చిత్ర మాస పత్రికలో నా సీరియల్ వ్యాసాలు ప్రారంభంప్రముఖ మాస పత్రిక "చిత్ర" లో నా సీరియల్ వ్యాసాలు ఈ నెల (ఏప్రిల్ 2011) నుండి ప్రారంభమయ్యాయి. మొట్టమొదటి ఛాయాచిత్రం నుంచి ఈ రోజు మనం చూస్తున్న సాంకేతిక అభివృద్ధి చెందిన సినిమాల దాకా ప్రపంచ సినిమా ప్రస్థానాన్ని సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నం ఈ వ్యాసాలలో వుంటుంది.
ఈ నెల వ్యాసం "చిత్రం చలనమైన వేళ" లో "ఛాయాచిత్రం" నుంచి "చలన చిత్రం" ఎలా పుట్టింది? మొదటి చలనచిత్రం ఏది? అనే విషయాలు ప్రస్తావించాను. చదివి మీ అభిప్రాయం తప్పక చెప్పండి.

ఆదివారం ఆంధ్రజ్యోతిలో నా కథ - "ఊహాచిత్రం"

ఈ రోజు ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో నా కథ "ఊహాచిత్రం" ప్రకటించారు. సర్రియల్ తరహా శైలిలో వ్రాసిన ఈ కథని చదివి మీ అభిప్రాయం తెలియజేస్తారు కదూ..!!

ఇదీ లంకె: ఊహాచిత్రం