రూపాయి చెప్పిన బేతాళ కథలు


లోకమంతా లక్ష్మీ కటాక్షం కోరుకుంటుంది. లక్ష్మీదేవి కరుణిస్తే ఉద్యోగులకి జీతం రూపంలో, కష్టజీవులకి కూలీ రూపంలో, వ్యాపారులకి లాభం రూపంలో సంపాదన లభిస్తుంది. కానీ ఆ సంపాదనను సంపదగా మార్చుకునే రహస్యం తెలియక చాలా మంది ధనవంతులుగా మారలేకపోతున్నారు. ఈ రహస్యం తెలిసిన మానవుడు ఎవరైనా వున్నారా అని సంపదకి అధిపతి అయిన కుబేరుడికి అనుమానం వచ్చింది. ఆ అనుమానం తీర్చుకోడానికే "రూపీ బేతాళుణ్ణి" పిలిపించాడు. ఒక ఏటీయంలో వున్న డబ్బులో ఆ బేతాళుణ్ణి నిక్షిప్తం చేశాడు.
***
ధనవంతుడు కావాలన్న కోరికతో ఎంతో కష్టపడుతున్నాడు ఓ మధ్య తరగతి విక్రమార్కుడు. ఎప్పటిలా ఏటీయం వద్దకు వెళ్ళి డబ్బులు డ్రా చేసి మౌనంగా సంపద సాధించే లక్ష్యం వైపు సాగిపోతున్నాడు. అప్పుడు ఆ డబ్బులో వున్న (రూపీ) బేతాళుడు (మధ్యతరగతి) విక్రమార్కుడితో సంభాషణ మొదలుపెట్టాడు. సంపద రహస్యాలను కథల రూపంలో చెప్పడం మొదలుపెట్టాడు. కథ చివరిలో ప్రశ్న వేస్తాడు. విక్రమార్కుడు సరైన సమాధానం చెప్తే తిరిగి ఏటీయంలో దూరుతాడు.
***
ఇదీ స్థూలంగా నేను రాస్తున్న "రూపాయి చెప్పిన బేతాళ కథల" వెనుక కథ. ఈ రోజు విడుదలైన ఆంధ్రభూమి వారపత్రిక సంచికలో ప్రారంభమవుతున్న ఈ కథలను మీరంతా చదివి ఆదరిస్తారని నమ్ముతున్నాను. మీ సూచనలు, సలహాలు, అనుమానాలు, అభ్యంతరాలు తప్పకుండా తెలియజేస్తారు కదూ....
భవదీయుడు
ఈ కథల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోడానికి ఈ బ్లాగుని సందర్శించండి: http://rupeebethal.blogspot.in/

1 వ్యాఖ్య(లు):

Zilebi చెప్పారు...


వెల్కం బెక బెక !!

మళ్ళీ ఫైనాన్సు గీత మొదలెట్టే రన్న మాట !!

భంశు !!

చీర్స్
జిలేబి