బ్లాగోగులు: మాయాబజార్

తాన శార్మ: ఏమయ్యా ఇవేనా మీరు చేసిన ఏర్పాట్లు?

చినమయ్య: అం అః ఇం ఇః - నవతరంగం, పొద్దు, ఈ మాట, వైజాగు డైలీ

తాన శర్మ: ఓహో హో ఇవి వెబ్ పత్రికలు

చినమయ్య: కూడలి, జల్లెడ, తెలుగు బ్లాగర్స్...

తందాన శాస్త్రి: ఇవన్నీ అగ్రిగేటర్లు

లంబు: రెండు రెండ్లారు, తోటరాముడు, నవ్వులాట, హాస్య దర్బారు, భగవాన్ కార్టూన్లు, వెంకటూన్లు, వికటకవి

తాన శార్మ: మాకు తెలుసులేవయ్యా ఇవి హాస్య బ్లాగులు

జంబు: సాహితీయానం, సంగతులు, దార్ల, కళాస్పూర్తి, పలకబలపం

తాన శర్మ: ఏవుంది.. సాహిత్యం బ్లాగులు

చినమయ్య: సరే ఇవి చూడండి సాములు - హరిసేవ, నరసింహ, దైవలీలలు

తందాన శాస్త్రి: ఆపు ఆపు.. ఇవి భక్తి బ్లాగులు

లంబు: కలగూర గంప, పర్ణశాల, గడ్డిపూలు...

తాన శర్మ: సర్లేవోయ్ ఇవన్నీ అనుభవాల బ్లాగులు

జంబు: ఇంకా వున్నాయి సాములూ

తాన, తందాన: మాకు తెలుసులేవయ్యా ఇంకా వంటకాల బ్లాగులు, పురాణాల బ్లాగులు, సంగీతాల బ్లాగులు వున్నాయి..!! అసలైనది ఏది కనపడదే?

లంబు జంబు
: ఓ తెలిసింది తెలిసింది

తాన, తందాన
: ఏమిటి తెలిసింది?

లంబు జంబు:
బూతు బ్లాగులు...! బూతు బ్లాగులు..!!

తాన, తందాన: శివ శివ శివ శివా.. అలాంటి లేకపోవటమే కదా తెలుగు బ్లాగుల ప్రత్యేకత

లంబు జంబు
: మరింకేం కావాలి సాములూ ??

తాన, తందాన:
బ్లాగులు చదివేవాళ్ళు.. పాఠకులయ్యా చిన్నమయ్యా.... పాఠకులు, వ్యాఖ్యలు లేకపోతే మా ప్రభువులు ఒక్క టపా అయినా వ్రాయరు తెలిసిందా..!!

(సరదా వూహ రాగానే వ్రాసేశాను... ఇందులో వున్న బ్లాగులు అప్పడు గుర్తుకువచ్చినవి మాత్రమే... వేరే ఏ ప్రాధాన్యతలు లేవు )

8 వ్యాఖ్య(లు):

Rajendra Devarapalli చెప్పారు...

:) :) :)

యోగి చెప్పారు...

అపిరాల గారూ.. టెంప్లేట్ చాలా బాగుంది

వేణూశ్రీకాంత్ చెప్పారు...

:-)

vrdarla చెప్పారు...

ఒక ప్రయత్నం.అభినందనలు

Rajendra Devarapalli చెప్పారు...

నేను నిన్న మౌనవ్రతం లేండి :) అందుకే ఇలా :) ;( అని సరిపుచ్చాను
ఇలాంటి ప్రయత్నాలు మరికొన్ని చెయ్యాలి మీరు

జ్యోతి చెప్పారు...

బాగా చెప్పారండి. ఇప్పుడైతే బ్లాగులు ఎక్కువయ్యాయి. చదువరులే పెరగాలి. అందుకే మనమందరం బ్లాగులు తెరవండి అని చెప్పకుండా మీ కంప్యూటర్‌కు తెలుగు నేర్పించండి. బోలెడు విషయాలు జాలంలో ఉన్నాయి చదవండి అని చెప్పాలి.

నేస్తం చెప్పారు...

అబ్బా ఏం రాసారండి నిన్ననే చూసా ఆ సినిమా :)

నేస్తం చెప్పారు...

అబ్బా ఏం రాసారండి నిన్ననే చూసా ఆ సినిమా :)