తోలుబొమ్మలాట

పేరే తోలుబొమ్మలాట అని పెట్టి తోలుబొమ్మలాట అంటే ఏమిటో చెప్పకపోతే ఎట్లా. ఇదిగో ఇదే తోలుబొమ్మలాటంటే-దాదాపు 700 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జానపద కళలో ప్రముఖంగా భారతం, రామాయణం (లంక దహనం మరీ ప్రత్యేకం. ఇక్కడ వున్న చిత్రాలు ఆ కథలోనివే) ప్రదర్శిస్తారు. ఆంగ్లంలో చెప్పే పప్పెట్రీని, షాడో ప్లేలని కలిపి చేసినట్టుండే ఈ కళ ఆంధ్ర తమిళనాడులకు మాత్రమే ప్రత్యేకం.
గొర్రె తోలును ఎండబెట్టి దానిపై రగులద్ది బొమ్మలను తయారు చేస్తారు. ఆ బొమ్మలు పారదర్శకంగా వుంటాయి కాబట్టి తెరవెనక నిలబెట్టి వాటి వెనక దీపాలు (పూర్వం ఆముదపు దీపాలు, ఇప్పుడు కరెంటు దీపాలు) పెడతారు. దాంతో ఆ బొమ్మల రూపం తెల్లటి తెరమీదుగా మనకి కనిపిస్తాయి.చెన్నైలో వుండగా జరిగిన తెలుగు సభలలో తీసినవివి.

1 వ్యాఖ్య(లు):

అజ్ఞాత చెప్పారు...

మీ బ్లాగు tagline బాగుంది... ఈ మద్య పేపర్లో ఇలాటిదే ఒకటి చదివాను.
"" నేనూ కాంగ్రెస్స్ లో చేరాను.. ఒక కోటి సంపాయించాను" అని. (తెలుగు దేశం వారి విమర్శ)
ఇక తోలు బొమ్మలాట... చిన్నప్పుడు చూసాను. ఇప్పుడు చూడాలి.. చూసాక రాస్తాను.