గేటు పడింది

రైల్వే గేటు పడగానే

అప్పటిదాకా పరుగెత్తుకొచ్చిన బండ్లన్ని

ఇంజెన్లు ఆపుకొని గస పెడుతుంటాయి..బీడీ తాగుతూ నిలబడ్డ గేట్‌మాన్ కి

ఆగిన ఆటోలో పాటల రొదకన్నా

గేటు ఎక్కువసేపు వేసినందు ఇచ్చే సోడ కూత బాగా వినపడుతుందిగేటు పడింది తమ కోసమే అని నమ్మే చిల్లర వ్యాపారమంతా

సైనికులై బస్సులమీదకి దండెత్తుతాయి

వుడకబెట్టిన శనక్కాయలు పొట్లాలైపోతాయిచిప్స్, పాప్‌కారన్‌లు, వాటర్ పాకెట్లు, పార్లే బిస్కెట్లు, కూల్ డ్రింకులు

వీటన్నిటి దూకుడు బేరాల దెబ్బకి

చక్కిలాలు, తేగలు, నూగు జీడీలు మూగపోతాయిఅక్కడ బస్సు దిగిన బీడీ, చుట్ట, సిగిరెట్ పొగంతా

రైలుకు దీటుగా పైకిలేచి పల్చబడుతుంది

ఏ పసిపిల్లో, ముసలాడో దాన్ని ఒక్క దగ్గుతో తరిమేస్తారుసినిమాకి లేటౌతుందని గేటు దూరిన సిల్కు చీర

మొగుడు స్కూటర్‌ని రైలొచ్చేలోపల దాటిస్తాడా లేదా అని

కళ్ళతోనే ప్రశ్నార్ధకాలేస్తుంటుందిస్కూలు బస్సులో యూనీఫారం పిల్లలకి

గంపలో సరుకేసుకెళ్ళి అమ్మే పిల్లాడి ఆశలు

సమోస మడతల్లా ముడుచుకుపోతాయిపగిలిపోయిన కళ్ళద్దాల ముసలమ్మ మాసిపోయిన చీరలో

ఆమె కొడుకు చెప్పు గుర్తులు..!!

కారులోనించి రూపాయి పడేసే నల్ల కోటుకి అవి కనపడవుఇన్ని కథలు ఇక్కడ జరుగుతుంటే

సాధారణంగా మనం ఆ రైల్లో కూర్చొని

రెప్పపాటులో అన్నిటినీ దాటిసి వెళ్ళిపోతుంటాము


(13 జనవరి 2009, లక్నోలో ఒక రైల్వే గేటు దగ్గర నిల్చున్నప్పుడు)
Category:

6 వ్యాఖ్య(లు):

ప్రపుల్ల చంద్ర చెప్పారు...

కళ్ళకి కట్టినట్టు వ్రాసారు... రైల్వే గేటు దగ్గర ఎప్పుడూ చూసే దృశ్యమే అయినా, మీరు చాలా అందంగా చిత్రీకరించారు.

సుభద్ర చెప్పారు...

abba adirindi,vizagnunchi kakinada
vellutunte pittapuram gate untundi.
nenu yappudu gate padaalani korukuntaa,yandu kante pittapuram mokkajonnapotu rucheveru mari.
meeru aavipu velite tappaka try cheyandi.
mee railway gate daggara jonnapottulu ammaraaaaaaaaa

అజ్ఞాత చెప్పారు...

Chaala natural ga undi...
Guess thats why Poetry is called spontaenous expression of emotions/feelings. Keep it up Brother!

Rajendra Devarapalli చెప్పారు...

హాఁ ...ప్రసాద్ గారూ...
ఎక్కడికో తీసుకెళ్ళారు.
ఊరుపేరు గుర్తులేదుగానీ...ఒక్కసారి రైల్వే గేటుపడ్డాక సీసాతో తెల్లటిద్రవం తెచ్చారొకచోట.మజ్జిగా అన్నా..కాదు కల్లు అన్నారు..
కిసుక్కు :)

Unknown చెప్పారు...

ప్రపుల్ల చంద్ర గారు,
నెనర్లు

సుభద్ర గారు,
అమ్ముతారు... చల్లటి వర్షాకాలం సాయంత్రం రండి వేడి వేడిగా ... వుప్పు, నిమ్మకాయ పట్టించి... ఆహా...!!

సుధా కిరణ్
Thank you

రాజేంద్ర గారు,
ఆ తరువాత జరిగిందే చెప్పాలి మీరు... పుచ్చుకున్నట్టా లేనట్టా

prasad చెప్పారు...

నిజం..
తరచి చూస్తే తరగని నిజాలు.
నాకేమొ ఎప్పుడూ కవితలంటే భయం
వారపత్రిక కానీ మాసపత్రిక కానీ కొనగానే కవితలపేజీలన్నీ జెట్ స్ఫీడ్ తో త్రిప్పేసెవాడిని
కానీ సత్య ప్రసాద్ గారూ
మీ కవిత చదువుతుంటె
ఒకె ధృశ్యం లోని రకరకాల కోణాలను
స్ఫృశింప చేశారు
ధన్యవాదాలు.