రోడ్డు పక్క ఒక ముసలిది పడి ఉంది..
అందరూ చూస్తున్నారు,అందరూ తప్పుకుంటున్నారు!
ఎండలు మెండుగా ఉన్నా, తగ్గలేదు జనసందోహం!
ఎండిన ఖర్జోరంలా పండిన శరీరంతో..
పాపం కదలలేక ముసలి కష్టం మీద మూలుగుతోంది
ఏ పాపం తెలియని అవిటి మనమరాలు వెక్కి వెక్కి ఏడుస్తోంది
వళ్ళంతా గాయాలతో.. వంటినిండా రోగాలతో
కళ్ళకు శుక్లాలతో.. చలనం లేని కాళ్ళతో..
దాహం దాహం దాహం అంటూ దీనంగా అడుగుతోంది
అడిగి అడిగి నోరు మూగవోయింది గానీ,
ఏ ఒక్కరి అడుగులు ఇటు పడలేదు
కనికరం లేని హృదయాలు కర్కశంగా సాగిపోతున్నాయి
మృత్యువుతో పోరాటం సాగించిన ముసలిది
అందరూ చూస్తుండగానే 'వీర మరణం ' పొందింది
ఒక దీపం ఆరిపోయింది...
ఒక ప్రాణం సాగిపొయింది
అవిటి మనుమరాలు అనాధ అయిపోయింది
పాపం! మానవత్వానికి పరువు పోయింది
4 వ్యాఖ్య(లు):
స్పందనలే కరువై రోజురోజుకూ బండబారిపోతున్నాం మనం
now a days no one is boss of his own life.he cant stop though he wnted to do that.
@ విజయమోహన్ గారికి,
మీ మాట వాస్తవం. ప్రేమ, జాలి వంటి గుణాలు అరుదైపోయాయి..
@ అనామకులకి (Anonymous కి ఇదే నా సరైన తర్జుమా?)
ప్రతి మనిషికి వారి వారి సంస్కారాన్ననుసరించి కొన్ని విలువలుంటాయి (values). వాస్తవ ప్రపంచంలో కొన్ని పరిమితులుంటాయి (limitations). పరిమితుల్ని అధిగమించి విలువల్ని కాపాడుకున్నవాళ్ళే గాంధి, థెరీసా..
నేను చూసిన ప్రపంచంలో దయ, జాలి అరుదైపోలేదు. జనంలో ఈ గుణాలు పెరుగుతున్నాయని నాకు అనిపిస్తూ వుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి