యాభైల్లో పత్రికాప్రకటనలు - 2


(గత టపా తరువాయి)

డాక్టరు కావడం ఇంతకన్న సులభం కాలేదు..!! జై "జుల్లుంధర్" సిటీ.ప్రచురణ సంస్థ పేరు చేస్తున్న సేవకు తగ్గట్టుగానే వుంది..


మొబైల్ డాక్టర్.. ఈ షాపులు ఇప్పుడున్నాయో లేదో..


ఈ రెండు ప్రకటనల్లో ఒకటి వాచి కొంటే బైనాకులర్స్ ఫ్రీ ఇంకొకటి ఏదో తైలం కొంటే వాచీ ఫ్రీ... అసలు ఈ సన్యాసి ఫార్మసివారు ఫరీదాబాద్ నుంచి, ఇండో ట్రేడింగ్ వారు బొంబాయి నుంచి ఇవన్నీ పంపిస్తారంటారా?


ఈ "జుల్లుంధర్"లో మొత్తానికేదో విషయం వుంది. మీరు పువ్వు పేరు కార్డురాస్తే మీ జాతకం చెప్పడమంటే మాటలా? అదిన్నూ రూపాయి నాలుగణాలకే..!!


ఇది నాకు బాగా నచ్చింది - ఏ హడావిడి లేకుండా చెప్పదల్చుకున్నది బొమ్మలో చెప్పేసారు..


అదండీ విషయం.


(రచన పత్రిక వెబ్సైటులో కథా ముత్యాల పేరిట పాత కథలు పెట్టారు. ఆ కథల మధ్యలో నుంచి సేకరించినవే ఈ ప్రకటనలు.)

1 వ్యాఖ్య(లు):

Saahitya Abhimaani చెప్పారు...

చల్ల బాగున్నదండి మీ టపా. అప్పటి ప్రకటనలు పోగుచేసి, కాలగమనంలో వచ్చిన మార్పులవల్ల ఆ ప్రకటల్లోని హాస్యం బయటకు తెస్తున్నారు. ఇప్పుడు టి విల్లో వచ్చే ప్రకటనలు ఇంకా 20 ఏళ్ళ తరువాత చూస్తే(కొన్ని ఇప్పటికే ఎంతో ఎబ్బేట్టుగా ఉండి నవ్వు చిరాకు తెప్పిస్తున్నాయి) అప్పటికి ఎంత హాస్యం పుడుతుందో కదా!!

పాత ప్రకటన్ల్లో ఒక మోసపూరిత ప్రకటన వచ్చేది. గళ్ళల్లో అడ్డం నిలువు ఏదో ఒక సంఖ్య సులభంగా వచ్చేది ఇచ్చేవారు. పూర్తి చేసినవాళ్ళకి ఏదో బహుమానం అనేవాళ్ళు. పంపిన ప్రతివాడికి బహుమానం అని ఉత్తరం వచ్చేదిట. ఏవో కొన్ని ఖర్చులు అని డబ్బు గుంజేవాళ్ళు. ప్రస్తుతం ఇంటర్నెట్ లో నైజీరియా వాళ్ళు చేస్తున్నట్టు.