ప్రకటన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ప్రకటన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

రూపాయి చెప్పిన బేతాళ కథలు


లోకమంతా లక్ష్మీ కటాక్షం కోరుకుంటుంది. లక్ష్మీదేవి కరుణిస్తే ఉద్యోగులకి జీతం రూపంలో, కష్టజీవులకి కూలీ రూపంలో, వ్యాపారులకి లాభం రూపంలో సంపాదన లభిస్తుంది. కానీ ఆ సంపాదనను సంపదగా మార్చుకునే రహస్యం తెలియక చాలా మంది ధనవంతులుగా మారలేకపోతున్నారు. ఈ రహస్యం తెలిసిన మానవుడు ఎవరైనా వున్నారా అని సంపదకి అధిపతి అయిన కుబేరుడికి అనుమానం వచ్చింది. ఆ అనుమానం తీర్చుకోడానికే "రూపీ బేతాళుణ్ణి" పిలిపించాడు. ఒక ఏటీయంలో వున్న డబ్బులో ఆ బేతాళుణ్ణి నిక్షిప్తం చేశాడు.
***
ధనవంతుడు కావాలన్న కోరికతో ఎంతో కష్టపడుతున్నాడు ఓ మధ్య తరగతి విక్రమార్కుడు. ఎప్పటిలా ఏటీయం వద్దకు వెళ్ళి డబ్బులు డ్రా చేసి మౌనంగా సంపద సాధించే లక్ష్యం వైపు సాగిపోతున్నాడు. అప్పుడు ఆ డబ్బులో వున్న (రూపీ) బేతాళుడు (మధ్యతరగతి) విక్రమార్కుడితో సంభాషణ మొదలుపెట్టాడు. సంపద రహస్యాలను కథల రూపంలో చెప్పడం మొదలుపెట్టాడు. కథ చివరిలో ప్రశ్న వేస్తాడు. విక్రమార్కుడు సరైన సమాధానం చెప్తే తిరిగి ఏటీయంలో దూరుతాడు.
***
ఇదీ స్థూలంగా నేను రాస్తున్న "రూపాయి చెప్పిన బేతాళ కథల" వెనుక కథ. ఈ రోజు విడుదలైన ఆంధ్రభూమి వారపత్రిక సంచికలో ప్రారంభమవుతున్న ఈ కథలను మీరంతా చదివి ఆదరిస్తారని నమ్ముతున్నాను. మీ సూచనలు, సలహాలు, అనుమానాలు, అభ్యంతరాలు తప్పకుండా తెలియజేస్తారు కదూ....
భవదీయుడు
ఈ కథల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోడానికి ఈ బ్లాగుని సందర్శించండి: http://rupeebethal.blogspot.in/

ఆహ్వానం: "ఊహాచిత్రం" నా కథల సంకలనం ఆవిష్కరణ

సాహితీమిత్రులకు ఇదే ఆహ్వానం -


లామకాన్ చేరాలంటే - 
బంజారాహిల్స్ రోడ్ నెం. 1, లో వెళ్తుండగా జీవీకే మాల్ దగ్గర (బంజారాహిల్స్ పోస్టాఫీస్ ఎదురుగా వున్న) "U" టర్న్ తీసుకోని ఎడమ చేతి వైపు C-Bay పక్కగా వున్న చిన్న గల్లీ లామకాన్ చేరుస్తుంది.

ఇది ముఖచిత్రం - 



వస్తారు కదూ...

స్వప్న హాస్య కథల పోటీలో నా కథకి బహుమతి



స్వప్న మాసపత్రిక జన్మదినసంచిక హాస్య కథలపోటీ ఫలితాలు ఆగస్టు సంచికలో ప్రకటించారు. అందులో నా కథ “మంత్రిగారి సమాధి” కి మొదటి బహుమతి (పి.ఎస్.ఆర్. కృష్ణమూర్తి పురస్కారం) లభించింది. కథ చదివి మీ అభిప్రాయం చెప్తారు కదూ..!!

హంసినిలో నా కథ

గతంలో హంసిని అంతర్జాల పత్రిక నిర్వహించిన ఉగాది కథలపోటీలో ప్రశంసా పత్రానికి ఎన్నికైన నా కథ "బహిష్కృత" ఈ మాసం ప్రకటించారు. ఆ కథకి లింకు ఇక్కడ.


