిపోయిన తల్లిపై కురిపించాలని అమ్మాయి ఆశ.

కొడుకు మాత్రం మోచేతిని మంచం మీదే వుంచి, తల్లినే స్థిరంగా చూస్తూ వింటున్నాడు. కదలకుండా వున్న తల్లి శరీరంలో సంతోషం కనపడుతోంది.

చదువుతున్న అమ్మాయి మధ్యలో ఆపి అన్నది - "ఇవన్నీ అమ్మతో పాటే సమాధి చేద్దాం అన్నయ్యా... ఆమె కి ఇష్టమైనవి ఆమెతోనే వుండనిద్దాం." అంటూ మరో ఉత్తరాల కట్టా అండుకుంది. దాని మీద ఎవరిపేరు రాసిలేదు. ఒక్కొక్కటే తెరిచి చదవటం మొదలుపెట్టింది.

"
నా ప్రియతమా. నేను నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాను. నిన్నటి నుంచి నీ జ్ఞాపకాలు బాణాల్లా గుచ్చి బాధపెడుతున్నాయి. నన్ను వెంటాడుతున్నాయి. నా పెదవులపైన నీ పెదవుల స్పర్శ, నా కళ్ళను తాకిన నీ చూపు స్పర్శ, నా గుండెలపైన వాలిన నీ మేని స్పర్శ ఇంకా అనుభవిస్తునట్లే వుంది. నేను ప్రేమలో మునిగిపోయాను. నీ ప్రేమలో మునిగిపోయాను. పిచ్చివాణ్ణి చేశేశావు నువ్వు. నిన్ను మళ్ళీ నా గుండెలకి హత్తుకోవాలన్ని కాక్షతో చేతులు చాచి నిలబడి వున్నాను. నా మనసు, శరీరం అన్నీ నువ్వు కావాలని కోరుకుంటున్నాయి. నువ్వు పెట్టిన ముద్దుల రుచి నా పెదవులపైన శాశ్వతంగా నిలుపుకోమని వేడుకుంటున్నాయి..."

జడ్జి కొడుకు లేచి నిలబడ్డాడు. నన్ కూతురు చదవటం ఆపేసింది. వుత్తరాన్ని కొడుకు లాక్కొని కింద సంతకం కోసం చూశాడు. సంతకం లేదు. "నీ ప్రేమలో పరితపించే" అని రాసుంది. కింద పేరు - "హెన్రీ" అని. వాళ్ళా తండ్రిపేరు అది కాదని వాళ్ళకి తెలుసు. వాళ్ళ తండ్రి పేరు "రేనే". అంటే ఉత్తరం..??

కొడుకు ముందుకు వంగి అక్కడ వున్న ఉత్తరాలలో నుంచి మరొకటి తీసి చూశాడు. "నీ అనురాగాం లేని జీవితం నాకు వద్దు". స్థిరంగా గడకర్రలా నిలబడ్డాడు కొడుకు. చనిపోయిన తల్లి వైపు చూశాడు. కూతురు కూడా శిలాప్రతిమా నిలబడ్డది. అన్నయ్యను తల్లినీ మార్చి మార్చి చూశ్తుంటే ఆమె కళ్ళాలో నుంచి కన్నీళ్ళు ఉబికి వస్తున్నాయి. ఆయినా సంభాళించుకుంది. అతను అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి తెరిచి వున్న కిటికీ దగ్గర నిలబడి చీకట్లోకి చూశాడు.

చాలాసేపటి తరువాత వెనక్కి తిరిగి చూశాడతను. చెల్లెలి కళ్ళలో తడిలేదు. తల్లి శవం దగ్గరే నిలబడి తల దించుకోని నేల వైపు చూస్తూ వుంది. అతను ముందుకు నడిచి త్వరత్వరగా మంచం మీద వున్న కాగితాలన్నీ ఏరాడు. వాటిననంటిని బల్ల సొరుగులోకి కుక్కి మూశేశాడు. తరువాత వచ్చి మంచం చుట్టూ వున్న దోమతెరని దించేశాడు.

అప్పుడే తెలవారుతూ ఇంట్లోకి ప్రవేశించిన వెలుగు, వెలుగుతున్న కొవ్వొత్తి వెలుగును వెక్కిరించింది. కొడుకు లేచి బయటికి అడుగులేశాడు. "ఇక వెళ్దామా చెల్లెమ్మా" అన్నాడు.

జడ్జిగారైన ఆ కొడుకు, తల్లి పిల్లల సంబంధానికి మరణశిక్ష వేసినట్లుగా వుందా మాట.

ఫ్రెంచ్ మూలం: గి ద మొపాస
మూల కథ: డెడ్ వుమెన్స్ సీక్రెట్ (Dead woman’s secret)