జీడిపప్పుగారి బ్లాగులో నా కవిత - "మానవత్వపు ప్రతీక"


మానవత్వపు ప్రతీక




ఈ ఆటో -

అమ్మతనానికి ఒక అడుగు ముందుంటుంది

మాతృత్వాన్ని వరంగా ఇస్తుంది

ఈ ఆటో పుణ్యమా అని

ఎందరో అమ్మలు పుట్టారు


తొమ్మిదినెలలు స్వప్నించిన మధురక్షణం

మరణమా? మనుగడా? అని ప్రశ్నిస్తే

ఇతని ఫోను మోగుతుంది

అంతే -

పుట్టుకకు మరణానికి మధ్య

తన ఆటో అడ్డం పెట్టేస్తాడు


తండ్రిలా చేరదీసి

అన్నలా ఆదరించి

అమ్మగా బతకమని ఆశీర్వదిస్తాడు


ఆశకు మూడు చక్రాలు తొడిగి

ఆశయమనే ఇంధనం కలిపాడేమో

ఈ నగరారణ్యంలో

ఎన్నో పసి నవ్వుల పువ్వుల పూయించాడు


ఇప్పుడు ప్రసవ వేదనంటే

జీవితానికి మరణానికి మధ్య ప్రశ్న కాదు

జీవం పోసే మంచితనానికి

మానవత్వపు ప్రతీక..!



(జీడిపప్పుగారు తన బ్లాగులో "ఆటో ప్రకాష్" గురించి చెప్పి, ఆ విషయం పై బొల్లోజుబాబాగారు, ఆత్రేయగారు రాసిన కవితలు వుంచారు. ఆ వార్త చదివి నేను వ్యాఖ్యగా రాసిన ఈ కవితను సహృదయంతో వారి బ్లాగులో పెట్టారు. )
Category:

1 వ్యాఖ్య(లు):

Padmarpita చెప్పారు...

బాగుందండి మీ స్పందన.