ఈ కథ దాదాపు దశాబ్దం క్రితం అప్పట్లో జరిగిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగా వ్రాసాను. చదివి మీ అభిప్రాయం చెప్పండి..!!

"సంపుటి"లో బహుమతి పొందిన నా కథ - "అలిగితివా సఖీ ప్రియా"



ప్రముఖ అంతర్జాల పత్రిక "సంపుటి" లో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన కథల పోటీలో నా కథ "అలిగితివా సఖీ ప్రియా" కు తృతీయ బహుమతి ప్రకటించారు. ఆ కథ ఈ మాసం (ఉగాది ప్రత్యేక) సంచికలో ప్రచురించారు. ఆ సంచికకు లంకె ఇక్కడ - "అలిగితివా సఖీ ప్రియా". కథ చదివి మీ అభిప్రాయం చెప్తారని ఆశిస్తాను..

పొద్దులో బహుమతి పొందిన నా కథ - "కలసివచ్చిన ఇల్లు"

శ్రీ ఖర నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రముఖ అంతర్జాల పత్రిక "పొద్దు" నిర్వహించిన "కథా వసంతం కథలపోటీ"లో నా కథ "కలసివచ్చిన ఇల్లు" కు మూడొవ బహుమతి ప్రకటించారు. ఆ కథను ఈ క్రింది లింకులో చదవి మీ అభిప్రాయం చెప్పండి..


కలసివచ్చిన ఇల్లు

చిత్ర మాస పత్రికలో నా సీరియల్ వ్యాసాలు ప్రారంభం



ప్రముఖ మాస పత్రిక "చిత్ర" లో నా సీరియల్ వ్యాసాలు ఈ నెల (ఏప్రిల్ 2011) నుండి ప్రారంభమయ్యాయి. మొట్టమొదటి ఛాయాచిత్రం నుంచి ఈ రోజు మనం చూస్తున్న సాంకేతిక అభివృద్ధి చెందిన సినిమాల దాకా ప్రపంచ సినిమా ప్రస్థానాన్ని సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నం ఈ వ్యాసాలలో వుంటుంది.




ఈ నెల వ్యాసం "చిత్రం చలనమైన వేళ" లో "ఛాయాచిత్రం" నుంచి "చలన చిత్రం" ఎలా పుట్టింది? మొదటి చలనచిత్రం ఏది? అనే విషయాలు ప్రస్తావించాను. చదివి మీ అభిప్రాయం తప్పక చెప్పండి.

ఆదివారం ఆంధ్రజ్యోతిలో నా కథ - "ఊహాచిత్రం"





ఈ రోజు ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో నా కథ "ఊహాచిత్రం" ప్రకటించారు. సర్రియల్ తరహా శైలిలో వ్రాసిన ఈ కథని చదివి మీ అభిప్రాయం తెలియజేస్తారు కదూ..!!

ఇదీ లంకె: ఊహాచిత్రం

ఈ రోజు సాక్షి లో నా కథ - "పరపతి"


ఈ రోజు సాక్షి ఆదివారం అనుబంధంలో నా కథ "పరపతి" ప్రచురించారు. కథకు లింకు ఇదిగో ఇక్కడ: - పరపతి
చదివి మీ అభిప్రాయం చెప్తారు కదూ..!!

"సురభి"లో నా కథ


టైమ్స్ ఆఫ్ ఇండియా వారి తెలుగు మాస పత్రిక "సురభి" అక్టోబర్ సంచికలో నా కథ "చిరాకు రామనాధం" ప్రచురించారు. ప్రసిద్ధ నాటక రచయిత, సినిమా నటుడు శ్రీ గొల్లపూడి మారుతీరావుగారి సంపాదకత్వంలో వచ్చే ఈ పత్రికలో, ప్రముఖ చిత్రకారుడు శ్రీ బాలిగారి బొమ్మతో నా కథ రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. కథ చదివి మీ అభిప్రాయం చెప్తారు కదూ?

"సాక్షి"లో నా కథ - "అయిదు వందల రూపాయల నోటు"

ఈ రోజు (19.09.2010) "సాక్షి" ఆదివారం అనుబంధంలో నా కథ "అయిదు వందల రూపాయల నోటు" ప్రచురించారు.  చదివి మీ అభిప్రాయం చెప్తారు కదూ..!

