కలియుగ కర్ణుడికి...

ఎందుకు పుట్టవు పసికందూ..

ఎందుకు బతికావు

నాకొద్దు పొమ్మని అమ్మ నిన్ను విసిరెసినప్పుడు

ఎంగిలి విస్తరాకుల పొత్తిగుడ్డలపై

పడుకోమని పంపినప్పుడు

చెత్తకుప్పల చెత్తకప్పుకు చలిలో వణికినప్పుడు

తొడుక్కోను గుడ్డాలేక నగ్నంగా నువ్వు తిరిగినప్పుడు

ఎందుకు చచ్చిపొలేదు నువ్వు?


***అనురాగంతో నిన్ను చేరదీయను రాధమ్మ లేదు


ఆప్యాయంగా ఆదరించే సుయొధనులం కాలెము మేము


అభినవ కర్ణుడా నువ్వు బ్రతకటం ఇక తప్పు


నీ జీవనం మానవతకే పెద్ద ముప్పు.(07.01.1999, వార్తాపత్రికలొ తల్లి వదిలేసిన బిడ్డ గురించి చదివి స్పందించి..)


Category: