హంసినిలో నా కథ

గతంలో హంసిని అంతర్జాల పత్రిక నిర్వహించిన ఉగాది కథలపోటీలో ప్రశంసా పత్రానికి ఎన్నికైన నా కథ "బహిష్కృత" ఈ మాసం ప్రకటించారు. ఆ కథకి లింకు ఇక్కడ.


ఈ కథ దాదాపు దశాబ్దం క్రితం అప్పట్లో జరిగిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగా వ్రాసాను. చదివి మీ అభిప్రాయం చెప్పండి..!!
Category:

3 వ్యాఖ్య(లు):

Manasa Chamarthi చెప్పారు...

కథ చాలా బాగుంది. సుపరిచితమైన మీ పేరును వెదుక్కుంటూ మొత్తానికి ఈ బ్లాగును పట్టుకోగలిగాను.

మీకు అభినందనలు. మరిన్ని కదిలించే కథలను మీ నుండి ఆశిస్తూ,
-మానస

కృష్ణప్రియ చెప్పారు...

సత్యప్రసాద్ గారు,

కథ బాగుంది కానీ కాస్త అబ్రప్ట్ గా ఎండ్ అయిందనిపించింది...

Unknown చెప్పారు...

మానస గారు,
నా పేరు సుపరిచతమని చెప్పి, నా కొసం వెతికి పట్టుకున్నానని ప్రకటించి నేను ఇప్పుడు పాపులర్ అయిపోయిన రచయితనని కొంచెం గర్వం ఇంకొంచెం పొగరు పెంచేశారు.. ధన్యవాదాలు..!!

కృష్ణప్రియగారు,
నా కథల్లో చెప్పాల్సిన విషయం చెప్పగానే కథ అయిపోతుంది. చివర్లో లెక్చర్ ఇచ్చే పేరగ్రాఫు వుండకూడదని నియమం పెట్టుకోని వ్రాస్తుంటాను. అందుకే చాలా కథలు మధ్యలోనే ఆగిపోయినట్లు అనిపిస్తుంటాయి.. బహుశా అందుకే పత్రికల నించి తిరుటపాలో ఠంచనుగా వస్తుంటాయి..

కథ నచ్చినందుకు నెనర్లు..