అంతర్జాలంలో చదవాలనుకునే వారికి ఇదుగో ఇదీ లింకు: "అయిదు వందల రూపాయల నోటు"


ఈ కథకి బ్లాగ్మిత్రుడు అన్వర్ బొమ్మవెయ్యడం మరో విశేషం.

e-తెలుగుపై ఈనాడు కథనం






అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి కృషి చేస్తున్న స్వచ్చంద సంస్థ e-తెలుగు గురించి ఈ రోజు (29 ఆగస్టు 2010) ఈనాడు హైదరాబాద్ అనుబంధంలో వచ్చిన వార్త ఇది.

ఆవకాయ్.కాంలో నా కథ "మనసొక మధు కలశం"

ప్రముఖ అంతర్జాల పత్రిక ఆవకాయ్.కాంలో నా కథ "మనసొక మధు కలశం"
చదివి ఎలా వుందో చెప్తారు కదూ..!!

ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో నా కథ

ఈ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలో నా కథ "చిలకరాయబారం" ప్రచురించారు. అంతర్జాలంలో ఈ లంకెలో కథ చదువవచ్చు - "చిలకరాయబారం"

కౌముదిలో నా కథ

ఈ మాసం కౌముదిలో నా కథ "వానరవీరుడు" ప్రచురితమైనది. చదివి మీ అభిప్రాయం చెప్పండి.

http://koumudi.net/Monthly/2009/september/index.html

శ్రీరమణ మిథునం - మళయాళంలో "ఒరు చిరు పురించి"

"అప్పదాసు మామయ్య" - "కృష్ణ కురుపు" అయ్యాడు.. "బుచ్చిలక్ష్మి అత్తయ్య" - "అమ్మలుకుట్టి" అయ్యింది.. శ్రీరమణ "మిథునం" వాసుదేవన్ నాయర్ దర్శకత్వంలో "ఒరు చెరి పురించి" అయ్యింది. తెలుగు కథ - మళయాళ చిత్రమైంది. సినిమా కథంత గొప్పగా వుందా అంటే ఇదుగో నవతరంగంలో నా వ్యాసం చదవండి -


శ్రీరమణ మిథునం చూశాను

.

"పొద్దు"లో నా కథ: మంచినీళ్ళ బావి

తడి చుక్కలేని మధ్యప్రదేశ్ పల్లెటూర్లగుండా వెళ్తుంటే మనసు చివుక్కుమంది.. ఉజ్జైనిలో తొమ్మిది రోజులకు ఒకసారి మునిస్పాలిటీ నీళ్ళు వస్తున్నాయని పేపర్లో చదివి మనసు కలుక్కుమంది.. వెరసి "మంచినీళ్ళ బావి" అనే కథ పుట్టుకొచ్చింది.


ప్రముఖ అంతర్జాల తెలుగు పత్రిక "పొద్దు"లో ఈ కథను చదవి మీ అభిప్రాయం చెప్తారు కదు..!!

ఆవకాయ్.కాం లో నా కవిత

ప్రముఖ తెలుగు వెబ్‌సైటు ఆవకాయ్.కాం లో నా కవిత "ప్లాట్‌ఫారం నెంబర్ వన్..!!" ప్రచురించబడింది.
ఇక్కడ నొక్కి, చదివి మీ అభిప్రాయం తెలియజేస్తారు కదూ..!

కథా జగత్‌లో శ్రీరామనవమి ప్రత్యేకం - నా కథ "రామా కనవేమిరా..!!"


అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు


శ్రీరామనవమి సందర్భంగా కోడీహళ్లి మురళి మోహన్‌గారు నిర్వహించే కథా జగత్‌లో నా కథ "రామా కనవేమిరా" ప్రచురించారు. ఇవీ లింకులు:




శ్రీరామనవమికి వేసే పందిళ్ళు, జరిగే సంబరాల నానాటికి మాయమౌతున్న తీరుపై వ్రాసిన కథ ఇది. చదివి మీ అభిప్రాయాన్ని చెప్తారు కదూ..!!


శ్రీ రామ జయ రామ జయ జయ రామ